Thursday, 09 November 2017 16:23

ఆ రోడ్డు బాగు చేయండి సారూ...!

Written by 
Rate this item
(0 votes)

roadజిల్లా కేంద్ర కారాగారం.. పోలీస్‌ శిక్షణా కళాశాల... చంద్రబాబునగర్‌, వై.యస్‌.ఆర్‌.నగర్‌, శ్రామికనగర్‌, వల్లూరమ్మ కాలనీ, కుమ్మరిగుంట, బుజబుజనెల్లూరు... వేల సంఖ్యలో కుటుంబాలు... వీటన్నింటితో ముడిపడి వుంది ఒకే ఒక రోడ్డు... అదే పొదలకూరురోడ్డు నుండి బుజబుజనెల్లూరు వద్ద హైవేకి కలిసే రోడ్డు.

ఈ రోడ్డు చాలా దారుణంగా వుంది. గుంటలమయమై వాహనదారులకు నరకం చూపిస్తోంది. ప్రతిరోజూ ఖైదీలను తీసుకుని వెళ్ళే పోలీసు వాహనాలు, పోలీసు కాలేజీకి వెళ్ళే వాహనాలు ఈ రోడ్డు మీదే వెళ్ళాలి. ఇక పై కాలనీలలో గత కొన్నేళ్ళ నుండి వేలాది కుటుంబాలవాళ్ళు నివసిస్తున్నారు. ఇప్పుడు వై.యస్‌.ఆర్‌.నగర్‌లో వేలాదిమంది కొత్తగా ఇళ్ళు నిర్మించుకుంటున్నారు. ఈ కాలనీలకు రోడ్డు వసతి, మంచినీటి వసతి సక్రమంగా లేదు. ప్రధానరహదారితో పాటు కాలనీలోని రహదారు లను అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోతాయి.

Read 84 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
    ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
  • తమ్ముడు తోడొచ్చేనా?
    మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • వైకాపాలో కుటుంబ రాజకీయం
    నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter