06 October 2017 Written by 

ల్యాండవుతున్న విమానం

aeorplaదగదర్తి విమానాశ్రయం కల సాకారానికి రోజులు దగ్గరపడ్డాయి. త్వరలోనే విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లు పిలవడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసర మైన 1350 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. భూసేకరణకు సంబంధించి రైతుల పరిహారానికి నిధులు మంజూరు చేసారు. అన్నీ అనుకూలిస్తే ఈ నెలలోనే ముఖ్యమంత్రి చేతులమీదుగా విమానాశ్రయానికి శంకుస్థాపన చేయించే అవకాశం కూడా వుంది.

దగదర్తి విమానాశ్రయం పదేళ్ళ స్వప్నం. దివంగత నేత వై.యస్‌.రాజ శేఖరరెడ్డి సీఎంగా వున్నప్పుడే దగదర్తి మండలం దామవరం వద్ద విమా నాశ్రయం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. 3వేల ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన ఈ ఎయిర్‌పోర్టును అప్పట్లో సత్యం రామలింగరాజుకు చెందిన కంపెనీకి అప్పగించాలని నిర్ణయించారు. అయితే అప్పుడు సత్యం కంపెనీ కుంభకోణంలో ఇరుక్కోవడంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. వై.యస్‌. మరణించాక ఆ తర్వాత వచ్చిన ఇద్దరు సీఎంలు రోశయ్య, కిరణ్‌లు దీని జోలికే పోలేదు. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక దీనిపై మళ్ళీ కదలిక వచ్చింది. బీద మస్తాన్‌రావు దీనిపై ప్రత్యేకచొరవ చూపారు. ఒక దశలో భూవివాదాల వల్ల ఎయిర్‌పోర్టు ఇక్కడ నుండి ఎగిరిపోయే పరిస్థితి వచ్చింది. జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు చాకచక్యంగా వ్యవహరించి వివాదాలను పరిష్కరించి, ఎయిర్‌పోర్టుకు కావాల్సిన భూమిని సేకరించారు.

దగదర్తి ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఇప్పుడు అంతా క్లియర్‌గా వుంది. కలెక్టర్‌ ముత్యాలరాజు ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించి అక్కడ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అడ్డంకులను తొలగించాలని ఆదేశించారు. ఈ నెలలో ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన జరిగితే ఏడాదిలోపే దానిని పూర్తి చేసుకోవడం పెద్ద సమస్య కాదు. అప్పుడు హైదరాబాద్‌ పోవాలన్నా, విశాఖ, ముంబై, ఢిల్లీలకు పోవాలన్నా నెల్లూరీయులు చెన్నై ఎయిర్‌పోర్టుకో, రేణిగుంట ఎయిర్‌పోర్టుకో పరుగులు తీయాల్సిన పని వుండదు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • నగర కిరీటం జయకేనా?
    జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
  • గుంతలా!..మత్యు గుహలా!..
    జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
  • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
    పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter