Saturday, 04 November 2017 07:50

నెల్లూరు చిత్తడి చిత్తడి

Written by 
Rate this item
(0 votes)

chithadiగత కొన్నిరోజులుగా కురిసిన వర్షాలకు నెల్లూరు నగరం చిత్తడి చిత్తడిగా మారింది. వర్షాలు కురుస్తున్నందుకు జనం ఓ పక్క సంతోషపడుతున్నా, బయటకొస్తే రోడ్లు మాత్రం నరకం చూపిస్తున్నాయి. మొన్నటి దాకా వానలు డివిజన్‌ల వారీగా కురిసాయి. మాగుంట లే అవుట్‌లో వానపడుతుంటే అదే సమయంలో వేదాయపాలెంలో ఎండ కాస్తుంటుంది. ఈ టైపు వానలే నగరంలో పడ్డాయి. గత నాలుగురోజుల పాటు జడివాన బాగానే పట్టింది. నగరానికి నీటి కొరత తీరినట్లే! కాకపోతే భూగర్భ డ్రైనేజీ కోసం తవ్విన రోడ్లతో జనం నానా తిప్పలు పడుతున్నారు. పలు చోట్ల తవ్విన రోడ్ల మధ్యలో వాహనాలు దిగబడిపోయి జనం మాకు ఈ భూగర్భ డ్రైనేజీ వద్దురా బాబు అనే పరిస్థితి వచ్చింది.

Read 88 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ప్రశాంతతే.. మా లక్ష్యం!
    సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
  • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
    మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
  • రాజకీయ దారులు వేరవుతాయా?
    నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
  • ఆనంతో... అదనపు బలం!
    మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…
  • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
    ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…

Newsletter