16 September 2017 Written by 

'సెల్ఫ్‌' కిల్లింగ్‌

selfiఏ సరదా అయినా..అందుకూ ఓ పరిమితి ఉంటుంది. హద్దులు దాటిపోయి మితిమీరిన ఉత్సాహంతో వళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తే అది ఏ సరదా అయినా చివరికి ముప్పుగానే పరిణమిస్తుంది. ఈ అధునాతన కాలంలో యువత ముఖ్యంగా యువకులు సెల్ఫీ జోరుతో ప్రాణాల మీదికి తెచ్చుకోవడం ఎంతైనా విచారకరం. సెల్ఫీ తీసుకోవడం ఎంతో ముచ్చటైన అంశం. అయితే, అక్కడక్కడా కొన్ని సంఘటనల్లో అది బాధాకరంగా మిగులుతోంది. ఒక మధురమైన జ్ఞాపకంగా ఉండాల్సిన ఆ అంశం మరణంగా మిగులుతుండడమే విషాదం.

సెల్ఫీ తీసుకోవాలనుకుని చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోతోంది. సంతోషంగా సెల్ఫీ తీసుకుంటామని వెళ్ళిన తమ బిడ్డలు అలానే గాల్లో కలిసిపోయేరంటే ఆ తల్లిదండ్రులు పడే బాధ ఎలా ఉంటుందో ఒక్క సారి గ్రహించండి. నది ఒడ్డున సెల్ఫీ తీసుకోవడం మంచిదే కానీ, నది మధ్యలో కెళ్ళి సరదాగా సెల్ఫీ తీసుకోవాలనుకుని నదిలో మునిగిపోతే ఏమను కోవాలి?.. సెల్ఫీ తీసుకోవడం ఎంత ఫ్యాషనైనా, దాన్ని తీసుకోవడంలో ఏమరుపాటు వహించి కొందరు ప్రమాదాల పాలవుతున్నా ఎవరూ పట్టించు కోవడం లేదు. ఇంకా మరికొందరు అదే దారిలో వెళ్ళిపోతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న సూళ్ళూరు పేట నుంచి మోటార్‌బైక్‌పై అత్యంత వేగంగా వెళ్తూన్న ఇద్దరు యువకులు, ఆ వేగంలోనే సెల్ఫీ తీసుకోవాలనుకుని లారీని ఢీకొట్టి ప్రాణాలు పోగొట్టు కున్నారు. కారూరి పంచాయతీలోని కారూరిమిట్ట వద్ద జాతీయరహదారిపై ఈ నెల 8న జరిగిందీ దుర్ఘటన. చెన్నై వైపు మోటార్‌బైక్‌లో వెళ్తున్న ఆ యువకులిద్దరూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన మోనో, వీరేేంద్ర అని, వీరిద్దరూ గుమ్మిడిపూండిలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవారని తెలిసింది. బైక్‌రైడింగ్‌ చేస్తూ.. ఆ వేగంలోనే సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ కిందపడి నెత్తురుమడుగులో ఉన్న వారి మృతదేహాల పరిస్థితి అత్యంత దయనీయం. అంతేకాదు, వారి చేతిలో మద్యం సీసాలు కూడా ఉన్నాయని కేసును పరిశీలిస్తున్న పోలీసులు గుర్తిం చారు. మోటార్‌బైక్‌పై అత్యంత వేగంతో.. గాలితో పోటీ పడుతున్నట్లు వెళ్తూ..మధ్యలో బైక్‌ను వంకర్లు తిప్పడం..మద్యం మత్తులో కిందామీదా అయి పోవడం..చేతులు వదిలేసి గాల్లో ఫోజులు కొట్టడం, ఇవన్నీ చాలవన్నట్లు మళ్ళీ ఆ వేగంలోనే సెల్ఫీ తీసుకోవాలని ఒకచేత్తోనే బైక్‌ నడుపుతూ వెనక్కి తిరిగి సెల్ఫీ తీసుకోవాలని ఆరాటపడడం... చివరికి ఏమైంది?.. రోడ్డుపక్కన ఉన్న లారీని వేగంగా ఢీ కొట్టి.. కిందపడిపోయారు. తలలు పగిలిపోయాయి.. శరీరాలు నుజ్జునుజ్జు అయిపోయాయి. కొద్దిసేపట్లోనే నెత్తుటిమడుగులో విలవిలలాడుతూ అక్కడికక్కడే మృతిచెందారు. ఎక్కడ పుట్టారో.. ఎక్కడ పెరిగారో.. ఇక్కడ నడిరోడ్ల మీద వారి జీవితాలు ఇంత ఘోరంగా కడతేరిపోయాయి. వారి తల్లిదండ్రులకు ఈ దుర్ఘటన తెలిసి ఎంతగా అల్లాడిపోయుంటారో?... సెల్ఫీ సరదాలు, విచ్చలవిడి స్నేహాలు.. మద్యలో మద్యం గుటకలు.. ఇవన్నీ కలసి యువత ప్రాణా లను రకరకాలుగా తీసేస్తున్నాయి. ఎక్కడో కొండల మీదికెక్కి సర్రున జారుతూ సెల్ఫీలు తీసుకో వాలని ప్రయత్నించడం, సాహస దృశ్యాలను సెల్ఫీల్లో బంధిం చాలనుకుని తామే ఆ సాహసాలను చేసేయడం, గాల్లో పల్టీలు కొట్టడం, సముద్రాల్లో ఈత కొడుతూ సెల్ఫీలు దిగాలని ప్రయత్నించడం.. ఇలా ఒకచోటే మిటి.. వెర్రెత్తినట్లు ప్రవర్తించేవారు కొందరైతే, సెల్ఫీ దిగుదామని అనుకుంటూ ఏ సాహసమో చేస్తూ... అజాగ్రత్తతో ప్రాణాలు పోగొట్టేకునేవారు మరికొందరు. ఎక్కడైనా సరే, మితిమీరిన ఉత్సాహం, ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం కలసి వెరసి ప్రాణాలకే ముప్పు వస్తోంది. సెల్ఫీల కోసమో..లేదా సాహసం కోసమో.. బైక్‌లపై రోడ్లమీద అత్యంత వేగంతో వెళ్తూ విన్యాసాలు చేసేవారిని చూస్తే ఎవరికైనా గుండెలు అదురుతుంటాయి. వారు ఆ స్పీడ్‌లో ఏమైపోతారో?..ఎదురుగా వచ్చేవారిని ఢీ కొని మరెంత మంది ప్రాణాలు పోగొడతారోనని హడలి చస్తుంటారు చూస్తున్న జనం. జిల్లాలో, ముఖ్యంగా నెల్లూరు నగరంలో ఆ తరహా కుర్రకారు విన్యాసాలు మరీ ఎక్కువైపోతున్నాయి.

తల్లిదండ్రులో.. అధికారులో ఎవరూ పట్టించు కోకుంటే ఇలాంటి మరణాలు మరింతగా పెరిగి పోతాయి. అలాంటి బిడ్డలను అదుపులో పెట్టుకో కుంటే.. ఆ తర్వాత ఏ ప్రమాదమో జరిగిపోయాక భోరుమని విలపించి ప్రయో జనం ఏముంటుందీ?.. అయినా, సెల్ఫీలు తీసుకోవడంలో పిల్లలు అజాగ్రత్తతో ప్రమాదాలకు లోనుకాకుండా తగు జాగ్రత్తలు చెప్పు కోవాల్సింది ముందుగా వారి తల్లిదండ్రులు.. కుటుంబసభ్యులే. రోడ్లమీదికొచ్చి బైక్‌లపై వీరంగాలు చేసేవారికి తగు పాఠం చెప్పాల్సింది మాత్రం అధికా రులే!...ఏదేమైనా ముచ్చటగా తీసుకోవాల్సిన సెల్ఫీ లను.. యువత అజాగ్రత్తతో ఇలా ప్రాణాలమీదికి తెచ్చుకోవడం బాధాకరం!..ఏ సెల్ఫీ కూడా.. పది కాలాలపాటు జ్ఞాపకంగా ఉండేలా చూసుకోవాలే గానీ, వారికి అదే చివరి సెల్ఫీ కాకూడదు. ఆ పరిస్థితి ఎవరికీ రాకూడదు. అందుకే..తస్మాత్‌!..జాగ్రత్త!..



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ల్యాండవుతున్న విమానం
    దగదర్తి విమానాశ్రయం కల సాకారానికి రోజులు దగ్గరపడ్డాయి. త్వరలోనే విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లు పిలవడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసర మైన 1350 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. భూసేకరణకు సంబంధించి రైతుల పరిహారానికి నిధులు…
  • కార్పొరేషన్‌లో కోల్డ్‌వార్‌
    వివాదాలకు, విభేదాలకు నెల్లూరు కార్పొరేషన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ లాంటిది. నెల్లూరు నగరంలో ఎన్ని రకాల సమస్యలుంటాయో నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో కూడా అంతకంటే ఎక్కువ సమస్యలే వుంటాయి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే పాలకవర్గం వుంటే అధికారులు సహకరించరు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులున్నప్పుడు…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
    నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…
  • పాదయాత్ర చేస్తున్నా... ఆశీర్వదించండి
    వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం శంషాబాద్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి వారి ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని కలుసుకున్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని తనకు చేతనైన మేరకు వారికి సహాయసహకారాలు అందించడానికి త్వరలో నవ్యాంధ్రలో…

Newsletter