27 October 2017 Written by 

అసాధారణ నిర్ణయాలు

bharath malaప్రగతి రథం కదిలింది. ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న ఆర్ధిక ప్రగతిరథానికి మరింత ఊపు తెచ్చేవిధంగా ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం మున్నెన్నడూ లేనివిధంగా 'భారత్‌మాల' వంటి అసాధారణ నిర్ణయాలతో ముందుకు దూసుకువస్తోంది. దేశంలో ఇప్పటికే అధోగతిలో.. అద్వాన్న స్థితిలో ఉన్న రహదారులకు మోక్షం కల్గించేందుకు, తద్వారా దేశ ప్రగతిరథ చక్రాలకు ఇక ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకు కేంద్రం సత్వర చర్యలు తీసుకుంటోంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన 'భారత్‌మాల' ప్రాజెక్టుకు, తదితర జాతీయ రహదారుల నిర్మాణం కోసం ఏకంగా అక్షరాలా ఏడు లక్షల కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు కేంద్రప్రభుత్వం ఆమోదముద్ర వేసి దేశ ఆర్ధికవృద్ధికి మార్గం సుగమం చేసింది. ప్రధాని మోడీ అధ్యక్షత్వంలో ఇటీవల జరిగిన సమావేశంలో ఆర్ధిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఆ మేరకు ఈ భారీ ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపడం ఎంతైనా హర్షదాయకం. ఇంతటి 'భారీ' నిర్ణయాలు ఎంతైనా సాహసమే. అయితే, దేశాభ్యున్నతికి ఎంతో అవసరమైన జాతీయ రహదారులను అభివృద్ధి చేయడం ఎంతైనా అవసరమే. దేశంలో 83వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల్ని అయిదు సంవత్సరాల్లో ఏడులక్షల కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చెందించడానికి రూపొందించిన పథకమే 'భారత్‌మాల'. ఈ ప్రాజెక్టు ద్వారా దేశ సరిహద్దులతో పాటు దేశంలోని అనేక ప్రాంతాలను కలుపుతూ వేలాది కిలోమీటర్ల దాకా జాతీయ రహదారులను నిర్మించడానికి శ్రీకారం చుట్టడం దేశచరిత్రలో ఇదే ప్రధమం. జాతీయ రహదారులు ఎలాంటి అవరోధాలు లేకుండా శుభ్రంగా ఉంటే ప్రయాణం ఎంత వెసులుబాటుగా ఉంటుందో అంద రికీ తెలిసిందే. కార్గోలు వేగవంతంగా ప్రయాణిం చేందుకు వీలుగా ఈ రహదారుల నిర్మాణాలు ఉం టాయని, ఎకనమిక్‌ కారిడార్‌ల అభివృద్ధి కూడా దీనిలో జతకలసి ఉంటుంది కనుక, అనేక ప్రాంతాలకు దారులు తీసే ఈ జాతీయ రహదారులు అనేకప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ముంబై-కొచ్చిన్‌- కన్యాకుమారి, బెంగుళూరు-మంగుళూరు, హైదరాబాద్‌- పణజీ, సంబల్‌పూర్‌-రాంచీ వంటి దాదాపు నలభైదాకా ప్రాజెక్టులు ఈ ఎకనమిక్‌ కారిడార్‌లలో ఉండబోతున్నాయి. అదేవిధంగా, భారత్‌మాల ప్రాజెక్టుల్లో తొలిదశలో 20వేల కిలోమీటర్ల దాకా జాతీయ రహదారుల నిర్మాణాలను త్వరలోనే ప్రారంభించనుండడం ఎంతో సంతోషదాయకం. రహదారులు తదితర ప్రాజెక్టుల కోసం సుమారు పదిలక్షల కోట్ల రూపాయల దాకా వ్యయమవుతున్నదంటే ఇవెంత భారీ ప్రాజెక్టులో ఊహించుకోవచ్చు. 'భారత్‌మాల' వంటి ప్రాజెక్టుల ద్వారా సమర్ధవంతమైన రవాణా ఏర్పాట్లు జరుగుతాయని, సరుకుల సత్వర రవాణాకు ఇబ్బంది లేకుండా, రోడ్లపై ఉన్న అనేకానేక అవరోధాలను తొలగించి, రోడ్లపై ప్రయా ణాన్ని మరింత సులువుగా, సునాయాసంగా, వేగవంతంగా, ప్రమాదరహితంగా తీర్చిదిద్దేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతాయని భావించవచ్చు. దేశంలో ఇది అతిపెద్ద భారీ ప్రాజెక్టుగా అవతరించనుంది కూడా. ఇందులో సుమారు 9వేల కిలోమీటర్ల ఎకనమిక్‌ కారిడార్లు, 6వేల కిలోమిటర్ల ఇంటర్‌ కారిడార్‌లే కాక, 5 వేల కిలోమీటర్ల మేరకు జాతీయ కారిడార్‌ల సామర్ధాన్ని పెంచడం, మరో 2వేల కిలోమీటర్ల సరిహద్దు అనుసంధానం చేయడం, 8 వందల కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌ మార్గాలు, 10వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల అభివృద్ధి..ఇవన్నీ ఈ ప్రాజెక్టులో అంతర్భాగాలే. ఈ బృహత్తర ప్రాజెక్టు అమలుతో ఉపాధి అవకాశాలు కూడా బాగా మెరుగుపడతాయనడంలో సందేహం లేదు. ఈ భారీ ప్రాజెక్టుల నిర్మాణా లకు సగం డబ్బును మార్కెట్‌నుంచి, ప్రైవేట్‌ పెట్టుబడుల ద్వారా రాబడతారు. మిగిలిన సగం మొత్తాన్ని రహదారి బాండ్లు, సుంకాల ద్వారా సమీకరిస్తారు. హైవేలపై చేసే వ్యయంతో కలిపితే, ఈ మొత్తం వ్యయం సుమారు 14 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. అటు పెద్దనోట్ల రద్దు, ఇటు జిఎస్టీలతో దేశ ఆర్ధికపరిస్థితి మసకబారుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్న దశలో, దేశ ఆర్ధికవృద్ధిపై ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా కేంద్రప్రభుత్వం ఇంతటి బృహత్తర ప్రాజెక్టులను ప్రకటించడం అందరికీ విస్మయం కలిగించేదే అయినప్పటికీ, ఈ భారీ ప్రాజెక్టుల నిర్మాణాల ద్వారా ఉపాధి అవకాశాలు కనీవినీ ఎరుగునంతగా పెరిగి ఆర్ధిక రంగానికి ఎలాంటి ఢోకా లేకుండా చేస్తుందని భావించవచ్చు. అంతేకాదు, మొండిబకాయిలతో కుదేలైపోయిన బ్యాంకింగ్‌ రంగానికి కూడా ఊతమిస్తూ సుమారు రెండులక్షల కోట్లకు పైగా మొత్తాన్ని బ్యాంకులకు మూలధనంగా ఇవ్వడానికి కేంద్రం నిర్ణయించడం కూడా అసాధారణ నిర్ణయమేననక తప్పదు. ఈ నేపథ్యంలో త్వరలో బ్యాంకింగ్‌ రంగంలో సంస్కర ణలు కూడా రానున్నాయి. గత ఏడాది నుంచి ద్రవ్యో ల్బణం క్రమేణా తగ్గుతూ వస్తోందని, జీడీపీ వృద్ధి చెందుతోందని, త్వరలోనే భారత్‌ 8 శాతం వృద్ధి రేటు సాధిస్తుందనే అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనాలు వాస్తవమే అవుతాయని ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోంది. దేశ ఆర్ధికవృద్ధికి, ప్రజల ఉపాధి కల్పనకు కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు, భారీ ప్రాజెక్టులు.. దేశ ప్రగతి రథచక్రాలకు ఎలాంటి అవరోధాలు లేకుండా పరుగులెత్తించేవేనని భావించవచ్చు. భారీప్రాజెక్టుల వల్ల సుమారు 14 కోట్ల పనిదినాలు ఉపా ధిగా లభ్యమవుతాయని అంచనా. జాతీయ రహదారులు, గృహనిర్మాణాలు, విద్యుత్‌, మౌలిక సదుపాయాలు, డిజిటల్‌ రంగాలు.. వంటి ప్రధానమైన రంగాల్లో భారీగా నిధులు వెచ్చించి అభివృద్ధి చేయడం వల్ల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడడమే కాక, దేశ ఆర్ధికాభివృద్ధి కూడా క్రమంగా పుంజుకుంటుందని భావించవచ్చు. ఏదేమైనా, గతంలో ఎన్నడూ లేనివిధంగా, దేశంలో ఇంతటి భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం వల్ల అటు ప్రజలకు ఉపాధి, ఇటు దేశానికి ఆర్థికవృద్ధి జమిలిగా కలిగి, దేశ ప్రగతికి ఈ నిర్ణయాలు మంచిదారులు వేస్తాయనే ఆశిద్దాం!Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • దండగ... పండగ...
  పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
 • చిలికి చిలికి... గాలివాన కానుందా?
  ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
 • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
  2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
 • సినిమానూ వదలని సెగ
  నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
 • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
  మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter