13 October 2017 Written by 

గెలుపు... పజిల్‌

kamalamగెలుపు వారికి ఒక మిస్టరీగానే వుంది. గెలుపు కేవలం హిస్టరీకే పరిమిత మైంది. గెలుపు ఆ పార్టీకి అందని ద్రాక్ష పండుగానే మారింది. నెల్లూరుజిల్లాలో భారతీయ జనతాపార్టీ దుస్థితి ఇది. ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన నిన్నటివరకు ఆ పార్టీ నాయకుడైన యం.వెంకయ్య నాయుడు ఈ జిల్లావాడే! కాని ఆయన ఎదిగినంత వేగంగా ఇక్కడ పార్టీ ఎదగ లేకపోయింది.

బీజేపీ చరిత్రలో నెల్లూరుజిల్లా నుండి బీజేపీకి లభించిన ఒకే ఒక విజయం 1983 ఎన్నికల్లో ఉదయగిరి అసెంబ్లీ నుండి ఆ పార్టీ అభ్యర్థిగా వెంకయ్య నాయుడు గెలవడం. ఆ తర్వాత ఆ పార్టీకి గెలుపున్నదే లేదు. 1985 ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తుతో భాగంగా వెంకయ్యనాయుడు ఆత్మకూరు నుండి పోటీ చేసి ఓడిపోయాడు. 1989లో ఇదే ఆత్మకూరు నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కర్నాటి ఆంజనేయరెడ్డి ఓడిపో యాడు. 1994 ఎన్నికల్లో పొత్తు లేకుం డానే జిల్లాలో పలు అసెంబ్లీలకు, లోక్‌ సభకు పోటీ చేసినా డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. 1999 ఎన్నికల్లో నెల్లూరు అసెంబ్లీ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన డేగా నరసింహారెడ్డి ఓడి పోయాడు. 2004 ఎన్నికల్లో నెల్లూరు అసెంబ్లీ నుండి బీజేపీ అభ్య ర్థిగా పోటీచేసిన సన్నపరెడ్డి సురేష్‌రెడ్డి, ఆత్మకూరు అసెంబ్లీ నుండి పోటీ చేసిన బొల్లినేని కృష్ణయ్యలు కూడా ఓడిపోయారు. అలాగే నెల్లూరు పార్లమెంటు స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాల కొండయ్య పరాజయం పాలు కావడం తెలిసిందే! 2009 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే లోక్‌సభకు, కొన్ని అసెంబ్లీలకు పోటీ చేసినా డిపాజిట్లు కూడా రాలేదు. 2014 ఎన్నికల్లో మళ్ళీ తెలుగుదేశంతో పొత్తు కుదిరి నెల్లూరురూరల్‌ స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా సన్నపరెడ్డి సురేష్‌రెడ్డి పోటీ చేశాడు. వైకాపా అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు.

నెల్లూరుజిల్లా చరిత్రలో బీజేపీది అంతా పరాజయం పరంపరే! పొత్తులో పోటీ చేసినా ఒంటరిగా పోటీ చేసినా ఆ పార్టీ బలంగా కనిపించిందెప్పుడూ లేదు. 1983 నుండి జిల్లాలో పార్టీ క్రమక్రమంగా బలహీనపడుతూ వస్తోంది. ఆ పార్టీ నాయ కులు, కార్యకర్తలు కాంగ్రెస్‌, టీడీపీ, వైసిపి వంటి ప్రత్యామ్నాయ పార్టీలను చూసు కుంటూ వచ్చారు. జిల్లాలో పార్టీ బల పడడానికి ఆ పార్టీ నాయకులు ప్రత్యేకంగా తీసుకుంటున్న శ్రద్ధ కూడా ఏదీ లేదు. మరీముఖ్యంగా తెలుగుదేశంతో పొత్తు వున్న కాలం నుండి చూస్తుంటే వారి పని వెంకయ్యనాయుడుతో పాటు ఢిల్లీ నుండి బీజేపీ నాయకులు వస్తుంటే, ఆహ్వానం పలుకుతూ ఫ్లెక్సీలు, జెండాలు కట్టడం, ర్యాలీలు నిర్వహించడం. ఇతర రాష్ట్రా లలో బీజేపీ గెలిచినప్పుడు పార్టీ కార్యా లయం వద్ద ఔట్లు కాల్చి, స్వీట్లు పంచు కోవడం. ఇంతకుమించి పార్టీ పటిష్టతకు వాళ్ళు తీసుకుంటున్న చర్యలేమీ లేవు. వాళ్లకంటే కమ్యూనిష్టులు నయం. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అప్పుడప్పుడూ రోడ్లెక్కి ధర్నాలు, రాస్తారోకోలన్నా చేస్తున్నారు. కాని జిల్లాలో బీజేపీ వాళ్ళు మాత్రం ప్రజాసమస్యలపై పోరాటం అనే మాటనే మరిచారు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • నగర కిరీటం జయకేనా?
    జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
  • గుంతలా!..మత్యు గుహలా!..
    జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
  • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
    పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter