Friday, 06 October 2017 07:55

కార్పొరేషన్‌లో కోల్డ్‌వార్‌

Written by 
Rate this item
(0 votes)

cold warవివాదాలకు, విభేదాలకు నెల్లూరు కార్పొరేషన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ లాంటిది. నెల్లూరు నగరంలో ఎన్ని రకాల సమస్యలుంటాయో నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో కూడా అంతకంటే ఎక్కువ సమస్యలే వుంటాయి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే పాలకవర్గం వుంటే అధికారులు సహకరించరు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులున్నప్పుడు పాలకవర్గం సహకరించదు. ఈ ఇద్దరి మధ్య సమన్వయలోపం నగరానికి శాపంగా మారుతూ వస్తోంది.

నెల్లూరు కార్పొరేషన్‌లో పాలకవర్గానికి, అధికారులకు మధ్య సమన్వయం కుదరకపోతుండడం వల్లే ఆరు నెలలకో కమిషనర్‌ మారుతూ వస్తున్నాడు. ప్రస్తుతం కార్పొరేషన్‌లో ఇదే పరిస్థితి నెలకొన్నట్లుగా తెలుస్తోంది. మేయర్‌ అజీజ్‌, కమిషనర్‌ ఢిల్లీరావుల మధ్య దూరం పెరిగినట్లు సమాచారం. కమిషనర్‌ రాజకీయ నాయ కుడు కాదు, ఆయనకు ఎవరితోనూ విబేధించాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఆయన తన పని తాను ముక్కుసూటిగా చేసుకుంటూ పోతే ఆటోమేటిక్‌గా పాలకవర్గంతో విభేదాలు పెరుగుతాయంతే! ఇప్పుడు నెల్లూరు నగరపాలక సంస్థలోనూ ఇదే జరుగుతోంది. కమిషనర్‌ ఢిల్లీరావుకు సమర్ధుడైన అధికారిగా పేరుంది. వచ్చినప్పటి నుండి కూడా ఆయన తన పనులు తాను చేసుకుపోతున్నాడు. ఎవరు సిఫారసు చేసినా ఆక్రమణ నిర్మాణాలను వదలడం లేదు. పట్టుబట్టి తొలగిస్తున్నాడు. మేయర్‌ సిఫార్సులను కూడా లెక్కచేయకుండా కొన్ని ఆక్రమణలను దగ్గరుండి తీయించిన సంఘటనలు కూడా వున్నాయి. ఇక గతంలో పెండింగ్‌లో వున్న బిల్లుల విషయంలో కూడా అభిప్రాయ భేదాలున్నట్లు తెలుస్తోంది. గతంలో పనికిమాలిన పనులు, పేర్లు చెప్పి బిల్లులు పెట్టి వున్నారు. గత కమిషనర్లే ఆ బిల్లులు చెల్లించలేదు. వాళ్లే చెల్లించని బిల్లులను తానెలా చెల్లించగలననే అభిప్రాయంతో కమిషనర్‌ వున్నాడు. ఇక కమిషనర్‌ ఢిల్లీరావు దాతల సహకారంతో నెల్లూరు నగరాన్ని పోస్టర్‌ ఫ్రీ నగరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో పలుచోట్ల అందమైన పెయింటింగ్‌లను, డిజైన్‌లను వేయించారు. నెల్లూరును స్వచ్ఛ నెల్లూరుగా మారుస్తున్నారు. కమిషనర్‌ ఇలా పని చేస్తుంటే మేయర్‌ మాత్రం అనవసరమైన చోట్ల కాంక్రీట్‌ డివైడర్ల నిర్మాణానికి, నిరుపయోగమైన డివైడర్ల మధ్యలో మొక్కల పెంపకానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ అక్రమాలకు ఆస్కారమిస్తున్నారు. అయితే కమిషనర్‌కు మేయర్‌, అతని అనుచర కార్పొరేటర్లు సహకరించకపోయినా జిల్లాకు చెందిన మంత్రులిద్దరు పూర్తిస్థాయిలో సహకరిస్తుండడంతో ఆయన పని ఆయన చేసుకుపోతున్నాడు.

Read 446 times Last modified on Friday, 06 October 2017 08:32
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
    ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
  • వేగమందుకున్న ప్రయాణం
    సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
  • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
    నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
  • ఎవరెవరెక్కడ?
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter