13 October 2017 Written by 

కమలంలో కలతలు

bjpనాకు పార్టీ తల్లిలాంటిది. నేను పార్టీని మించిపోయానని అందరూ అంటున్నారు. ఎవరైనా తల్లిని మించిపోగలరా..? గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తన నేతృత్వంలో మూడోసారి విజయం సాధించాక ఆనాడు ప్రమాణస్వీకారోత్సవ సభలో నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలివి. ఆరోజు ఆయన మాటలు పార్టీ పట్ల తన చిత్తశుద్ధిని చాటుకునేలా వున్నా, వాస్తవంగా మాత్రం ఆ గెలుపు మోడీ వ్యక్తిగత నాయకత్వ సమర్ధత మూలంగా దక్కిందే! పార్టీని ఆరోజు ఆయన మించిపోలేదు. కాని, ప్రధాని అయ్యాక మించిపోతున్నాడు. పార్టీ శ్రేయస్సు, పార్టీ భవిష్యత్‌ కంటే కూడా తన వ్యక్తిగత నాయకత్వ పాపులారిటీకే అధిక ప్రాధాన్యతనిస్తున్నాడు. నియంతృత్వ ఏకపక్ష ధోరణులతో బీజేపీని కొందరి పార్టీగానే పరిమితం చేస్తున్నాడు. ముఖ్యంగా పార్టీలో సీనియర్‌ నేతలను ఆయన అణగదొక్కుతున్న తీరు కార్యకర్తలకే నచ్చడం లేదు.

ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే రోజే సీనియర్లను పక్కనపెట్టేసాడు. ఏ ఒక్క సీనియర్‌ నేతను కూడా తన మంత్రివర్గం లోకి తీసుకోలేదు. 65ఏళ్లలోపు వయ స్సున్న వారైతే చురుకుగా పని చేస్తారని భావించి మంత్రి పదవులకు వయసు పరిమితి విధించాడు. యువకులకు అవ కాశమివ్వాలనుకోవడంలో తప్పులేదు గాని, సీనియర్లు అయితే పని చేయలేరనే భావనే తప్పు. సీనియర్ల అనుభవం, అవగాహన పరిపాలనకు ఎంతో అవ సరం. ఈరోజు మోడీ ప్రభుత్వంలో ఆ అవగాహనా లోపం స్పష్టంగా కనిపి స్తోంది. జాతీయ స్థాయి విధానాలపై అవ గాహన వున్న మంత్రులు మోడీ కొలువులో చాలా తక్కువుగా వున్నారు. అన్నీ తెలిసిన వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతిగా పంపించేశారు. జాతీయస్థాయి రాజకీ యాలు, ప్రజల ఆలోచనా విధానాలపై అవగాహన వుండి తదనుగుణంగా సూచ నలు, సలహాలు ఇవ్వగల మంత్రులు ఈరోజు మోడీ కొలువులో లేకుండా పోయారు. కొందరికి అవగాహన వున్నా మోడీకి చెప్పేంత ధైర్యం లేకుండా పోయింది. అలా చెప్పే ధైర్యం లేకే ఎల్‌.కె. అద్వానీ అంతటి అగ్రనేతను కూడా పక్కన పెట్టే పరిస్థితులొచ్చాయి. మోడీ ప్రధాని అయ్యాక బీజేపీ కార్యకర్తలే కాదు, సామాన్య ప్రజలు కూడా బాధపడిన విషయం రాష్ట్రపతి పదవికి అద్వానీ పేరును పరిగణనలోకి తీసుకోకపోవడం. బీజేపీ చరిత్రలో ఆ పార్టీకి ఉపయోగపడ్డ నాయకుడు అద్వానీ. మూడుసార్లు అధికా రంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ బీజేపీకి సారధ్యం వహించి నాలుగోసారి అధికారంలోకి తెచ్చాడు. దేశంలో కాం గ్రెస్‌కు ఆ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగాకే మోడీ వచ్చాడు. కాని, అద్వానీ అలాకాదు. ఒక ప్రాంతీయ పార్టీ కంటే కూడా అధ్వాన్నస్థితిలో బీజేపీ వుండగా ఆ పార్టీకి సారధ్యం వహించాడు. వ్యక్తిగత కృషితో పార్టీని 2 సీట్ల నుండి 200 సీట్లకు తీసుకువెళ్లాడు. బీజేపీ అనే మొక్కను నాటి నీళ్ళు పోసింది అద్వానీ. అది కాయలు కాసే నాటికి వాజ్‌పేయి, నరేంద్ర మోడీలు వచ్చి కోసుకుపోయారంతే!

బీజేపీలో సీనియర్లను అంటే పక్కన పెట్టేసారు. పార్టీని పది కాలాల పాటూ అధికారంలో వుండేలా చేయాల్సిన బాధ్యత ప్రధానిగా మోడీపై వుంది. పార్టీ అధికా రంలో నిలబడాలంటే ప్రజల ఆదరణ కోల్పోకూడదు. ప్రజల ఆదరణ వుండా లంటే ఆర్ధిక విధానాలు సక్రమంగా వుం డాలి. కాని ఈ మూడున్నరేళ్లలో మోడీ అనుసరించిన ఆర్ధిక విధానాలు, తీసు కొచ్చిన మార్పులు ప్రజల్లో వ్యతిరేకతను తెచ్చేలా వున్నాయి. మొదట పెద్దనోట్ల రద్దును అందరూ స్వాగతించారు. తీరా చూస్తే దాని ప్రభావం మన ఆర్ధిక రంగంపై బాగానే పడింది. నోట్ల రద్దుతో కుదేలైన దేశ ఆర్ధికరంగంపై జిఎస్టీ గుదిబండ వేశారు. దీని దెబ్బకు ప్రతిఒక్కరూ బలవు తున్నారు. జిఎస్టీని అమలులోకి తెచ్చాకే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగ సాగింది. నరేంద్ర మోడీ వచ్చీ రాగానే నోట్ల రద్దు, జిఎస్టీతో తమను చావబాదు తాడని ప్రజలు వూహించలేదు. బీజేపీ నుండి ప్రజలు ఆశించేది ఇది కాదు. ధరలు, పన్నులు తగ్గుతాయనుకున్నారు. రిజర్వే షన్లను సమీక్షించి అర్హులకే చెందేలా చేస్తారనుకున్నారు. వాజ్‌పేయి హయాంలో స్వర్ణచతుర్భుజి ద్వారా జాతీయ రహదా రుల విస్తరణ చేపట్టినట్లు, దేశ మంతటికీ ఉపయోగపడేలా నదుల అనుసంధానం వంటి దీర్ఘకాలిక ప్రాజెక్ట్‌ను చేపడుతారను కున్నారు. కామన్‌ సివిల్‌ కోడ్‌ను అమలు లోకి తేవడం, పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణచడం వంటివి గట్టిగా చేస్తారనుకు న్నారు. కానీ మోడీ ఇవేమీ చేయలేదు.

దేశంలో ఆర్ధిక విధానాలను ఇంత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం కూడా లేదు. మొదట వ్యవస్థల్లో వున్న అవినీతిని నిర్మూలించాలి. కుంభకోణాలు లేకుండా చేయాలి. ఈ విషయంలో గత యూపిఏ కంటే మోడీ ప్రభుత్వమే బాగుంది. పన్నుల విధానాన్ని సరళీకృతం చేసి దేశంలో పన్ను చెల్లింపుదారులను ఇంకా పెంచివుండాలి. కాని మోడీ ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులను ఎక్కు వుగా భయపెడుతోంది. మోడీ ఆర్ధిక విధా నాలపై ఇటీవల బీజేపీ సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హా విరుచుకుపడడం తెలి సిందే! ఈ బాటలోనే మరికొందరు బీజేపీ నేతలు కూడా వున్నారు. వీరందరు మోడీ దెబ్బకు భయపడి నోర్లు తెరవడం లేదు. ముఖ్యంగా యూపిలో బీజేపీ విజయం చూసాక పార్టీలో మోడీని ఎదిరించే ధైర్యం, ప్రశ్నించే తత్వం ఎవరికీ లేకుండా పోయింది. త్వరలో గుజరాత్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏ రాష్ట్రంలో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలినా సొంత పార్టీలోనే మోడీపై నేతల విమర్శల దాడి ఖాయం.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
    నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
  • హోదా పోరుతో... వ్యతిరేకత పోగొట్టుకున్నారు
    నెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్‌ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్‌ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్‌ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న…
  • నడిచినా... నిద్రించినా... ఏడాదంతా ప్రజల మధ్యే...
    ప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది…

Newsletter