Friday, 27 October 2017 06:40

ట్రంప్‌ తిక్క కుదిర్చిన సోమిరెడ్డి

Written by 
Rate this item
(0 votes)

galpikaఅది 17వ తేదీ... హైదరాబాద్‌లోని సింహపురి చాణక్య, సేద్యం మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నివాసం. ఇంకో నాలుగు గంటల్లో సోమిరెడ్డి అమెరికాకు వెళడానికి ఎయిర్‌పోర్టుకు వెళ్లాలి... సోమిరెడ్డి అప్పుడే రెడీ అయ్యి బయట కొచ్చాడు. పట్టుచొక్కా, పెద్ద పంచె కట్టి భుజం మీద నాగలితో వున్నాడు. అక్కడే వున్న డాక్టర్‌ జడ్‌.శివప్రసాద్‌... ఈ గెటప్‌ ఏంటి సార్‌ అని అడిగాడు. మనం వెళుతున్నది రైతుల కోసం కదా! మనం కూడా అమెరికాకు రైతు గెటప్‌లోనే వెళితే బాగుంటుందేమోనని అన్నాడు. అందుకు జడ్‌.యస్‌... మన పెద్దలు రోమ్‌లో వున్న ప్పుడు రోమన్‌లుగా వుండమని చెప్పారు, మీరు వెళ్లేది అమలాపురంకు కాదు, అమెరికాకు, దానికి తగ్గగెటప్‌ వేస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. వెంటనే సోమిరెడ్డి బెడ్‌రూంలోకి వెళ్లి డ్రెస్‌ ఛేంజ్‌ చేసి ఈసారి సూటూబూటూ గెటప్‌లో వచ్చాడు. అది చూసి డాక్టర్‌ జడ్‌.యస్‌... ఇప్పుడు సార్‌ అమెరికాకు వెళుతున్నారని చెప్పినా అందరూ నమ్ముతారని అన్నాడు. సోమిరెడ్డి వుండి... డాక్టర్‌ అమెరికాలో చలిబాగా వుంటుంది కదా... మెడిసిన్‌ ఇక్కడ నుండి తీసుకెళ్లాల్నా, అక్కడ దొరుకు తుందా? అని అడిగాడు. మీరేమీ తీసుకు పోబల్లేదు సార్‌, ఎలాంటి మెడిసిన్‌ అయినా అక్కడ సులభంగా దొరుకుతుందని జడ్‌.ఎస్‌ చెప్పాడు. తర్వాత భార్య జ్యోతి, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు వచ్చి మంగళహారతి ఇచ్చి సోమిరెడ్డికి ఎయిర్‌ పోర్టులో వీడ్కోలు పలికారు.

----------

సోమిరెడ్డికి చికాగో ఎయిర్‌పోర్టులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, ఆయన భార్య, అమెరికా మంత్రులు స్వాగతం పలికారు. సోమిరెడ్డిని ట్రంప్‌ తన కారులోనే ఎక్కించుకున్నాడు. వీళ్ళు ఎక్కాక కాన్వాయ్‌ బయలుదేరింది. దారిన నడిచిపోతున్న మహిళలను చూస్తూ ట్రంప్‌... ఆ అమ్మాయి నడుం చూడు ఎంత బాగుందో, ఈ యువతి శరీరాకృతి చూడు... ఎంత వయ్యారంగా వుందో అని సోమిరెడ్డితో చెప్పసాగాడు. ఆ మాటలు సోమిరెడ్డికి బాగా వెగటు పుట్టించాయి. మా దేశంలో ఇలాంటి చేష్టలు చేసిన పొలిటీషియన్స్‌ ఇంటికి పోతారు. అందుకు ఏపి గవర్నర్‌గా వుండి ఇంటికి పోయిన ఎన్‌.డి.తివారీయే ఉదాహరణ. కాని మీ దేశం వాళ్ళు మాత్రం ఇలాంటి చేష్టలు చేస్తున్నందుకే నేమో మిమ్మల్ని అధ్యక్షుడిని చేసారు. అంతా కలికాలమని సోమిరెడ్డి అన్నాడు. అంతలో ట్రంప్‌ ఫోన్‌ మోగింది. ఆయన ఫోన్‌ ఆన్‌ చేసాడు. అవతలనుండి ఉత్తర కొరియా అధినేత కిమ్‌... చూడు ట్రంప్‌... నీ ఉడత బెదిరింపులు ఎక్కడైనా చూపిం చుకో... నాతో పెట్టుకుంటే ప్రపంచపటం లోనే అమెరికాను లేకుండా చేస్తాను, గమ్ముగా వైట్‌హౌస్‌లో కూర్చో అని చెప్పి ఫోన్‌ పెట్టేసాడు. ట్రంప్‌కు చిర్రెత్తు కొచ్చింది. ఛీ దీనమ్మ జీవితం... ఇంత బ్రతుకు బ్రతికి వీడిచేత మాటలు పడాల్సి వస్తుంది. వీడి పీడ విరగడయ్యేదెట్లా... అని మదనపడసాగాడు. సోమిరెడ్డి అతని భుజం మీద చెయ్యి వేసి సముదాయిస్తూ... మీ సమస్యంతా అతను మీకు ఫోన్‌ చేసి సవాల్‌ విసురుతుండబట్టే కదా? అని అడి గాడు. అవును... అని ట్రంప్‌ అన్నాడు. టక్కున సోమిరెడ్డి ట్రంప్‌ సెల్‌ఫోన్‌ తీసు కుని కారు గ్లాస్‌ దించి పక్కనే వున్న కాలువలో పడేసాడు. ఆ పరిణామానికి ట్రంప్‌ ఆశ్చర్యపోయి... ఎందుకలా చేసా వని అడిగాడు. దానికి సోమిరెడ్డి... ఈ సెల్‌ఫోన్‌ మీ దగ్గరుండడం వల్లే కదా... ఆ కిమ్‌ ఫోన్‌ చేయడం, మీకు మన శ్శాంతి లేకుండా పోవడం... ఇప్పుడు ఆ కిమ్‌ ఎలా ఫోన్‌ చేయగలడు? ఎలా మాట్లాడగలడు... అని లాజిక్‌గా ప్రశ్నిం చాడు. సోమిరెడ్డి మాటలకు ట్రంప్‌ నిజమే కదా... నాకింత కాలం ఈ ఐడియా రాక అశాంతితో వున్నానని చెప్పాడు. తర్వాత అందరూ ఒక వ్యవ సాయ క్షేత్రంలోకి వెళ్లారు. అక్కడ బంగాళాదుంపల పంటను చూపిస్తూ ట్రంప్‌... మా దేశంలో రైతు బంగాళా దుంపలు పండించి ఎకరాకు పదివేల డాలర్లు సంపాదించగలడని అన్నాడు. అది విన్న సోమిరెడ్డి... ఈ విషయంలో మీరు చాలా వెనుకబడి వున్నారు. మా తెలంగాణ సీఎం కేసీఆర్‌ అయితే ఒక ఎకరా బంగాళాదుంపలు పండించే కోటి రూపాయలు సంపాదిం చాడని చెప్పాడు. అక్కడ ట్రంప్‌ ముఖం చిన్నబోయింది. సోమిరెడ్డిని ట్రంప్‌ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి టమోటా పంటను చూపిస్తూ... ఈ దేశంలో టమోటాలు విపరీతంగా పండుతాయి అని చెప్పాడు. దానికి సోమి రెడ్డి... మా చిత్తూరు జిల్లా మదనపల్లి వద్ద టమోటాలను రోడ్ల పైనే పారేసి పోతుంటారు... మా దేశంలో పశవులకు కూడా టమోటాలనే ఆహారంగా పెడు తుంటాం అని చెబుతుండగా అప్పుడే ఆయన సెల్‌ మోగింది. సోమిరెడ్డి ఫోన్‌ ఎత్తాడు. అమరావతి నుండి వ్యవ సాయశాఖ డైరెక్టర్‌... సార్‌, రాష్ట్రంలో టమోటా ధరలు అదిరిపోతున్నాయి. కిలో 50రూపాయలు దాటిపోయింది. బయట రాష్ట్రాల నుండి తెప్పించమంటారా? అని అడిగాడు. సోమిరెడ్డి అలాగే చేయండని చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు. ట్రంప్‌కు వాళ్ళు మాట్లాడుకున్నది తెలుగు కాబట్టి అర్థం కాక ఏమన్నా ప్రాబ్లమా అని అడిగాడు. మా రాష్ట్రంలో టమోటా పంట ఎక్కువై ఎక్కడ నిల్వ చేయాలో అర్ధం కావడం లేదు, అందుకే సముద్రంలో తోసేయమని చెప్పాను. కనీసం చేపలైనా తింటాయని అన్నాడు. ట్రంప్‌ తర్వాత బెండకాయల తోట వద్దకు తీసుకెళ్ళి... అక్కడ వాటంగా వున్న బెండకాయలను చూపిస్తూ... మా దేశంలో విత్తనం నాటిన నెల రోజులకే బెండకాయలు కోసుకోవచ్చన్నాడు. అది విని సోమిరెడ్డి... ఈ విషయంలో మా కన్నా మీరు చాలా వెనుకబడి వున్నారు. మేం ఈరోజు విత్తనం నాటితే, పక్కరోజు కాయలు కాస్తాయని చెప్పాడు. తమ దేశ వ్యవసాయరంగం గొప్పతనాన్ని ప్రదర్శిం చాలని ట్రంప్‌ తపన పడుతుంటే, సోమి రెడ్డి ఎప్పటికప్పుడు ఆయన ఎత్తులను చిత్తు చేసాడు. చివరి ప్రయత్నంగా ట్రంప్‌ వరిపొలం వద్దకు తీసుకెళ్లాడు. ఇది హైబ్రీడ్‌ రకం వరి.... ఎకరాకు 5 క్వింటాళ్లకు తక్కువ కాకుండా పంట చేతికొస్తుందన్నాడు. అప్పుడు సోమిరెడ్డి... మేమూ వరిపైరు విధానాన్ని పూర్తిగా కంప్యూటరైజ్డ్‌ చేశాం. మా చంద్రబాబు కృషితో వ్యవసాయానికి కూడా టెక్నాలజీని అనుసంధానం చేసాం. భూమిలో వరి నాట్లు వేసాక ప్రతి మొక్కకు ఒక చిప్‌ అమరుస్తాం... దానిని కంప్యూటర్‌తో అనుసంధానం చేస్తాం. కంప్యూటర్‌ ద్వారా మనం ఇచ్చే కమాండ్‌ను బట్టి ఎకరాకు ఎన్ని పుట్లు కావాలంటే అన్ని పుట్లు పండించుకోవచ్చు. ఈ విషయంలో మేం ఇస్రో సహకారం కూడా తీసుకుం టున్నాం అని చెప్పాడు. సోమిరెడ్డి మాట లతో ట్రంప్‌కు తల తిరిగినంత పనైంది. అయినా తమాయించుకుని ఇక ఇతనితో పెట్టుకుంటే లాభం లేదనుకుని సోమిరెడ్డిని కారెక్కించుకుని వాషింగ్టన్‌లోని వైట్‌ హౌస్‌కు బయలుదేరాడు. వాషింగ్టన్‌ రోడ్డు మీద అటు ఇటు వెళుతున్న జనాన్ని చూస్తూ ట్రంప్‌తో సోమిరెడ్డి... మీ దేశంలో కుల, జాతి, మత వివక్ష లేదు గాని లింగ వివక్ష ఎక్కువనుకుంటా అని అడిగాడు. ఆ మాటకు ట్రంప్‌ బిత్తర పోయి... ఆ డౌటెందుకొచ్చిందని అడి గాడు. దానికి సోమిరెడ్డి... మీ దేశంలో మగాళ్లంతా కోటీశ్వరులుగా వున్నారు... ఆడోళ్ళు మాత్రం కటిక దరిద్రం అనుభ విస్తున్నట్లున్నారు. నిండుగా కప్పుకోవడా నికి గుడ్డలు కూడా లేక ఎలా వెళుతు న్నారో చూడండి అని రోడ్డు వైపు చూపిం చాడు. అక్కడ ట్రంప్‌కు మోకాళ్లకు పైన స్కర్ట్స్‌ వేసుకున్న అమ్మాయిలు వెళుతూ కనిపించారు. వాళ్లను చూడగానే ట్రంప్‌... హే బ్యూటిఫుల్‌.. ఏం ఫిజిక్‌ అని కామెంట్‌ చేసాడు. అది విన్న సోమిరెడ్డి ఇతడి కామం తగలెయ్యా... గుడ్డలకు కూడా గతిలేని పేద మహిళలను మాన వత్వంతో కాకుండా కామంతో చూస్తాడా, అతడిని ఆ దేవుడే క్షమించాలి అంటూ మౌనంగా వుండిపోయాడు.

Read 129 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…

Newsletter