Friday, 13 October 2017 07:58

ఆనంకు చుక్కెదురు?

Written by 
Rate this item
(0 votes)

anam brosనెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది మార్చి 6వ తేదీన హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ కరస్పాండెంట్‌ ఆనం వివేకానందరెడ్డి దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను ఈ నెల 11వ తేదీన హైకోర్టు కొట్టి వేసింది. దీంతో వి.ఆర్‌ విద్యాసంస్థలను తమ చేతుల్లో నుండి పోకుండా చూసుకోవాలనుకున్న ఆనం సోదరుల ఆశలు గల్లంతయ్యాయి.

1875 ప్రాంతంలో వెంకటగిరి రాజాలు విఆర్‌ విద్యా సంస్థలను ప్రారంభించారు. 1970 వరకు విఆర్‌ విద్యాసంస్థలపై వెంకటగిరి రాజాల పెత్తనమే సాగింది. 1970లో పెద్ద రాజాయాచేంద్ర మరణంతో ఆనం కుటుంబం ప్రవేశించింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో విఆర్‌ విద్యాసంస్థల కమిటీకి ఆనం వెంకటరెడ్డి అధ్యక్షుడయ్యాడు. అప్పటినుండి ఆనం వాళ్ళే పెత్తనం చేయసాగారు. 1970 నుండి 1985 వరకు విఆర్‌ కమిటీకి ఎన్నికలు జరుపకుండా ఆనం కుటుంబమే నేతృత్వం వహిస్తూ వచ్చింది. కమిటీకి వెంటనే ఎన్నికలు జరపాలంటూ అప్పట్లో ఏబివిపి నాయకులుగా వున్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆమంచర్ల శంకరనారాయణ, చంద్రశేఖర్‌రాజులు నెల్లూరులో ఆరు రోజుల పాటు నిరాహారదీక్ష చేసారు. అప్పుడు ముఖ్యమంత్రిగా వున్న ఎన్టీఆర్‌ ఎన్నికలు నిర్వహిస్తామని ఇచ్చిన హామీతో వీళ్ళు దీక్ష విరమించారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్‌ విఆర్‌ విద్యా సంస్థల కమిటీకి 1986లో ఎన్నికలు పెట్టించారు. అయితే పూర్వవిద్యార్థుల ఓట్లతో ఎన్నికలు నిర్వహిస్తే తమకు వ్యతిరేకంగా ఫలితాలు వస్తాయని వూహించిన ఆనం సోదరులు బైలాను సవరించి, పూర్వ విద్యార్థులకు ఓట్లు లేకుండా చేసి ఎన్నికలు పెట్టారు. అప్పుడే తమ ఓట్లను తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ పూర్వవిద్యార్థులు నెల్లూరు సివిల్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. దీంతో కోర్టు ఎన్నికల కౌంటింగ్‌ను నిలిపేసింది. 1993లో కోర్టు పూర్వవిద్యార్థుల పిటిషన్‌ను కొట్టి వేయడంతో 1986లో జరిగిన ఎన్నికల ఓట్లను అప్పుడు లెక్కించారు. ఆనం వివేకానందరెడ్డి కరస్పాండెంట్‌ మరియు కార్యదర్శిగా, ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షుడిగా, మరో ఏడు మంది సభ్యులుగా ఎన్నికయ్యారు. క్రింది కోర్టు తమ పిటిషన్‌ను కొట్టి వేసినా విఆర్‌ పూర్వవిద్యార్థులైన ఆమంచర్ల శంకరనారాయణ, గూడూరు విజయరామిరెడ్డి, పాతూరు రమణయ్యలు ఆ కేసును వదల్లేదు. 1996లో హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేసారు. వారి పోరాట ఫలితమే విఆర్‌ విద్యాసంస్థల కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది మార్చిలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు. ఈ తీర్పును పున పరిశీలించాలంటూ ఆనం వివేకానందరెడ్డి వేసిన రివ్యూ పిటిషన్‌ను తాజాగా హైకోర్టు కొట్టివేయడంతో విఆర్‌ విద్యాసంస్థలపై ఆనం సోదరుల ఆశలు అడుగంటినట్లయ్యాయి.

Read 388 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
    ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
  • వేగమందుకున్న ప్రయాణం
    సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
  • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
    నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
  • ఎవరెవరెక్కడ?
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter