Saturday, 04 November 2017 07:39

మళ్ళీ చెడింది

Written by 
Rate this item
(0 votes)

mayor ministerనెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ గెలిచింది వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ తరఫున! మేయర్‌ అయిన కొన్ని నెలలకే చేసిన ప్రమాణాలను పక్కనపెట్టేసి, తన వర్గం వారి మనో భావాలను వెనక్కి నెట్టేసి, వైసిపిని వదిలేసి సైకిలెక్కేసాడు. మేయర్‌ అజీజ్‌ తెలుగుదేశంలోకి రావడానికి ప్రధాన కారణం మంత్రి నారాయణ.

మేయర్‌ ఎలక్షన్‌కు ముందే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మంత్రి నారాయణ అనుకుని వుంటే అప్పుడే మేయర్‌గా తమ పార్టీ వాళ్ళను చేసుకుని వుండొచ్చు. కాని, మేయర్‌ ఎలక్షన్‌కు ముందే అజీజ్‌తో ఆయన ఒప్పందం చేసుకున్నాడు. మేయర్‌గా గెలిచాక తెలుగుదేశంలో చేరాలని మాట్లాడుకున్నారు. అందుకనే అప్పుడు నారాయణ నెల్లూరు మేయర్‌ ఎన్నికల్లో పెద్ద టెన్షన్‌ పడలేదు. పెద్దగా రిస్క్‌ తీసుకోలేదు. ఇచ్చిన మాట ప్రకారం అజీజ్‌ మేయర్‌గా ఎన్నికయ్యాక తెలుగుదేశంలో చేరాడు. అయితే మంత్రి నారాయణ, మేయర్‌ అజీజ్‌ల మధ్య అప్పుడప్పుడూ బేధాభిప్రాయాలు తలెత్త సాగాయి. నారాయణ మున్సిపల్‌ మంత్రి కావడం, నెల్లూరు సొంతూరు కావడంతో స్వతహాగానే ఈ కార్పొరేషన్‌ వ్యవహారాలలో నారాయణ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోసాగాడు. కార్పొరేటర్లు, అధికారులు కూడా నేరుగా మంత్రితోనే టచ్‌లో

ఉండసాగారు. మొదటి మొదట్లో నారాయణ, అజీజ్‌ల బంధం బాగానే కొనసాగింది. అజీజ్‌ మాటకు ప్రాధాన్యత వుండేది. ఆయన చెప్పినట్లే అధికారుల బదిలీలుండేవి. ఆయన కోరిన వాళ్ళే కమిషనర్‌లుగా వచ్చే వాళ్ళు.

అయితే రానురాను అజీజ్‌పై నారాయణకు సదాభిప్రాయం తగ్గిపోయి నట్లుగా కనిపిస్తోంది. కార్పొరేషన్‌లో అవినీతి పెరిగిపోయింది. కేవలం ధనార్జన కోసమే కొన్ని పనులు చేస్తున్నట్లుగా వుంది. మేయర్‌పై లెక్కలేనన్ని ఆరోపణలు రాసాగాయి. దీనికితోడు అజీజ్‌ వ్యతిరేక కార్పొరేటర్లందరూ సిండికేట్‌ అయ్యారు. నెల్లూరు నగరంలో ప్రధాన నాయకులైన ఆనం, సోమిరెడ్డి, ఆదాల... వీళ్లెవరితోనూ అజీజ్‌కు సఖ్యత లేకుండా పోయింది. అజీజ్‌ వ్యవహారశైలితో పార్టీకి నష్టమని భావించిన మున్సిపల్‌ మంత్రి నారాయణ ఆయనకు ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చాడు. ఆయనకు ఇష్టం లేకుండానే నగర పాలక కమిష నర్‌గా ఢిల్లీరావును తెచ్చారు. ఆయనకు ఫుల్‌పవర్‌ ఇచ్చారు. మేయర్‌ ప్రమేయం లేకుండానే, ఆయన ఒత్తిళ్ళు లెక్కచేయకుండానే నగరంలో కమిషనర్‌ తన పని తాను చేసుకుపోతున్నాడు. ఇది అజీజ్‌కు మింగుడుపడడం లేదు. ఆక్రమణల తొలగింపు విషయంలో అజీజ్‌ సిఫార్సులను కమిషనర్‌ ఖాతరు చేయలేదు.

కార్పొరేషన్‌లో కావాలనే తన పవర్‌ తగ్గిస్తున్నారని అజీజ్‌కు అర్ధమైంది. అదీగాక వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నగరం నుండి పోటీ చేయాలని అజీజ్‌కు ఉబలాటంగా వుంది. నెల్లూరు నుండి తాను పోటీ చేయొచ్చని ప్రకటించి నారాయణ అజీజ్‌కు షాకిచ్చాడు. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రికి అజీజ్‌ దూరంగా వుంటున్నాడు. ఆయన కార్యక్రమాలలో కనిపించడం లేదు. నారాయణ కూడా అజీజ్‌ వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదు. ఆయన పని ఆయన చేసుకుపోతున్నాడు. ఈ వ్యవహారం ఎక్కడిదాకా పోతుందో చూడాలి!

Read 200 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter