04 November 2017 Written by 

మేఘం మెరిసెను... వర్షం కురిసెను

meghamఓ పక్క సోమశిల రిజర్వాయర్‌లో 50 టిఎంసీల నీళ్ళు రావడం, ఇంకోపక్క ఐఏబి సమావేశంలో జిల్లాలో రబీ సీజన్‌కు 5లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళివ్వాలని నిర్ణయించడం, అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో రైతాంగం ఆనందంలో వుంది. గత ఏడాది రైతులపై పగబట్టినట్లుగా వున్న ప్రకృతి ఈ ఏడాది మాత్రం కరుణించింది. కడప, కర్నూలు జిల్లాల్లో కురిసిన వర్షాలతో పాటు శ్రీశైలం నుండి వదిలిన నీటితో సోమశిలలో 50టీఎంసీలు, కండ్లేరులో 10 టీఎంసీలు నీళ్ళు చేరాయి. గత ఏడాది జిల్లాలో వానలే లేకపోవడంతో ఈ ఏడాది రైతులు రెండో పంట వేయలేదు. తొలి పంటతోనే సరిపెట్టుకున్నారు. సోమశిలకు నీళ్ళు రాక, వర్షాలు పడకపోయివుంటే ఇప్పుడు పైరు కూడా అనుమానంగానే వుండేది. ఈశాన్య ఋతుపవనాల ఆగమనంతో ఇంకా భారీ వర్షాలు పడతాయనే నమ్మకం కూడా ఏర్పడింది. పరిస్థితులు అనుకూలించడంతో రైతులు నారుమళ్ళకు సిద్ధమవుతున్నారు. ఐఏబి సమావేశంలో 5లక్షల ఎకరాలకు నీళ్ళివ్వాలని నిర్ణయించినా, జిల్లా వ్యాప్తంగా పది లక్షల ఎకరాలలో వరిపైరు సాగుచేసే అవకాశముంది. అయితే డెల్టా రైతులు ఆనందంగానే వున్నా మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, వింజమూరు, మర్రిపాడు, వరికుంటపాడు, దుత్తలూరు, ఓజిలి, చిల్లకూరు, చిట్టమూరు, పెళ్ళకూరు తదితర మండలాల్లో మాత్రం ఇంకా సరిగా వానలు పడక, మెట్ట పైర్లు ధైర్యంగా వేయలేని స్థితిలో రైతులున్నారు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter