04 November 2017 Written by 

అగ్రనాయకులకు అగ్నిపరీక్షే

modi rahulగుజరాత్‌ ఎన్నికలకు నగారా మోగింది. డిసెంబర్‌లో ఎన్నికలు. అంటే కేవలం నెలరోజులే ఉన్నాయి. డిసెంబర్‌ 9న ఒకసారి, 14న మరోసారి రెండు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 18న జరుగుతుంది.ఈ ఎన్నికలు నాయకులకు అగ్నిపరీక్ష కానున్నాయి. గుజరాత్‌లో బిజెపి అధికారంలో ఉంది కనుక, ఇక్కడ మళ్ళీ తమదే గెలుపనే ధీమాతో ఉంది. మొత్తం 33 జిల్లాలున్న గుజరాత్‌ రాష్ట్రంలో 182 అసెంబ్లీ స్థానాలున్నాయి. తొలివిడతగా 89 స్థానాలకు సంబంధించిన 19 జిల్లాల్లోను, మలివిడతగా 93 స్థానాలకు సంబంధించిన 14 జిల్లాల్లోనూ ఎన్నికలు జరుగనున్నాయి. గుజరాత్‌లో మొత్తం 4,33,37,492 మంది ఓటర్లున్నారు. నవంబర్‌ 14 నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. అదేవిధంగా నవంబర్‌ 9న హిమాచల్‌ప్రదేశ్‌కు ఎన్నికలు జరిగి, డిసెంబర్‌ 18న హిమాచల్‌ప్రదేశ్‌ ఓట్ల లెక్కింపుతోపాటే, గుజరాత్‌ ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది. ఆ రోజే రెండింటి ఫలితాలు వెలువడతాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో బిజెపి సీనియర్‌ నాయకుడు ప్రేమ్‌కుమార్‌ ధూమల్‌ను తాజాగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా బిజెపి అధిష్టానం ప్రకటించి ఎన్నికల రంగంలోకి దిగింది. దీంతో రెండు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం మిన్నంటుతోంది. అయితే, గుజరాత్‌లో మాత్రం గతంలో ఎన్నడూ లేనంత హోరాహోరీగా ఈసారి ఎన్నికలు జరుగ నున్నాయి. దీంతో ఇక్కడ రాజకీయం మరింత వేడెక్కింది. అధికారంలో ఉన్న బిజెపి తమ అధికారం నిలబెట్టుకోవాలని, అధికారం కోసం కాచుక్కూర్చున్న కాంగ్రెస్‌ ఈసారైనా ఇక్కడ తిష్టవేయాలని ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నాయి. దీంతో, అటు కమలం..ఇటు కాంగ్రెస్‌లకు ఈ ఎన్నికలు నువ్వా-నేనా అన్నంత ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి. గతంలో గుజరాత్‌ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. 1995 నుంచి ఇక్కడ బిజెపి హవా ప్రారంభమైంది. 1998 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బిజెపి విజయం సాధించడంతో కమలం జెండా రెపరెపలాడింది. 2002, 2007 ఎన్నికల్లోనూ బిజెపిదే ఘనవిజయం. తొలుత అక్కడ కేశూభాయ్‌పటేల్‌ ముఖ్యమంత్రిగా ఉంటూ బిజెపికి సారధ్యం వహించినా, ఆ తర్వాతకాలంలో ఆ అవకాశం నరేంద్రమోడీకి దక్కడంతో మోడీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఇక అక్కడి నుంచి మోడీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి గుజరాత్‌ ప్రజల మన్ననలు పొందడంతో, 2012 ఎన్నికల్లోనూ ఇక్కడ బిజెపియే అత్యధికస్థానాలను కైవశం చేసుకుంది. అలా..మోడీ ప్రధాని అయ్యేదాకా కూడా గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉంటూ గుజరాత్‌ను అభివృద్ధిబాటలో నిలిపారు. అయితే, ఇప్పుడు జరుగనున్న ఈ ఎన్నికలు 2019లో రానున్న లోక్‌సభ ఎన్నికలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది కనుక, గుజరాత్‌లో విజయమే లక్ష్యంగా బిజెపి వ్యూహరచన చేస్తోంది. అందులోనూ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ త్వరలోనే పార్టీకి అధ్యక్షులు కానున్నారనే ప్రచారం నేపథ్యంలో, ఈ ఎన్నికలు ఆయనకు, మొత్తంగా కాంగ్రెస్‌ పార్టీకి మరింత సవాల్‌ కానున్నాయి. దీంతో, గుజరాత్‌ ఎన్నికలు అటు కమలం, ఇటు కాంగ్రెస్‌ అగ్రనాయకులకు అగ్నిపరీక్ష కానున్నాయి. పెద్దనోట్ల రద్దు ప్రభావం, అస్తవ్యస్తంగా ఉన్న జిఎస్టీ ఈ రెండూ కలసి బిజెపికి ఈ ఎన్నికల్లో చుక్కలు చూపిస్తాయన్నది కాంగ్రెస్‌వాదుల ఆశ. అందుకు తగ్గట్లుగానే పెద్దనోట్ల సంగతి ఎలా ఉన్నా, జిఎస్టీ మాత్రం అక్కడి ప్రజల్లో అధికశాతం వ్యాపారవర్గాల్లో అసంతృప్తినే రాజేస్తోందనే చెప్పవచ్చు. జిఎస్టీ వల్ల వ్యాపారాలు మందగించిపోతున్నాయన్నది సర్వత్రా వినపడుతున్న విమర్శే. అందులోనూ గుజరాత్‌లోని అనేకమంది చిన్న, మధ్యతరగతి వ్యాపారులు జిఎస్టీపై బాగా అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. వస్త్ర పరిశ్రమపై విధించిన అయిదుశాతం పన్నును రద్దుచేయాలని కూడా గత కొద్దికాలంగా అక్కడి వ్యాపారులంతా కోరుకుంటున్నారు. కానీ బిజెపి నేతలు వారి బాధలు పట్టించుకోకపోవడంతో వారంతా బిజెపి పట్ల అసంతృప్తితో ఉన్నారని, సరిగ్గా ఈ అంశమే తమకు మేలు చేస్తుందని కాంగ్రెస్‌ ఆశిస్తోంది. అందుకు తగ్గట్లుగా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ బిజెపికి ఈసారి ఇక్కడ విజయం దక్కకూడదనే పట్టుదలతో ఉన్నారు. పెద్దనోట్ల రద్దు, అస్తవ్యస్తంగా ఉన్న జిఎస్టీ విధానాలు ప్రజల్లో మోడీ పట్ల అసం తృప్తిని పెంచుతున్నాయని, దీంతో తమ పార్టీకి ఇక్కడ విజయం తప్పకుండా లభిస్తుందని ఆయన ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో, గుజరాత్‌లో గణనీయమైన సంఖ్యలో ఉన్న సామాజికవర్గాలను తమవైపునకు తిప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్న పటేళ్ళు, ఓబిసిలు, దళితుల ఓట్లు రాబట్టుకునేందుకు కాంగ్రెస్‌ వ్యూహరచన చేస్తోంది. పటేళ్ళు..తమను ఓబిసిలో చేర్చి రిజర్వేషన్‌ కల్పించాలని గత రెండేళ్ళుగా గుజరాత్‌లో ఉద్యమాలు చేస్తున్నారు. అయినా బిజెపి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో పటేళ్ళ వర్గం బిజెపికి దూర మవుతోందని, దీని ప్రభావం కూడా బిజెపిపై పడు తుందని, వీటన్నిటి పర్యవసానంగా తమకు ఈసారి గుజరాత్‌లో విజయం దక్కడం ఖాయమని కాంగ్రెస్‌ అంచనాలు వేసుకుంటోంది. అయితే, ఎవరెన్ననుకున్నా గుజరాత్‌లో తమ స్థానం పదిలమని, అభివృద్ధి మంత్రమే తమపార్టీని గెలిపిస్తుందని బిజెపి గట్టి నమ్మకంతో ఉంది. కొంతమంది పటేళ్లు దూరమైనా, మరికొంతమంది ముఖ్యులైన పటేళ్ళను తమపార్టీలో కలుపుకుని బిజెపి మునుపటి ఉత్సాహంతోనే ఎన్నికల రంగంలోకి వస్తోంది. మొత్తమ్మీద గుజరాత్‌ ఎన్నికలు అటు కమలం, ఇటు కాంగ్రెస్‌ అగ్రనాయకులకు అగ్నిపరీక్షగా మారనున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోడీకి ఉన్న ప్రజాదరణ, అమిత్‌షా రాజకీయ చతురత ఈసారి గుజరాత్‌ ఎన్నికల్లో ఏమేరకు పనిచేస్తాయోనని రాజకీయవర్గాల్లో ఉత్కంఠగానే ఉంది. చివరికి ప్రజలు ఏపార్టీ వైపు మొగ్గుచూపి విజయాన్ని ప్రసాదిస్తారో మరి..వేచిచూడాల్సిందే!..



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దండగ... పండగ...
    పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
  • చిలికి చిలికి... గాలివాన కానుందా?
    ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
  • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
    2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
  • సినిమానూ వదలని సెగ
    నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
  • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
    మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter