09 November 2017 Written by 

సీట్లకు కొట్లాట లేదు!

ycp leadersఎన్నికలొస్తున్నాయంటే సీట్లకు సిగ పట్లు ఎక్కువుగా వుంటాయి. ఒక్కో సీటుకు ఇద్దరు ముగ్గురు పోటీ పడుతుంటారు. నెల్లూరు జిల్లా వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో ఆ పరిస్థితి చాలా తక్కువుగానే కనిపి స్తోంది. జిల్లాలో ఒక్క కావలి సీటు విష యంలో మాత్రమే సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామి రెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి మాజీఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి గట్టి పోటీ దారుగా వున్నాడు.

నెల్లూరు లోక్‌సభ సీటుకైతే ఎవరూ పోటీ లేరు. ఇప్పటికైతే సిటింగ్‌ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డే వున్నాడు. అయితే ఈసారి కూడా ఆయనే పోటీ చేస్తే గెలుపు కష్టమన్న ప్రచారం సాగుతోంది. కాబట్టి ఎంపీ అభ్యర్థిని మార్చడం బెటర్‌ అవుతుంది. 2014 ఎన్నికల్లో వెంకటగిరి నుండి పోటీ చేసి ఓడిపోయిన కొమ్మి లక్ష్మయ్యనాయుడు రాజకీయాలకు దూరంగా ఉండడంతో జడ్పీ ఛైర్మెన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఇన్‌ఛార్జ్‌గా

ఉంటున్నాడు. ప్రస్తుతానికి ఈ సీటుకు ఆయన పేరే వుంది. పోటీలోకి ఇంకా ఎవరూ రాలేదు. కాని, ఎన్నికలప్పటికి ఈ సీటు కోసం పోటీకి రావచ్చు కూడా! ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌ తెలుగు దేశంలోకి జంప్‌ చేయడంతో గూడూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా మేరిగ మురళీ ధర్‌ను నియమించారు. ఆయన అభ్యర్థిగా అయితే కష్టమే! ఎన్నికల నాటికి ఇక్కడ కొత్త నాయకులు తెరపైకొచ్చే అవకాశా లున్నాయి. సూళ్ళూరుపేటలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు ఇబ్బంది లేదు. ఆయనను మార్చాల్సిన పరిస్థితి కూడా లేదు. సర్వేపల్లిలో సిటింగ్‌ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి తప్పదు. ప్రస్తుతానికి ఈ సీటును అడిగేవాళ్ళు కూడా లేరు. నెల్లూరు నగరంలో సిటింగ్‌ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌, నెల్లూరు రూరల్‌లో సిటింగ్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు అంతా సెట్‌ చేసుకున్నారు. ప్రజల్లో తిరుగుతూ బెస్ట్‌ ఎమ్మెల్యేలని పించుకుంటున్నారు. వీళ్ళిద్దరిని మార్చే పరిస్థితి లేదు. కోవూరు నుండి గత ఎన్ని కల్లో కొద్ది తేడాతో ఓడిపోయిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డే లైన్‌లో వున్నాడు. ఇక్కడ ఆయనే గట్టి అభ్యర్థి కూడా! ఆత్మకూరులో సిటింగ్‌ ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డిపై వ్యతిరేకత లేదు. కాకపోతే ఈసారి టీడీపీ నుండి ఆనం రామనారాయణరెడ్డి దిగితే ఆయన గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వుంటుంది. ఉదయగిరి నుండి ప్రస్తుతానికి ఇన్‌ఛార్జ్‌ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డే రం గంలో వున్నాడు. ఆర్ధిక కారణాల దృష్ట్యా కొత్త నాయకులు రంగంలోకి వచ్చినా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు.

నెల్లూరుజిల్లాకు సంబంధించి పార్టీలో సీట్లకు పోటీ తక్కువగానే వుంది. అభ్యర్థుల ఎంపిక ఇక్కడ పెద్ద తలనొప్పి కాక పోవచ్చు!



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • నగర కిరీటం జయకేనా?
    జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
  • గుంతలా!..మత్యు గుహలా!..
    జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
  • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
    పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter