20 October 2017 Written by 

కావలి నాకే కావాలి

kavaliవైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో సిటింగ్‌ ఎమ్మె ల్యేలలో ఎక్కువ మందికి తిరిగి టిక్కెట్లిచ్చే అవ కాశాలున్నాయి. అయితే ఒక్క కావలిలో మాత్రం సీటు విషయంలో బలమైన పోటీ నెలకొని వుంది. అది కూడా మాజీఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి నుండే కావడంతో కావలి వైకాపా రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి.

ఈ జిల్లాలో వై.యస్‌.కు మొదటి రాజకీయ అనుచరుడు విష్ణు. అతని తర్వాతే ఆనం వాళ్లయినా, ఇంకొకరైనా వై.యస్‌.ను అనుసరించారు. తనను నమ్మి తన వెంట నడిచినందుకు విష్ణును వై.యస్‌. అలాగే ఆదరించాడు. 2004 ఎన్నికల వరకు అతనికే అల్లూరు టిక్కెట్‌ వచ్చేలా చూసాడు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో అల్లూరు నియోజకవర్గం ఎగిరిపోయింది. దీంతో కావలి నుండి విష్ణు అయితే ఓడిపోతాడని తన సన్నిహిత రాజకీయ వర్గాలు చెప్పినా వై.యస్‌. వినిపించుకోకుండా ఓడి పోయినా ఫర్వాలేదు, నన్ను నమ్ముకున్నోళ్లను నేను వదిలేయ లేను అంటూ కావలి సీటిచ్చాడు. ఆ ఎన్నికల్లో విష్ణు ఓడి పోవడం తెలిసిందే!

ఇక 2014 ఎన్నికల నాటికి రాష్ట్ర రాజకీయ స్వరూపం మారిపోవడం తెలిసిందే! కాంగ్రెస్‌ తెరమరుగు కావడంతో విష్ణు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. ఆ ఎన్నికల్లో కావలి సీటును ముందుగానే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని ఖరారు చేయడంతో విష్ణు అప్పుడు ఆ సీటుపై పెద్దగా ఆశలు పెట్టుకో లేదు. సరికదా, వైసిపి అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌ గెలుపుకు చిత్తశుద్ధితోనే పనిచేసాడు.

కాని, ఈసారి ఎన్నికల్లో కావలి నుండి తానే స్వయంగా రంగంలోకి దిగాలని విష్ణు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై పార్టీ అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితోనూ చర్చించాడని, ఎమ్మెల్సీ ఇస్తాము, సిటింగ్‌ ఎమ్మెల్యేగా ప్రతాప్‌కే మద్దతునివ్వాలని జగన్‌ నచ్చజెప్పి చూసినా విష్ణు వినలేదని తెలుస్తోంది. ఈసారి ఎలక్షన్‌ బాగా ఖరీదవుతుంది. దానికి కూడా వెనక్కి తగ్గేది లేదని, ఆరు నూరైనా ఈసారి కావలి నుండి పోటీ చేసేది ఖాయమని విష్ణు తన వర్గీయులకు సంకేతాలు పంపుతున్నట్లు సమాచారం.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
    ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
  • వేగమందుకున్న ప్రయాణం
    సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
  • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
    నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
  • ఎవరెవరెక్కడ?
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter