06 October 2017 Written by 

రైతు క్షేమంతోనే... దేశం సుభిక్షం

venkaiahభారత ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసాక మొదటిసారిగా నెల్లూరు ముద్దుబిడ్డ ముప్పవరపు వెంకయ్యనాయుడు 4వ తేదీ నెల్లూరుజిల్లా పర్యటనకు విచ్చేసారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యాక ఆగస్టు 5వ తేదీ నెల్లూరులో జరిగిన 'మన వెంక్యయకు ఆత్మీయ అభినందన' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సరిగ్గా రెండు నెలల తర్వాత మళ్ళీ నెల్లూరొచ్చారు. విజయవాడ నుండి విమానంలో తిరుపతిలో దిగి, అక్కడనుండి ఎయిర్‌ఫోర్స్‌ హెలికాఫ్టర్‌లో శ్రీహరికోటలోని షార్‌సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ జరిగిన ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో పాల్గొన్నారు. అక్కడనుండి హెలికాఫ్టర్‌లో వెంకటాచలంలోని అక్షర విద్యాలయంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌లో దిగారు. అక్షర విద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం రోడ్డు మార్గాన నెల్లూరుకు చేరుకున్నారు. కస్తూర్బా కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 49వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా వ్యవసాయ శాస్త్రాన్ని విద్యగా స్వీకరించిన విద్యార్థులను అభినందించారు. మీ జీవితంలో ఇదొక మధురజ్ఞాపకం. డిగ్రీలో పట్టా పొందిన సమయంలో నేను కూడా ఇలాంటి ఆనందాన్నే అనుభవిం చాను. దేశానికి వెన్నెముకలాంటి వ్యవసాయ శాస్త్రాన్ని మీరు అభ్యసిం చారు. దేశ ఆర్ధిక వ్యవస్థలో వ్యవసాయ రంగం పాత్రే కీలకం. గ్రామీణ ప్రాంత జీవనాధారమంతా కూడా ఇప్పటికీ వ్యవసాయం మీదనే ఆధారపడి వుంది. వ్యవసాయం లాభసాటిగా లేదని నిరాశ, నిస్పృహలతో రైతులు వ్యవసాయాన్ని వదిలి వేస్తున్నారు. యాక్టర్‌ కొడుకు యాక్టర్‌, డాక్టర్‌ కొడుకు డాక్టర్‌, కలెక్టర్‌ కొడుకు కలెక్టర్‌ కావాలని చూసుకుంటున్నారు. ఫార్మర్‌ మాత్రం తన కొడుకును ఫార్మర్‌ చేయాలనుకోవడం లేదు. కాని వ్యవసాయానికి విలువ తెచ్చి రైతాంగానికి వన్నె తెచ్చి నప్పుడు, ఒక రైతు తన కొడుకును కూడా రైతును చేయాలనుకుంటాడు. దేశంలో 64శాతం మంది వ్యవసాయంపై ఆధార పడి జీవిస్తున్నారు. గ్రామీణ స్థూల

ఉత్పత్తిని 39 శాతం సాధించడం జరి గింది. వ్యవసాయ అనుబంధ రంగాలు మన జాతీయ సంస్థల ఉత్పత్తి వృద్ధికి అధికశాతం దోహదపడుతున్నాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

వ్యవసాయ రంగంలో పట్టభద్రు లైనవారు, శాస్త్రవేత్తలు రైతులు అధిక దిగుబడి పొందేలాగా రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తుండాలని తెలిపారు. దేశంలో ఏ రైతు కూడా వ్యవసాయంతో పాటు పౌల్ట్రి, డెయిరీ, తదితర అనుబంధ వ్యాపారాలతో అభివృద్ధి చెందుతున్నారని ఒక సర్వే ద్వారా వెల్లడైం దని, కృషి విజ్ఞాన కేంద్రం రైతులకి ఒక నాలెడ్జ్‌ హబ్‌ అని సూచించారు. 2022 నాటికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతులకు రెట్టింపు ఆదాయం వచ్చేలాగా చర్యలు తీసుకోవడంలో ముందంజలో వున్నాయన్నారు.

మౌలిక వసతుల కల్పనలో భాగంగా గ్రామాలకు రోడ్లు, విద్యుత్‌, గోదాములు, మార్కెట్‌ యార్డులు నెలకొల్పడమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. దేశానికి ప్రాజెక్టులు ఎంతో అవసరమని, పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్రాజెక్టులను అడ్డుకోవడం సరికాదన్నారు. సాధించిన విజయాలకన్నా, సాధించవలసినవి ఎన్నో వున్నాయన్నారు. ఆచార్య ఎన్‌.జి. రంగా విశ్వ విద్యాలయ 49వ స్నాతకోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందదాయకమని, డాక్టరేట్‌ పట్టాలు, బహుమతులు పొందిన వారికి తన అభినందనలు తెలియజేశారు. గ్రామాల నుండి నగరానికి వలస పోతున్న సంఖ్యను తగ్గించి, నగరాల నుండి గ్రామా లకు మార్పు చెందేలా గాంధీజీ సూచించిన బ్యాక్‌ టు విలేజ్‌కి అందరూ సహకరించాలని ఆయన కోరారు.

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ మరియు విశ్వవిద్యాలయ కులపతి ఇ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌ మాట్లాడుతూ విద్య అన్నది ధనార్జనకు సంబంధించిన ముఖ్యమైన వనరు కాదని, విద్య అన్నది ఒక సేవ అని, వ్యవసాయ విశ్వవిద్యాలయం అన్నది విద్యార్థులకు ధనార్జనకు ఉపయోగపడే సాధనం కాదని ఆయన అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల పెంపుదలలో నీటి వినియోగాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం వుందన్నారు.

ఉదాహరణకు డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా భవిష్యత్తులో భూగర్భ జలాలు దృష్టిలో వుంచుకుని నీటిని విని యోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రయి వేటు విద్యాసంస్థలు వారి వ్యాపారధోరణి మార్చు కోవాలని కాలానుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేపడు తున్న సంస్కరణలను అమలుపరచి సత్ఫలితాలు పొందాలన్నారు. విద్యను ధనార్జనగా మారుస్తూ, విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయని విద్యాసంస్థలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉప కులపతి దామోదరనాయుడు, రిజిస్ట్రార్‌ టి.వి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

దేశానికి గర్వకారణం.. ఇస్రో

మనదేశానికి ఇస్రో గర్వకారణమని.. భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభినందించారు. భారత అంతరిక్ష పరిశోధనలకు విక్రమ్‌సారాభాయ్‌ పితామహుడని కొనియాడారు. బుధవారం ఆయన శ్రీహరికోటను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పూర్వపు శాస్త్రవేత్తల దార్శకనితను ప్రస్తుత శాస్త్రవేత్తలు ముందుకు తీసుకువెళ్ళాలని ఇస్రో శాస్త్రవేత్తలకు సూచించారు. ఇస్రో శాస్త్రవేత్తల కృషి దేశంలోని ఇతర ప్రభుత్వరంగ సంస్థలకు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు వంటి అంశాలపై కార్యక్రమాలు నిర్వహించి వారిలో అంతరిక్ష పరిజ్ఞానం గురించిన అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా ఇస్రో అధిపతి ఏ.ఎస్‌ కిరణ్‌కుమార్‌ను ఆయన అభినందించారు. అనంతరం షార్‌లో ఉన్న ఘన ఇంధన కర్మాగారం, వాహన అనుసంధాన భవనం, కొత్తగా నిర్మిస్తున్న రెండవ వాహన అనుసంధాన భవనం, రెండో ప్రయోగ వేదికలను సందర్శించారు. తొలుత, ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో కలసి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హెలికాప్టర్‌లో షార్‌కు విచ్చేయగానే ఇస్రో ఛైర్మెన్‌ కిరణ్‌కుమార్‌, డైరెక్టర్‌ కున్హికృష్ణన్‌, కంట్రోలర్‌ రాజారెడ్డి, ప్రపంచ అంతరిక్షవారోత్సవాల ఛైర్మెన్‌ వెంకటరామన్‌లతో పాటు రాష్ట్ర ప్రతినిధిగా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఆర్‌.ముత్యాలరాజు, జిల్లా ఎస్పీ రామకృష్ణ, సిఐఎస్‌ఎఫ్‌ ఐజీ ఆనందమోహన్‌, డిఐజి కెఎల్‌ శివన్‌, కమాండెంట్‌ దుబె, తిరుపతి ఎంపి వరప్రసాద్‌, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నాయకులు వేనాటి రామచంద్రారెడ్డి, శ్రీసిటీ అధినేత రవీంద్ర సన్నారెడ్డి, చెంగాళమ్మ ఆలయ ఛైర్మెన్‌ ముప్పాళ్ళ వెంకటేశ్వర్లురెడ్డి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter