20 October 2017 Written by 

సురక్షిత సేద్యమే శ్రీరామరక్ష

cultivationదేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం గతంలో కంటే ఎంతోకొంత అభివృద్ధిని సాధిస్తున్నా, పెరుగు తున్న అవసరాలకు తగ్గట్టు ప్రజలకు మంచి పుష్టికరమైన ఆహారం మాత్రం కరువే అవుతోంది. వ్యవసాయంలో ఇబ్బడిముబ్బడిగా రకరకాల రసాయనాల వాడకం పెరిగిపోతుండడంతో..పంటలు ఏపుగా పెరుగుతున్నట్లు కనిపించినా, నాణ్యత మాత్రం తగ్గిపోయి.. అలాంటి ఆహారం తిన్నప్పటికీ నీరసమే మిగులుతోంది. ఇదొక సమస్య అయితే, పంటపొలాల్లో విచ్చలవిడిగా రసాయనాలు వాడుతున్నప్పుడు, అత్యంత విషపూరితమైన పురుగుమందులను పిచికారీ చేస్తున్న సందర్భాల్లో ఆ విషవాయువులు పీల్చి ఎంతోమంది రైతులు తమ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఇదింకా బాధాకరం. ఆహార ఉత్పత్తులను పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు విషపూరిత రసాయనాల వల్లనో, కాలుష్యం వల్లనో, ప్రమాదకరమైన పురుగుమందుల వల్లనో వికటించకుండా ఎవరైనా ఎంతకాలం కనిపెట్టుకుని ఉండగలరు. అందువల్ల వాటిని దూరంగానే ఉంచాలి. మరో దుస్థితి ఏమంటే, దేశవ్యాప్తంగా ఉన్న పురుగుమందుల్లో దాదాపూ సగం దాకా నకిలీవేనని మేధావుల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అవి ప్రమాదమంటూ ప్రపంచదేశాలు నిషేధించిన అనేక రకాల పురుగుమందులను కూడా మనదేశంలో నిర్భయంగా వాడేస్తుండడం, తెలిసో తెలియకో.. మరోదారి లేకో వినియోగిస్తున్న ఈ మందుల వల్ల అనారోగ్యాల పాలుకావడం రైతులకు సర్వసాధారణమైపోతోంది. అటు ఉత్పత్తుల్లో నాణ్యతను క్షీణింపజేయడమే కాక, రకరకాల అనా రోగ్యాలకు కూడా కారణమవుతున్న రసాయనాలు, కల్తీ పురుగుమందులను దేశంలో పూర్తిస్థాయిలో నివారించుకోలేకపోవడం..విచారకరం. అయితే, కేంద్రప్రభుత్వం ఇటీవల ఇలాంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని, ఎప్పుడో పాతకాలం నుంచి ఉన్న రసాయనాలు పురుగుమందుల నియంత్రణకు సంబంధించిన నియమావళిని సరిదిద్దే ప్రయత్నం చేయడం హర్షదాయకమే అయినా, అదింకా ఆచర ణలో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. కల్తీవ్యాపారాల్లో.. ఇంకా పాతవాసనలు పూర్తిగా సమసిపోవడం లేదు. అయితే, క్రిమిసంహారక మందులను ఎవరిష్టం వచ్చినట్లు వారు వాడుకుంటూపోతే, గాలిలో కలిసిన ఆ మందుల వల్ల ఆరోగ్యాలకు నష్టం వాటిల్లుతుంది. పర్యావరణం కూడా క్షీణిస్తుంది. ఇప్పటికే రకరకాల కాలుష్యాలతో పర్యావరణం దెబ్బతింటోంది. విషతుల్యమైన పురుగు మందుల వినియోగం విపరీతంగా ఉండడం వల్ల అటు ప్రజలకు, ఇటు పర్యావరణానికి కూడా మరింత హాని కలుగుతోంది. అంతేకాదు, అత్యధిక రసాయనాల వాడకం వల్ల మన ఉత్పత్తులు విదేశాల నుంచి తిరుగు టపాలో తిరిగివస్తుండడాన్ని గుర్తుంచుకోవాలి. ఏటా దేశంలో వేలు, లక్షలాది టన్నుల క్రిమిసంహారక మందులు వాడుతూనే ఉన్నామంటే ఎంత భారీగా పురుగుమందులు, రసాయనాలు గాల్లో కలుస్తున్నాయో, తద్వారా మరెందరి ప్రాణాలు గాల్లో కలుపుకుంటున్నాయో ఊహించుకోవాల్పిందే. రసాయన ఎరువుల వాడకం వల్ల సాగయ్యే ఆహారపదార్ధాలు తమ సహజమైన రుచిని కూడా కోల్పోతున్నాయి. కల్తీ మందులతో, కల్తీ ఎరువు లతో సాగులోకి వచ్చే పంటలు.. ఆరోగ్యపరంగా రైతులను క్రుంగదీయడమే కాక, ప్రజలను కూడా అనారోగ్యానికి చేరువ చేస్తూనే ఉన్నాయి. మనదేశంలో నిత్యం ఎంతోమంది బాలలు తినే ఆహారంలో పౌష్టికాహారం లోపించిపోవడం వల్లనే వారు బలహీనంగా ఉంటున్నారని, దేశంలో సుమారు 47 శాతం మంది బాలలు ఉండాల్సిన బరువుకంటే తక్కువ బరువు కలిగివున్నారని, పౌష్టికాహార లోపమే దీనికి కారణమని, బాలల మరణాల్లో అత్యధికశాతం మరణాలు కూడా పౌష్టికాహార లోపం వల్లనేనని యునిసెఫ్‌ ఒక అధ్యయనంలో స్పష్టం చేస్తోంది.

ఇదిలావుంటే, మరోవైపు మనదేశంలో ప్రజల ఆహారపు అలవాట్లు కూడా రానురాను బాగా మారిపోతున్నాయి. గతంలో లేని ఎన్నో రకాల ఆహారపదార్ధాలు వంటల్లోకి వచ్చి చేరుతున్నాయి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పుష్టికరమైన ఆహారంగా పేరున్న సజ్జలు, జొన్నలు, రాగులు వంటివన్నీ ముతకైపోయి, నైస్‌గా ఉండే న్యూడుల్స్‌, కేక్‌లు, పిజ్జాలు వంటివి మన శరీరంలోకి బాగా చేరిపోతు న్నాయి. తద్వారా వంట్లో బలవర్ధక పదార్ధాలు లేక పోగా, బలాన్ని కుంగదీసే పదార్ధాలనే ప్రీతిగా వాడుకోవడం వల రకరకాల అనారోగ్యాలు, స్థూల కాయం వంటి సమస్యలకు మన శరీరాలు పుట్టిళ్ళుగా మారుతున్నాయి.

అటు వ్యవసాయరంగంలోనే కాక, పారిశ్రామిక రంగంలోనూ పొంచివున్న అన్ని రకాల రసాయన విపత్తులపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి విపత్తుల ముప్పు తప్పిం చేందుకు పటిష్టమైన ప్రణాళికలను అమలు చేయాలి. ముఖ్యంగా, అటు రైతుల జీవితాలకు రక్షణ లేక, ఇటు ప్రజల ఆరోగ్యానికీ భద్రత లేక, చేస్తున్న ఈ సేద్యమంతా దేనికోసమన్నది అందరూ ఆలోచించాలి. అన్నదాత జీవితాలు ఆనందమయం కావడానికి, దేశసౌభాగ్యానికీ అవసరమైన అత్యుత్తమమైన నూతన విధానాలను వ్యవసాయరంగంలో విరివిగా తీసుకువచ్చినప్పుడే ఇలాంటి ముప్పుల నుంచి..అనారోగ్య విపత్తుల నుంచి మనం బయటపడగలం.

ఇప్పటికైనా ప్రభుత్వాలు 'మంచి ఆహారం..మంచి ఆరోగ్యం' కనుక, పుష్టికరమైన ఆహారాన్ని అందరికీ చేరువయ్యేలా చూడాలి. రసాయనాల వాడకం పూర్తిగా తగ్గించి, కల్తీ ఎరువులు, కల్తీ పురుగుమందులను నివారించి, ఎవరికీ ఎలాంటి హానీ లేని సురక్షితమైన సేంద్రియ సేద్యాన్ని రైతాంగానికి అందుబాటులోకి తీసుకురావాలి. సురక్షిత సేద్యమే అందరికీ శ్రీరామరక్ష!.. కనుక, అటు రైతాంగం, ఇటు వ్యవసాయ శాస్త్రవేత్తలు... ప్రజలందరి సహకారంతో వ్యవసాయ రంగంలో వినూత్నమైన, విప్లవాత్మకమైన మంచి మార్పుకు ప్రభుత్వాలే నాంది పలకాలి. అప్పుడే అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు, ఇటు ప్రజలకూ అన్నివిధాలా భద్రత ఉంటుంది. దేశ సౌభాగ్యానికి కూడా తద్వారా ఓ మంచి మార్గం వేసినట్లుంటుంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నారాయణను వదలని అనిల్‌
  మున్సిపల్‌ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు. ఈ నాలుగేళ్ళలో మంత్రి…
 • వేసవి సెలవులు... వినోదం కావాలే గాని విషాదం కాదు
  వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు.…
 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • వైసిపి వైపు నేతల చూపు
  నవ్యాంధ్రలో శరవేగంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పు ప్రభావం నెల్లూరుజిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్ధుగా వున్న జిల్లా రాజకీయం ఇప్పుడిప్పుడే ఊపందుకుని వేసవి తాపంతో పాటు వేడెక్కుతోంది. జిల్లాలోని పది నియోజకవర్గాలలో వైసిపికి ఇప్పటికే సమన్వయకర్తలున్నారు. వారే రేపు రాబోయే…

Newsletter