Saturday, 16 September 2017 07:24

'కిమ్‌'ను దారికి తెచ్చిన నెల్లూరోళ్ళు

Written by 
Rate this item
(0 votes)

galpikaదూకుడు తగ్గించిన ఉత్తర కొరియా... ఆగిన మిస్సైల్స్‌ ప్రయో గాలు... అంతు తెలియని వ్యాధితో బాధపడుతూ మంచాన పడ్డ ఉత్తర కొరియా అధినేత కిమ్‌... మధ్యప్రాచ్య దేశాలలో వెల్లివిరుస్తున్న శాంతి... తొలగిన యుద్ధభయాలు... కిమ్‌ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్య వంతుడు కావాలంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రత్యేక ప్రార్థనలు... బీబీసీలో వస్తున్న ఈ వార్తలను వాషింగ్టన్‌లోని వైట్‌ హౌస్‌లో కూర్చుని ట్రంప్‌తో పాటు జపాన్‌ ప్రధాని షింజోఅబే, జర్మనీ ఛాన్స్‌లర్‌ మోర్కెల్‌ ఏంజల్‌, బ్రిటన్‌ ప్రధాని థెరిస్సామేలు చూస్తున్నారు. బీబీసీలో వచ్చిన వార్తను చూసి జపాన్‌ ప్రధాని షింజోఅబే నోరు తెరి చాడు. కిమ్‌కు ఏమైవుంటుంది, చూడండి ఒక్క మనిషి రోగంతో మంచానపడితే ప్రపంచం ఎంత ప్రశాంతంగా ఉందో... అతను ఎల్ల కాలం ఇలాగే వుంటే బాగుండు... అందరం మన శ్శాంతిగా వుంటా మని అన్నాడు. అందుకు ట్రంప్‌... ఆ కిమ్‌ ఇప్పు డిప్పుడే కోలుకోడు... కోలుకున్నా మునుపటిలా ఉద్రేకంతో వూగిపోడు, అతనిలోని శక్తినంతా లాగేసాము... అని చెప్పాడు. ఎలా లాగారు, అసలు కిమ్‌ ఎందుకు అలా తయారయ్యాడు. అతను మంచాన పడడానికి కారణ మేంటని షింజో అబే అడిగాడు. అప్పుడు ట్రంప్‌ వారిని ఫ్లాష్‌బ్యాక్‌లోకి తీసుకెళ్ళాడు.

-----------

వైట్‌హౌస్‌లో ట్రంప్‌ దిగులుగా కూర్చుని వున్నాడు. అప్పుడే భారత ప్రధాని నరేంద్ర మోడీ అక్కడకు వచ్చాడు. ట్రాజెడీ ఫేస్‌తో వున్న ట్రంప్‌ను చూసి విషయం ఏంటని మోడీ అడిగాడు. మీకు పాకిస్థాన్‌తో ఎలాంటి తలనొప్పులున్నాయో, నాకు ఆ కిమ్‌గాడితో అలాంటి తలనొప్పులే వున్నాయి. వాడి వంక సక్కంగా తీస్తే గాని నాకు మనశ్శాంతి లేదని ట్రంప్‌ అన్నాడు. దానికి మోడీ... అన్ని సమస్యలను శక్తితో అధిగమించలేం, కొన్నింటిని యుక్తితో మేధాశక్తితో గెలవగలం. నేను ఇండియా నుండి ఒక టీమ్‌ను పంపిస్తాను, మీ సమ స్యను వాళ్ళే పరిష్కరిస్తారని చెప్పి మోడీ అక్కడనుండి లేచాడు.

వారం తర్వాత...

ప్రధాని నరేంద్రమోడీ ఆదేశా లతో మాజీఎమ్మెల్యే స్టైల్‌ ఆఫ్‌ సింహ పురి ఆనం వివేకా(65+) నేతృత్వం లోని మేయర్‌ అజీజ్‌, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌ కుమార్‌యాదవ్‌, నుడా ఛైర్మెన్‌ కోటం రెడ్డి శ్రీనివాసులురెడ్డి, కమిషనర్‌ ఢిల్లీ రావు, మరో పదిమంది కార్పొరేటర్ల బృందం అప్పుడే వైట్‌హౌస్‌కు చేరు కుంది. వివేకా బ్యాచ్‌ ట్రంప్‌ ఎదు రుగా కూర్చుంది. దిగులుగా వున్న ట్రంప్‌ను చూస్తూ వివేకా... చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి అని అడిగాడు. అందుకు ట్రంప్‌... అందమైన యువతులను చూస్తే చాలు... వారి అందాలను వర్ణించాలనిపిస్తుంది అని చెప్పాడు. ఈ సమస్య నాకు కూడా వుంది... కాకపోతే నీకు నోటి దూల ఎక్కువ కాబట్టి బయటపడతావు, నేను బయటపడనంతే... ఇది మం దులు, మాకులతో నయమయ్యేది కాదు, మనుషులతో పాటే పోవాలి. నేను అడిగింది మీ అలవాట్ల గురించి కాదు, మీకేదో సమస్య వుందని మోడీ మమ్మల్ని పంపించాడు. దానిని పరిష్కరించి రమ్మని చెప్పాడు అని వివేకా అన్నాడు. అప్పుడు ట్రంప్‌కు 'కిమ్‌' విషయం గుర్తుకు వచ్చింది. ఓహో... మోడీ నాకు హెల్ప్‌ చేయమని వీరిని పంపించి నట్లున్నాడు. అయినా అగ్రరాజ్య అధి నేతనైన నాకే వణుకు తెప్పిస్తున్న ఆ కిమ్‌ను వీళ్లేం చేయగలరు అని మన సులో అనుకుంటూ 'కిమ్‌'తో వస్తున్న సమస్యను చెప్పాడు. కిమ్‌ పిచ్చి చేష్ట లతో మూడో ప్రపంచ యుద్ధం వచ్చే టట్లుందని చెప్పి ఆవేదన చెందాడు. అది విన్న వివేకా మనసులో... మేం నిన్ను పిచ్చోడివనుకుంటున్నాం, నువ్వే ఇంకొకడిని పిచ్చోడు అంటు న్నావంటే వాడింకెంత పెద్దపిచ్చోడో అని అనుకుంటూ... సార్‌, ఆ కిమ్‌ సంగతేంటో మేం చూసుకుంటాం, ముందు మేం ఉత్తరకొరియా వెళ్ళడానికి స్పెషల్‌ ఫ్లైట్‌ అరేంజ్‌ చేయండి అని వివేకా అడిగాడు. ట్రంప్‌ వెంటనే అధికారులకు స్పెషల్‌ ఫ్లైట్‌ ఏర్పాటు చేయమని ఆదేశాలిచ్చాడు. వివేకా బృందం అక్కడనుండి లేచి ఎయిర్‌పోర్టుకు బయల్దేరబోతుండగా కమిషనర్‌ ఢిల్లీ రావు చేతిలో వున్న సూట్‌కేసును చూసి ట్రంప్‌... ఆ సూట్‌కేసులో ఏముందని అడిగాడు. 'కిమ్‌' పని బట్టబోయే ఆయుధాలు అందులోనే ఉన్నాయని చెప్పి వివేకా అక్కడనుండి ముందుకు కదిలాడు.

------

ఇక్కడితో ఫ్లాష్‌బ్యాక్‌ అయిపో యింది. షింజో అబే వుండి... వివేకా టీం ఉత్తరకొరియాకు బయల్దేరింది. ఆ తర్వాతేం జరిగిందని అడిగాడు. దానికి ట్రంప్‌... వాళ్ళు రహస్యంగా ఉత్తరకొరియాలో అడుగుపెట్టారు. పర్యాటకుల మాదిరిగా అధ్యక్ష భవ నానికి వెళ్లారు. అక్కడ కమిషనర్‌ ఢిల్లీరావు తన చేతిలో వున్న సూట్‌ కేసును తెరిచాడు. అందులో నుండి కోట్లాది విషజీవులు బయటకొ చ్చాయి. వాటిని ఇండియన్స్‌ ఐఆర్‌ 20-420 నెల్లూరు మున్సిపల్‌ ముదురుదోమలని పిలుస్తుంటారు. ఇలా ఒక్కో దోమ ఒక్కో అణు బాంబుతో సమానం. వంద బుల్లెట్ల కంటే పవర్‌ఫుల్‌. ఒక్క బుల్లెట్‌తో ఒక మనిషిని ఒక్కసారే చంపగలం. కాని ఒక దోమ వందమందినైనా కరవ గలదు. వందలమందిని ఆసుపత్రి మంచమెక్కించగలదు. మనిషిని బ్రతక్కుండా అలాగని పూర్తిగా చావ కుండా చేయగలదు. ఇవి కరిచా యంటే ఒకేసారి చావడం కాదు బ్రతి కినంతకాలం ప్రతిరోజూ చస్తుండా ల్సిందే! అంతటి శక్తివంతమైన ముదురుదోమలను కిమ్‌ గదిలో వదిలేసి వివేకా బృందం వెంటనే తిరిగొచ్చేసింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు. రెండు రోజుల తర్వాత చూస్తే కిమ్‌ విషజ్వరంతో మంచం పట్టాడు. లోకం ప్రశాంతంగావుంది. ఏది ఏమైనా థ్యాంక్యు మోడీ... థాంక్యూ నెల్లూ రియన్స్‌ అని ట్రంప్‌ అన్నాడు. అది విన్న మిగతావాళ్లు కూడా కోరస్‌గా హేట్సాఫ్‌ నెల్లూరులీడర్స్‌ అని అరిచారు.

Read 157 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…

Newsletter