Thursday, 09 November 2017 16:25

యువరాజు సమర్ధతకు పరీక్షలు

Written by 
Rate this item
(0 votes)

galpikaఢిల్లీలోని టెన్‌జనపథ్‌... హాల్‌లో కూర్చుని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ 'బాహుబలి' సినిమా రెండో పార్ట్‌ను చూస్తోంది. ఆమెతో పాటు అక్కడ అహ్మద్‌పటేల్‌, మల్లిఖార్జున ఖర్గే, వీరప్పమొయిలీ, చిదంబరం, పనబాక లక్ష్మి, అంబికా సోనీలు వున్నారు. వాళ్ళంతా సోనియాతో కలిసి ఆసక్తిగా సినిమా చూస్తుం డగా... స్నాక్స్‌ అంటూ వి.హెచ్‌. హనుమంతురావు ట్రేలో బిస్కెట్లు, పఫ్‌లు, కాఫీలు పెట్టుకుని వచ్చాడు. అందరూ వాటిని తీసుకుని తింటూ సినిమా చూస్తున్నారు. సినిమాలో... రాజుగా పట్టాభిషేకానికి ముందు ఇతర రాజ్యాల పర్యటనలు చేసి రమ్మని హీరో బాహుబలి (ప్రభాస్‌)కు మాతృమూర్తి రమ్యకృష్ణ చెబుతుంది. ఇతర రాజ్యాల పర్యటనలకు వెళ్ళిన బాహుబలి ప్రభాస్‌ అక్కడ కుంతల రాజ్యం యువరాణి దేవసేన(అనుష్క) ప్రేమలో పడతాడు. ఆమెను వెంట బెట్టుకుని మహిష్మతి రాజ్యానికి వస్తాడు.

ఆ సీన్‌లన్నీ అక్కడే నిలబడి చూసిన వి.హెచ్‌.హనుమంతురావు సోనియాగాంధీతో... మేడమ్‌, మన ప్రియాంకగాంధీ కొడుక్కి కూడా రేపో మాపో పెళ్లీడు వస్తుంది. కాని, మన యువరాజు రాహుల్‌గాంధీకి ఇంకా పెళ్లి కాలేదు, లోకులు కాకులు... ఆయన గురించి నానా రకాలుగా అనుకుంటారు. కాబట్టి ఆయనకు వెంటనే పెళ్లి చేయాలి. పెళ్ళి కాని వాళ్ళు, భార్యలు లేనివాళ్ళు ప్రధా నులు అయ్యే ఆచారం బీజేపీ పార్టీలో వుంది. ప్రేమ వివాహాలు, విదేశీ యువతులను వివాహం ఆడినవాళ్ళు ప్రధానులయ్యే ఆచారం మన కాం గ్రెస్‌లో వుంది. ఆ బాహుబలి సిని మాలో చూపినట్లు మన రాహుల్‌ను కూడా విదేశీ పర్యటనలకు పం పండి... ఏదో ఒక దేశం యువ రాణిని పెళ్ళి చేసుకుని వస్తాడు. అప్పుడు కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి, ప్రధాని పదవికి అర్హుడవుతాడని సలహా ఇచ్చాడు. మిగతా నాయకులు కూడా వి.హెచ్‌. అభిప్రాయాన్ని సమ ర్ధించారు. దాంతో సోనియా వెంటనే లోపల కార్టూన్‌ నెట్‌వర్క్‌ చూస్తున్న రాహుల్‌గాంధీని పిలిపించింది. ఆయన వచ్చి నిలుచున్నాడు. సోనియా అతనితో... రాహుల్‌, నీకు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాం, దీనికి ముం దుగా అనుభవం కోసం విదేశీ పర్యటనలు జరిపిరావాలి. వెంటనే లగేజీ సర్దుకుని బయలుదేరు అని చెప్పింది. విదేశాలకు అనగానే ఎగిరి గంతేసిన రాహుల్‌, వెంటనే లగేజీ సర్దుకోవడానికి లోపలకు వెళ్లాడు.

--------

నెలరోజుల తర్వాత...

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్‌ నాయ కులు వేచి చూస్తున్నారు. సోనియా గాంధీ అయితే చేతిలో హారతిపళ్లెం పట్టుకుని వుంది. కొడుకు కోడలును వెంటబెట్టుకుని వస్తాడని చెప్పి వారికి హారతితో స్వాగతం పలికేందుకు ఆమె తయారైవచ్చింది. అప్పుడే రాహుల్‌ వచ్చే విమానం ల్యాండ య్యింది. ప్రయాణికులందరూ బయ టకు వస్తున్నారు. సోనియా కొడుకు, కోడలు కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటే... ''యాహూ'' అంటూ శబ్దాలు చేసుకుంటూ ఓ యువకుడు బయటకొచ్చాడు. తెల్లదుస్తులు ధరించి నడుముకు నల్లగుడ్డ కట్టి వున్న అతనిని తమ రాహుల్‌గాంధీ అని పసిగట్టడానికి పది నిముషాలు పట్టింది. కోడలితో వస్తాడనుకుంటే ఇలా కుంగ్‌ఫూ శబ్దాలు చేసుకుంటూ వచ్చిన కొడుకును చూసి సోనియా నిర్ఘాంతపోయింది. తర్వాత రాహుల్‌ను తీసుకుని టెన్‌జనపథ్‌ కెళ్లారు. అక్కడ సోనియా... నాయనా, నీ విదేశీ పర్యటనలలో నీకు తగిన అమ్మాయి ఎవరూ కనిపించ లేదా? ఎవరినన్నా పెళ్ళి చేసుకుని వచ్చి మీ నాన్నగారి బాటలో నడుస్తావనుకుంటే ఇలా చేతులూపుకుంటూ వచ్చావేం అని అడిగింది. దానికి రాహుల్‌... అమ్మా, నేను నా విదేశీ పర్యటనలో వివాహంపై ఆసక్తి చూపలేదు. ఏ దేశస్తురాలిని పెళ్ళి చేసుకోవాలో కూడా అర్ధం కాలేదు. కాని ఈ విదేశీ పర్యటనలలో చాలా నేర్చుకున్నాను. ఇటలీలో ఫిడేల్‌ వాయించడం నేర్చు కున్నాను, థాయ్‌లాండ్‌లో మసాజ్‌ చేయించుకున్నాను, నెదర్లాండ్‌లో పాలు పిండడం తెలుసుకున్నాను, జపాన్‌లో కుంగ్‌ఫూ నేర్చుకున్నాను. నేను కాంగ్రెస్‌ అధ్యక్షుడిని కావడానికి, ఈ దేశ ప్రధాని కావడానికి ఇంత కంటే ఏం అర్హతలు కావాలమ్మా అని ప్రశ్నించాడు. అందుకు సోనియా... అసలే మన పార్టీ జాతకం బాగా లేదు. ఆ మోడీ కాంగ్రెస్‌ ముక్త భారత్‌ అంటూ మన పార్టీని పతనం చేయ డానికి కంకణం కట్టుకుని పని చేస్తు న్నాడు. గొడ్డొచ్చిన వేళ, బిడ్డొచ్చిన వేళ అంటారు. కనీసం కొత్త కోడలు అడుగుపెడితే ఆమె జాతకంతోనైనా మన పార్టీ జాతకం మారుతుందను కుంటే, నువ్వేమో పెళ్లి చేసుకోవు... అని నిష్టూరంగా మాట్లాడింది. అప్పుడు రాహుల్‌... అమ్మా, పెళ్లి చేసుకుంటే ఎలాంటి పెళ్లాం వస్తుందో తెలియదు, ఒకవేళ అప్పడాల కర్రతో నన్ను కొట్టే పెళ్ళాం వస్తే ఇంట్లో పెళ్ళాన్ని కంట్రోల్‌ చేసు కోలేని వాడివి, ప్రధానిగా దేశాన్నేం కంట్రోల్‌ చేస్తావని నన్నే అంటారు. కాబట్టి పెళ్ళి చేసుకోకపోతే ఆ ప్రశ్నే రాదుగా అని చెప్పాడు. దానికి సోనియా... ఏమో బాబు, నాకా వయసు మీద పడుతుంది, పార్టీ భారం ఇక మోయలేను, నిన్ను కాం గ్రెస్‌ అధ్యక్షుడిని చేస్తే నా బాధ్యత తీరుతుంది. నిన్ను కాంగ్రెస్‌ అధ్య క్షుడిని చేయాలంటే రెండు ఆప్షన్స్‌... పెళ్లన్నా చేసుకో... లేదా రేపు గుజ రాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో మన పార్టీనన్నా గెలిపించు అని చెప్పింది. అందుకు రాహుల్‌ తడుముకోకుండా... ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో మన పార్టీని గెలిపించుకుని వస్తానమ్మా, ప్రామిస్‌ అంటూ లేచాడు. సోనియాతో పాటు మిగతా నాయకులు కూడా ఇతడికి ఇక ఈ జన్మలో పెళ్లి కాదు అంటూ నిట్టూర్చారు.

Read 63 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • పేటలో పోటీకెవరు?
  జిల్లాలో తెలుగుదేశంపార్టీకి గట్టి నియోజకవర్గాలలో సూళ్ళూరుపేట ఒకటి. ఇది ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గం అయినప్పటికి ఇంతకాలంగా వేనాటి సోదరులే ఇక్కడ పార్టీని నడుపుతూ వచ్చారు. అభ్యర్థులను నిర్ణయిస్తూ, గెలిపిస్తూ వచ్చారు. తెలుగుదేశం ఆవిర్భవించాక ఇప్పటివరకు 8సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, 5సార్లు…
 • జగన్‌ జోరు.. బాబు బేజారు
  'మన్మధుడు' సినిమాలో సీన్‌ ఇది... బ్రహ్మానందం ఇంటికి నాగార్జున, సోనాలిబింద్రే వస్తారు. అక్కడ బ్రహ్మానందం భార్యగా ఒక నల్లజాతి మహిళ ఉండడాన్ని చూసి మీది లవ్‌ మ్యారేజీనా అని నాగార్జున అడుగుతాడు. దానికి బ్రహ్మానందం... ముందు ఆమె నన్ను ప్రేమించింది... తర్వాత…
 • ఈ నరకం ఇంకెన్నాళ్ళు
  ''ఈ నగరానికి ఏమైంది... ఓ పక్క మసి... మరోపక్క పొగ... నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం''... థియేటర్లలో గాని, టీవీలలో గాని సినిమా ప్రదర్శనకు ముందు వచ్చే ప్రకటన ఇది. ఇప్పుడు నెల్లూరు పరిస్థితి కూడా అలాగే వుంది. ఓ…
 • రాజకీయ ప్రయాణంలో... ఇది తొలి సంతకం
  ఇప్పటికే నెల్లూరు కేంద్రంగా నెల్లూరుజిల్లాలోనే కాక రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆథ్యాత్మిక, మానవీయ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మన సుల్లో సేవాస్వాప్నికుడిగా ముద్రపడ్డ ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి... తన జీవితంలో మరో సేవా ప్రయాణానికి తొలి సంతకం చేసారు. ఇంతదాకా…
 • వణికిస్తున్న సైకో
  ప్రజలకు ఏ భయం పట్టుకుంటే ఆ భయం కొద్ది రోజుల పాటు వెంటా డుతూనే వుంటుంది. ఒకచోట దొంగ తనం జరిగితే ఎవరిని చూసినా దొంగ లను చూసినట్లే చూస్తారు. ఒకచోట చైన్‌ స్నాచింగ్‌ జరిగితే... ఎవరిని చూసినా చైన్‌ స్నాచర్‌లు…

Newsletter