16 September 2017 Written by 

15-09-2017 రాశిఫలాలు

rasi 15

1Ariesమేషం

ఆలోచనలు, అభివృద్ధి ప్రయత్నాలు వేగవంతంగా జరుగుతాయి. పిల్లల విద్యా వివాహ విషయాలపై చర్చ లుంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆదాయము తృప్తికరం. దూరప్రాంత ప్రయాణాలు నిర్ణయం కాగలవు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం క్రమంగా చేకూరుతుంది. బంధుమిత్రుల సహాయ సహ కారాలుంటాయి. విద్యా ప్రగతి బాగుంటుంది.

 

2Taurusవృషభం

మీ ప్రయోజనాలకు బంధువులు, స్నేహితులే అడ్డు పడుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. రాబడి తగ్గుతుంది. కొన్ని అదనపు ఖర్చులు తప్పనిసరిగా ఉంటాయి. స్థిరాస్తుల లావాదేవీలు జరగడం, పెట్టు బడులకు అవకాశాలు దొరకడర జరుగుతుంది. ఉద్యో గులకు పనివత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలలో బాగా సిద్ధమై ప్రయత్నించండి.

 

3Geminiమిధునం

రావలసిన బాకీలు నిలబడిపోతాయి. కుటుంబ, వ్యాపార వ్యవహారాలను సొంతంగా పరిశీలిస్తుండాలి. వృత్తి వ్యాపారాలు కొంత మెరుగుగా ఉంటాయి. ఆదాయం సామాన్యంగా ఉంటుంది ఇతరులకు ఆర్ధికంగా, మాట రూపంలో సహాయపడతారు. కొత్త స్నేహాలు పరిచయాలుంటాయి. సోదర వర్గానికి మేలు జరుగుతుంది. విద్యాప్రగతి బాగుంటుంది.

 

4Cancerకర్కాటకం

సరైన సమయం సరైన నిర్ణయాలు తీసికొనలేక టెన్షన్‌ పడుతుంటారు. సమయానికి జ్ఞాపకాలు రావు. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలందు అభివృద్ధి బాగుండి ఆదాయం పెరుగుతుంది. పనులు అనుకొన్నవి నిదానంగా సాగుతాయి. కొత్త వ్యాపార ప్రయత్నాలకు, పెట్టుబడులకు అనుకూల అవకాశాలుం టాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ అవసరం.

 

5Leoసింహం

మంచి ఆర్ధిక ప్రణాళికలతో ముందుచూపుతో వృత్తి వ్యాపారాలందు ప్రదర్శించి ఆదాయం పెంచుతారు. ప్రభుత్వ పరంగా అనుమతులు, ఋణాలు లభిస్తాయి. దూరప్రాంతాలకు పోవడానికి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలు ఆలోచనలుంటాయి. ఉద్యోగులకు పని భారం ఉండినా అధికారుల నుండి గుర్తింపుంటుంది.

 

6Virgoకన్య

తొందరపాటు మాటలు, ప్రవర్తన తగ్గించుకొనండి. వ్యాపారాలు సామాన్యంగా జరుగుతాయి. స్వల్ప ఆర్ధిక ఇబ్బందులుండవుచ్చను. కుటుంబంలో గాని, బంధు వర్గంలో గాని అనారోగ్య బాధితులుంటారు. కొన్ని అన వసర ఖర్చులుంటాయి. ఆత్మీయులతో, బంధువులతో జాగ్రత్తగా మెలగండి. ఆర్ధిక లావాదేవీలు, క్రయవిక్ర యాలు వాయిదా వేసికొంటే మంచిది.

 

7Libraతుల

అనుకోని ఖర్చులు, మొగమాటం వల్ల ఖర్చులు అదనంగా ఉంటాయి. దైవకార్యాలు, సభలు సమావేశా లలో పాల్గొంటారు. అనుకున్న పనులను సమర్ధవంతంగా జరుపుకొంటారు. వృత్తి వ్యాపారాలలో ఆదాయం, అభివృద్ధి అవకాశాలుంటాయి. అప్పులను, హామీలను త్వరపడి ఇవ్వవద్దు. ఉద్యోగులకు స్థానమార్పులు, అధికార వర్గ సహకారం ఉంటుంది.

 

8Scorpioవృశ్చికం

వృత్తి వ్యాపారాలలో పెరుగుదలతో పాటు రాబడి పెరుగుతుంది. కుటుంబసభ్యులతో సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. ప్రభుత్వం నుండి రావలసిన బాకీలు, అనుమతులు, బ్యాంకు ఋణాలు లభించగలవు. శుభకార్య నిర్ణయాలు జరిపి పనులందు నిమగ్నం కాగలరు. వ్యాపారులకు, ఉద్యోగులకు అధికారుల వల్ల వత్తిడి ఉంటుంది. దూరప్రయాణాలుంటాయి.

 

9Sagittariusధనుస్సు

ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకొనాలి. అనుకున్న పనులకు ఆటంకాలు కలిగి ఆందోళన కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి అవకాశాలు బాగుండి ఆదాయం పెరుగుతుంది. షేర్లు, పెట్టుబడులపై లాభాలుంటాయి. ఉద్యోగులకు కార్యదక్షత, అధికారవర్గం నుండి సహకారం లభిస్తుంది. రావలసిన బాకీలు, వస్తువులను పొందుతారు. విద్యార్థులు మరింత కృషి చేయవలసి ఉంటుంది.

 

10Capricornమకరం

ఆర్ధిక వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించండి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప ఇబ్బందులుంటాయి. రాబడి సామాన్యంగా ఉంటుంది. పనులందు టెన్షన్‌ ఎక్కువగా ఉంటుంది. గృహ వస్తువాహన రిపేర్లుంటాయి. వాహనాలు నడపడం, కరెంటు పనులందు జాగ్రత్త అవసరం. ప్రయాణాలు ప్రయోజనకరంగానే ఉంటాయి. ఉద్యోగప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది.

 

11Aquariusకుంభం

ఆర్ధికంగా స్థిరపడటం ప్రారంభం కాగలదు. రాబడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూలత ఉం టుంది. ఉద్యోగులు వ్యాపారులు అధికారులతోను పబ్లిక్‌తోను జాగ్రత్తపడండి. కొత్త వ్యాపారాలు, భాగ స్వామ్య వ్యాపారములు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులను సమన్వయం చేసికొంటూ సాగండి. కొత్త వస్తువులు సమీకరించుకొంటారు.

 

12Piscesమీనం

పనులు సకాలంలో నిర్వహిస్తారు. ఇంటా బయట ప్రత్యర్థులను, అవరోధాలను తొలగించుకొనగలరు. వ్యాపార వృద్ధి ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబంలో, బంధువులలో ఒకరు అనారోగ్యంతో బాధ పడతారు. వస్తు వాహనాలు పోగొట్టకొనకుండా జాగ్రత్త పడాలి. శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత తక్కువ. పెట్టుబడులకు ప్రోత్సాహం బాగుంటుంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ల్యాండవుతున్న విమానం
  దగదర్తి విమానాశ్రయం కల సాకారానికి రోజులు దగ్గరపడ్డాయి. త్వరలోనే విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లు పిలవడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసర మైన 1350 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. భూసేకరణకు సంబంధించి రైతుల పరిహారానికి నిధులు…
 • కార్పొరేషన్‌లో కోల్డ్‌వార్‌
  వివాదాలకు, విభేదాలకు నెల్లూరు కార్పొరేషన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ లాంటిది. నెల్లూరు నగరంలో ఎన్ని రకాల సమస్యలుంటాయో నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో కూడా అంతకంటే ఎక్కువ సమస్యలే వుంటాయి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే పాలకవర్గం వుంటే అధికారులు సహకరించరు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులున్నప్పుడు…
 • ఆనంకు చుక్కెదురు?
  నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
 • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
  నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…
 • పాదయాత్ర చేస్తున్నా... ఆశీర్వదించండి
  వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం శంషాబాద్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి వారి ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని కలుసుకున్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని తనకు చేతనైన మేరకు వారికి సహాయసహకారాలు అందించడానికి త్వరలో నవ్యాంధ్రలో…

Newsletter