09 November 2017 Written by 

కొండమీద కొత్త రూటు...

kondaఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.

నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారి విస్తరణ పనులు జరుగుతుండడం తెలిసిందే! ఈ పనులలో భాగంగా సంగం చెక్‌పోస్టు వద్ద నుండి కొండపాయ గుండా రోడ్డును నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు మధ్యలో వర్షాలప్పుడు కొండ మీద నుండి ప్రవహించే వాగుపై వంతెన కూడా పూర్తయ్యింది. రోడ్డు పని కూడా దాదాపు పూర్తి కావచ్చింది. ఇక కొద్ది రోజులలోనే సంగం కొండ మీదుగా వాహనాల రాకపోకలను ప్రారంభించే అవకాశం వుంది. ఈ రోడ్డును మొదలుపెడితే నెల్లూరు నుండి ఆత్మకూరు వైపు వెళ్ళే వాహనదారులకు దాదాపు 5కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గుతుంది. ప్రస్తుతం ఈ రోడ్డులో ప్రయాణించేవాళ్ళు సంగం ఊరిలోకి వచ్చి కొండ మలుపు తిరిగి పోవాలి. దీనివల్ల సంగం గ్రామంలో ట్రాఫిక్‌ రద్దీ పెరగడమే కాక తరచూ ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికితోడు ఆక్రమణలతో సంగం రోడ్డు ఇరుకుగా మారింది. ఈ ఘాట్‌రోడ్డు అందుబాటులోకి వస్తే వాహనదారులకు ఈ రోడ్డులో ప్రయాణం చాలా హాయిగా ఉంటుంది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter