09 November 2017 Written by 

10-11-2017 రాశిఫలాలు

rasi 10

1Ariesమేషం

ఉద్యోగులకు సమర్ధత గౌరవం బాగుంటుంది. అధికారులకు స్థానమార్పులుంటాయి. శుభకార్య ప్రయ త్నాలు ఫలించడం, ఇతరులకు శారీరకంగా, ఆర్ధికంగా సహాయం చేస్తారు. వృత్తిపరంగా ఆదాయం బాగుం టుంది. వ్యాపార వర్గాలకు ఆటంకాలు తొలగి అభివృద్ధి బాగుంటుంది. అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులను కలుస్తారు.

 

2Taurusవృషభం

విలువైన వస్తువులు సమకూరుతాయి. రావలసిన బాకీలు కొంత చేతికందవచ్చు. కోర్టు కేసులందు అను కూలత, సభలు, సమావేశాలలో ప్రముఖంగా వ్యవహ రించడం జరుగుతుంది. కుటుంబ సౌఖ్యం, విద్యావకా శాలు బాగుంటాయి. ఆరోగ్యం ఫరవాలేదు. ప్రముఖులను కలుసుకొంటారు. న్యాయ, వైద్య, సాంకేతిక, శాస్త్ర పరిశో ధన రంగాల వారికి మంచి ప్రోత్సాహం ఉంటుంది.

 

3Geminiమిధునం

ముఖ్యపత్రాలు, వస్తువులు పోగొట్టుకొనకుండా జాగ్రత్తపడాలి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మరి కొద్దికాలం నిరీక్షించవలసి ఉంటుంది. శుభకార్యాలు నిర్ణయం కాగలవు. దూరప్రయాణాలుంటాయి. సోదరు లకు మేలు జరుగుతుంది. కుటుంబసౌఖ్యం కలదు. పలుకుబడి పెంచుకొనడానికి, అనుకున్న పనులు నెర వేరడానికి ఆడంబరాలకు ఖర్చులు పెరుగుతాయి.

 

4Cancerకర్కాటకం

ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు లభించ గలవు. అనుకోని ప్రయాణాలు, ఇతరులకు ఆర్ధికం గాను, పనులందు సహాయపడటం జరుగుతుంది. ఉద్యోగులకు సమర్ధత గుర్తింపు బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధికంగా బాగుండి వృత్తి వ్యాపారాలలో ఆదాయం పెరుగుతుంది. కొంత అదనపు ఖర్చులుం టాయి. సాధ్యమైనంత వరకు తగ్గించండి.

 

5Leoసింహం

కోర్టు వ్యవహారాలు వాయిదా పడవచ్చు. శుభకార్య నిర్ణయాలు వాయిదా పడగలవు. అనుకోని ప్రయాణా లుంటాయి. ఉద్యోగులకు స్థానమార్పు పనిభారం పెర గడం ఉంటుంది. ఆస్తి వ్యవహారాలు, రావలసిన డబ్బులు కొంత పరిష్కారం కాగలవు. కుటుంబ, ఆర్ధిక, ఉద్యోగ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. సన్నిహితులు బంధు వుల వల్ల సమస్యలు రాగలవు.

 

6Virgoకన్య

శుభకార్య ప్రయత్నాలు కొనసాగుతాయి. విద్యార్థు లకు మంచి అవకాశాలు, విలువైన వస్తు సామాగ్రి కొనడం జరుగుతుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యత లుండటం, అధికారవర్గ సహకారముంటుంది. వృత్తి వ్యాపారాలు, లభించే ఆదాయం తృప్తికరంగా ఉంటుంది. మీ సన్నిహితులే మిమ్మల్ని విమర్శించగలరు. ఎదుటి వారిని ఇబ్బందిపెట్టినట్లుగా మాట్లాడకండి.

 

7Libraతుల

ఉద్యోగులకు మంచి గుర్తింపు గౌరవాలు, రావలసిన బాకీలు కొంత లభించడం జరుగుతుంది. విద్యార్థులకు మంచి ఉన్నత విద్యావకాశాలుంటాయి. ఆరోగ్యం బాగుం టుంది. ఫైనాన్స్‌, కాంట్రాక్టులు, బంగారు వెండి వ్యాపా రులు పబ్లిక్‌తో, అధికారులతో జాగ్రత్త పడండి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరగడం, రాబడిపై అసంతృప్తి ఉంటుంది. అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి.

 

8Scorpioవృశ్చికం

కొత్త యంత్రాలు, గృహోపకరణాలు కొంటారు. ఉన్నత విద్యావకాశాలు లభించగలవు. ప్రముఖులతో పరిచయాలు, శుభకార్య నిర్ణయాలు జరుగగలవు. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, ఆదాయం, అనుభవం లభిస్తుంది. పనులు చేపట్టినవి నిదానంగా జరుగుతాయి. రావలసిన బాకీలు వాయిదా పడతాయి. కోర్టు కేసులందు అనుకూలత కలదు.

 

9Sagittariusధనుస్సు

గృహ వస్తు వాహన రిపేర్లుంటాయి. ఉద్యోగులు తమ అధికారులతో పబ్లిక్‌తో జాగ్రత్తగా మెలగండి. అనుకున్న పనులు సరిగా జరగక టెన్షన్‌ పెడతాయి. కోర్టు వ్యవహారాలలో అసంతృప్తి, బాకీలు నిలబడిపోవడం జరుగుతుంది. ఉద్యోగార్ధులకు అవకాశాలు దొరుకు తాయి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలుండి బాధ కలుగుతుంది. ఆదాయం తగ్గుతుంది.

 

10Capricornమకరం

బిడ్డల విద్యా విషయంలో కొద్ది ఆందోళన ఉం టుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలించగలవు. ఉద్యోగులకు అధికారులతో సామరస్యం బాగుంటుంది. రావలసిన బాకీలు కొంత వరకు అందుతాయి. పారి శ్రామిక వర్గాలకు, కాంట్రాక్టర్లకు వర్కర్లతో సమస్యలు రాగలవు. ఆరోగ్యం బాగుంటుంది. ఇతరులు మీపై చేసిన విమర్శలు, నిందలు సర్దుబాటు కాగలవు.

 

11Aquariusకుంభం

ఉద్యోగులకు సమర్ధత ఉండి పనిభారం పెరుగు తుంది. నిర్మాణాలు చేసే వారితో ఇబ్బందులుంటాయి. హోల్‌సేల్‌ వ్యాపారాలు బాగుగా జరుగుతాయి. ఉన్నత విద్యావకాశాలు లభించగలవు. దూరప్రయాణాలుం టాయి. ఆరోగ్యం బాగుంటుంది. చేపట్టిన పనులందు టెన్షన్‌ ఎక్కువగా ఉంటుంది. ఏదో విధంగా పనులు జరుపుకుంటారు.

 

12Piscesమీనం

ఉద్యోగులు ఇతరులతో జాగ్రత్తగా మెలగవలసి ఉంటుంది. పనులందు టెన్షన్‌ ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. శుభకార్య ప్రయ త్నాలు వేగవంతం కాగలవు. బంధుమిత్రులను కలుసు కొంటారు. కుటుంబ సమస్యలు, ఉద్యోగ నిర్వహణలో సమస్యల వల్ల ఇబ్బందులు పడతారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.

 Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
  నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
 • అజీజా... నిన్నొదలా...!
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
 • ఉదయగిరిలో... పాత పోరా? కొత్త నీరా?
  జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలలో 9అసెంబ్లీలది ఒక దారి అయితే ఉదయగిరి అసెంబ్లీది మాత్రం ఇంకో దారి! మెట్టప్రాంతమైనప్పటికి ఇక్కడి ప్రజలు రాజకీయ చైతన్యవంతులు. పార్టీ ప్రభంజనాలు, నాయకుల పట్ల సానుభూతి వంటి వాటికంటే కూడా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థుల…
 • సుధాకర్‌ బాబా(య్‌).. కొంప ముంచాడు బాబోయ్‌
  దయ చేసి వినండి... దయచేసి వినండి... మంత్రాలకు చింతకాయలు రాలవు... అని ఎందరు చెబుతున్నా వింటారా? వినరు? దయ చేసి బురిడీ బాబాలను నమ్మొద్దని మేధావులు మొత్తు కుంటుంటారు... అయినా వింటారా? వినరు! మోసం చేసేవాడికి మోసపోయే వాడెప్పుడూ లోకువే. మీరు…
 • చంద్రుడి డైరక్షన్ లో పవన్ యాక్షన్ థ్రిల్లర్ జె.ఏ.సి
  రాష్ట్ర రాజకీయాలలో చంద్ర బాబుకు అవసరమైనప్పుడు మాత్రమే తెరమీదకొస్తాడని పేరున్న పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరోసారి సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌ స్క్రీన్‌ప్లేతో తెరమీద కొచ్చాడు. దీనిపేరు జాయింట్‌ యాక్షన్‌ కమిటి! తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీల పాత్రేమిటో చూసాం. తెలం గాణ…

Newsletter