Thursday, 09 November 2017 16:22

యువతకు ఒప్పుకునేనా?

Written by 
Rate this item
(0 votes)

mayurతెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం రంగమయూర్‌రెడ్డిని జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించారు. అయితే తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేసాడని చంద్రబాబుపై ఆనం వివేకానందరెడ్డి కోపంతో వున్నాడు. ఆ కోపంతోనే జిల్లా తెలుగు యువత అధ్యక్ష పదవిని తీసుకోవద్దని కొడుకు రంగమయూర్‌కు చెప్పాడు. దాంతో మయూర్‌ ఆ పదవి చేపట్టడానికి నిరాకరించాడు. చాలారోజుల నుండి ఈ పదవి పెండింగ్‌లోనే వుంది. ఇప్పుడు మళ్ళీ మయూర్‌నే ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే పార్టీలో చేరినప్పటి నుండి సొంతపార్టీ నాయకుల నుండే వాళ్ళకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. తన తండ్రి వివేకాకు న్యాయం జరిగే వరకు ఆ పదవిని తీసుకోకూడదనే పట్టుదలతో మయూర్‌ వున్నట్లు తెలుస్తోంది.

Read 881 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
    ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
  • తమ్ముడు తోడొచ్చేనా?
    మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • వైకాపాలో కుటుంబ రాజకీయం
    నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter