Thursday, 28 September 2017 13:03

అమరావతిలో మహిష్మతి

Written by 
Rate this item
(0 votes)

galpikaఅది గన్నవరం ఎయిర్‌పోర్టు. హైటెక్‌రత్న, ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు చేతిలో పూలబొకేతో లాంజ్‌లో వున్నాడు. ఆయనతో పాటు కేంద్రమంత్రులు అశోక్‌ గజ పతిరాజు, సుజనాచౌదరి, రాష్ట్రమం త్రులు కె.ఇ.కృష్ణమూర్తి, నారా లోకేష్‌, పత్తిపాటి పుల్లారావు, సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి.నారా యణ, దేవినేని ఉమామహేశ్వర రావులు ఉన్నారు. ఎయిర్‌పోర్టుకు రమ్మని చంద్రబాబే స్వయంగా ఫోన్‌ చేసి చెప్పడంతో అందరూ వచ్చారు. ఎవరికీ సబ్జెక్ట్‌ తెలియదు. చంద్రబాబే పూలబొకేతో ఎదురుచూస్తున్నాడంటే ఏ డోనాల్డ్‌ ట్రంప్‌నో, బిల్‌గేట్సో వస్తుంటాడని అనుకున్నారు. అంతలో గన్నవరం ఎయిర్‌పోర్టులో ఓ స్పెషల్‌ ఫ్లైట్‌ ల్యాండయ్యింది. చంద్రబాబు అలర్టయ్యాడు. ఆయనను చూసి మిగతావాళ్ళు కూడా టెన్షన్‌తోనే అటె న్షన్‌లో నిలబడ్డారు. ఫ్లైట్‌లో నుండి దర్శకుడు రాజమౌళి దిగాడు. మంత్రులందరూ వెనుక ఇంకెవరన్నా వరల్డ్‌ ఫేమస్‌ విఐపి వస్తున్నాడేమో ననుకుని చూస్తుంటే చంద్రబాబు మాత్రం రాజమౌళికి పూలబొకే ఇచ్చి స్వాగతం పలికాడు. రాజమౌళి కోస మేనా ఇంత బిల్డప్‌ ఇచ్చింది అని అందరూ నీరుగారిపోయారు. రాజ మౌళిని తీసుకుని అందరూ ఉండ వల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాల యంకు చేరుకున్నారు. అక్కడ రాజ ధానిపై చర్చ మొదలైంది. నన్ను పిలిపించిన కారణమేంటో చెప్పండని రాజమౌళి అడిగాడు. అమరావతి రాజధానిని అద్భుతంగా కట్టాలని చెప్పి నేను ప్రపంచంలో వున్న అన్ని దేశాలూ తిరిగాను. అఖరకు ఉగాండా, రుమాండాలకు కూడా వెళ్లాను, కానీ అవేవీ నా దృష్టిని ఆకర్షించలేదు. కాని, బాహుబలి సినిమాలోని మహిష్మతి సామ్రాజ్యం కోటలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అమరా వతిలోనూ నాకు అలాంటి కోటలే కావాలి. ఇందుకు నీ సహకారం కావాలని చంద్రబాబు అడిగాడు. దానికి రాజమౌళి... సార్‌, బాహుబలి సినిమాలో చూపించినవి ఒరిజనల్‌ కోటలు కావు, అవన్నీ సెట్టింగ్స్‌... టెంపరవరీగా వుంటాయంతే అని చెప్పాడు. అప్పుడు ముదురుదోమల శాఖ మంత్రి నారాయణ జోక్యం చేసుకుని... మాకు కావాల్సింది కూడా సెట్టింగ్సే... ఒరిజినల్‌ కోటలు కాదు... లేకుంటే ఈ ఒకటిన్నర ఏడాదిలో కాంక్రీట్‌ భవనాలను కట్ట గలమా ఏంటి? ఈ మూడున్నరేళ్లలో కట్టని కోటను ఇంకో ఒకటిన్నరేడా దిలో ఎలా కట్టగలం... సెట్టింగ్స్‌ అయితేనే తొందరగా పనైపోతుంది. అమరావతిలో మహిష్మతి లాంటి రాజధానిని నిర్మించామని ప్రజలకు చూపించగలం. కాబట్టి అమరా వతిలో మీరు మాకు ఆ సెట్టింగ్స్‌ వేసిస్తే చాలు అని ప్రాధేయపడ్డాడు. ఆ సమయంలోనే నారా లోకేష్‌ సబ్జెక్ట్‌ లోకి ఎంటరయ్యాడు. తన తెలివి తేటలనన్నింటిని ఇక్కడ వాడాలనుకు న్నాడు. తన తెలివికి సినీ పరిజ్ఞానాన్ని కూడా జోడించాడు. రాజమౌళితో డిజైన్‌ చెప్పసాగాడు. అమరావతిలో పెద్దపెద్ద కోటలు సెట్టింగ్స్‌ వేయాలి, అమరావతి రాజ్యంలోకి కార్లు, ఇతర వాహనాలకు ప్రవేశం ఉండదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గుర్రాల మీద రావాలి. మంత్రులకు మాత్రం గుర్రపు రథాలు ఏర్పాటు చేస్తాం. ముఖ్యమంత్రికి గుర్రపు రథంతోనే కాన్వాయ్‌ ఉంటుంది. ముఖ్యమంత్రి ప్రయాణించే రథం మాత్రం బాహు బలి సినిమాలో బల్లాలదేవుడు ఉప యోగించే రథం మాదిరిగా ఉం డాలి. మంత్రులకు, ఎమ్మెల్యేలకు గన్‌మెన్‌ల స్థానంలో అంగరక్షకులుం టారు. వారి చేతుల్లో తుపాకులు బదులు కత్తులు, విల్లంబులు, గదలు వుంటాయి. అమరావతిలో అశ్వ దళాన్ని, గజ దళాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని చెప్పుకుపో సాగాడు. అప్పుడు చంద్రబాబు జోక్యం చేసుకుని... చూడబోతే నువ్వు నా చేత బల్లాలదేవుడు గెటప్‌ వేయిం చేటట్లున్నావ్‌, రాజమౌళిని పిలిపిం చింది ఓన్లీ డిజైన్‌ల కోసమే... అంతే గాని మనం వేషాలు మార్చుకుని తిరగడానికి కాదు అని అన్నాడు. అప్పుడు లోకేష్‌... మీరు అంటుంటే నాకో ఐడియా వచ్చింది నాన్న గారు... ఎలాగూ అమరావతిలో మహిష్మతి సెట్టింగ్‌ వేస్తాం కదా... ఇక్కడే సినిమాలు కూడా తీసుకో వచ్చని చెపితే... ఇటు రాజధానిగా ఉపయోగపడుతుంది, అటు షూటింగ్‌ లకు రెంటుకిచ్చి డబ్బులు సంపా దించుకోవచ్చు అని చెప్పాడు. అది విన్న మంత్రులు... బాబు ఐడియా భలే వుంది సార్‌ అని చంద్రబాబుతో అన్నారు. సరేలే ఆలోచిద్దాం అని చెప్పి చంద్రబాబు రాజమౌళిని యాంటీ రూమ్‌లోకి తీసుకెళ్లాడు. పది నిముషాలు రహస్యంగా మాట్లాడి బయటకు తీసుకొచ్చాడు. తర్వాత రాజమౌళిని సాగనంపి రండని మంత్రులను ఎయిర్‌పోర్టుకు పంపించాడు.

అందరూ వెళ్ళాక చంద్రబాబు, నారాయణలు మిగిలారు. నారా యణ వుండి... సార్‌, రాజధాని డిజైన్‌ల కోసమే రాజమౌళిని పిలి పించారా? మన రాష్ట్రంలో ఎంతో మంది ఆర్కిటెక్ట్స్‌ వుండగా అతనిని ప్రత్యేకంగా పిలవడం ఎందుకని అడిగాడు. దానికి చంద్రబాబు... రాజమౌళి ఒక సినిమా తీయాలం టేనే మూడేళ్ళు పడుతుంటుంది... అలాంటిది అతని డైరక్షన్‌లో ఒక రాజధాని కట్టాలంటే మూడేళ్ళు పట్టదా? మనం ఎలాగూ ఎన్నికల లోపు రాజధానిని కట్టలేం... కనీసం రాజధాని నిర్మాణాన్ని రాజమౌళికి అప్పగించామంటే... ఇదెలాగూ బాహుబలిలాగా మూడేళ్ళ ప్రాజెక్ట్‌లే అనుకుని జనం సర్దుకుపోతారు... రాజధాని విషయంలో మనపై వ్యతి రేకత రాదు అని చెప్పాడు. నీ వాడ కానికి ఆఖరకు రాజమౌళి కూడా బలయ్యాడా? అని నారాయణ మన సులో అనుకుంటూ అక్కడ నుండి లేచాడు.

Read 48 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • దండగ... పండగ...
  పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
 • చిలికి చిలికి... గాలివాన కానుందా?
  ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
 • ఇసుకతో ఇక్కట్లు
  నెల్లూరు, జొన్నవాడ మధ్య సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక చిన్న ఆటంకం వస్తోంది. ప్రతి వాహనదారుడు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులైతే అదుపు తప్పి పడిపోతున్నారు. ఇరు కళలమ్మ గుడి నుండి దొడ్ల డెయిరీ దాకా రోడ్డును నాలుగు లైన్లుగా…
 • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
  2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
 • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
  మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter