Friday, 17 November 2017 06:29

ఇప్పుడన్నా ఇస్తారా?

Written by 
Rate this item
(0 votes)

tdp leadersతెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ వుండిందని, పార్టీ అధికా రంలోకి వచ్చాక తమను వెనక్కు నెట్టేసి, కాంగ్రెస్‌, వైకాపాల నుండి వలసవచ్చిన వాళ్ళకు పెద్దపీట వేస్తున్నారంటూ జిల్లా టీడీపీ లోని సీనియర్‌ నాయకులు ఆవేదన చెందుతున్నారు.

ముఖ్యంగా నారాయణ మంత్రి అయ్యాక జిల్లాలో ఒరిజినల్‌ తెలుగుదేశం నాయకులకంటే వైకాపా, కాంగ్రెస్‌ల నుండి వచ్చినవాళ్ళకే పెద్దపీట వేశారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక జిల్లాలో ఇచ్చిన తొలి నామినేటెడ్‌ పదవి ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటి ఛైర్మెన్‌గా కాంగ్రెస్‌ నుండి వచ్చిన చాట్ల నర శింహారావును నియమించడం. ఆయన పూర్తిగా నారా యణ మనిషి. పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా వైసిపి నుండి వచ్చిన ముప్పాళ్ళ విజేతను నియమిం చారు. అలాగే సూళ్ళూరుపేట చెంగాళమ్మ దేవస్థానం బోర్డు ఛైర్మెన్‌గా ముప్పాళ్ళ వెంకటేశ్వరరెడ్డిని నియ మించారు. ఈ నియామకాల పట్ల సూళ్ళూరుపేట నియోజకవర్గంలోని పార్టీ సీనియర్‌ నాయకులు తీవ్ర ఆగ్రహంతో వున్నారు. ఇక మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రెండుసార్లు పోటీచేసి అన్ని విధాలా నష్టపోయిన దేశాయిశెట్టి హనుమంతురావును కాకుండా కాంగ్రెస్‌ నుండి తెలుగుదేశంలో చేరిన తన అనుచరుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని పెట్టుకున్నాడు మంత్రి నారాయణ. పట్టాభి ఓడిపోవడం తెలిసిందే!

ఎన్నికలు వేగంగా తరుముకొస్తున్న నేపథ్యంలో నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయడం అంటూ జరిగితే ఇప్పుడే జరగాలి. ఈమేరకు కసరత్తు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో రెడ్ల ఆధిపత్యం ఎక్కువ కాబట్టి ఆ సామాజికవర్గంకు ఈసారి పెద్దపీట వేయొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే 'నుడా' ఛైర్మెన్‌గా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని నియమించివున్నారు. ఇక ఆదాల ప్రభాకర్‌రెడ్డి, వేనాటి రామచంద్రారెడ్డి, కంభం విజయరామిరెడ్డి, టి.అనూరాధ లలో ఇద్దరిని నామినేటెడ్‌ పదవులు వరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆనం రామనారాయణరెడ్డి రావడం వల్ల ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌ హోదాను కోల్పోయిన గూటూరు కన్నబాబును కూడా నామినేటెడ్‌ పదవికి ఎంపిక చేస్తారని సమాచారం. బలహీనవర్గాల నుండి డాక్టర్‌ జడ్‌.శివప్రసాద్‌, కాపు సామాజికవర్గం నుండి దేశాయి శెట్టి హనుమంతురావులకు ఖచ్చితంగా ఈసారి పదవులు ఇచ్చే అవకాశాలున్నాయి.

నామినేటెడ్‌ పదవులు ఇప్పటికే ఆలస్యమయ్యాయని తమ్ముళ్ళు అసంతృప్తితో వున్నారు. కనీసం ఇప్పుడన్నా పార్టీని నమ్ముకుని, పార్టీ జెండాలు మోసి, పార్టీ కోసం అన్ని విధాలా నష్టపోయినవాళ్ళకు పదవులు ఇస్తే గత అసంతృప్తిని కొంతన్నా మాయం చేసినవాళ్ళవుతారు.

Read 450 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • పేటలో పోటీకెవరు?
  జిల్లాలో తెలుగుదేశంపార్టీకి గట్టి నియోజకవర్గాలలో సూళ్ళూరుపేట ఒకటి. ఇది ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గం అయినప్పటికి ఇంతకాలంగా వేనాటి సోదరులే ఇక్కడ పార్టీని నడుపుతూ వచ్చారు. అభ్యర్థులను నిర్ణయిస్తూ, గెలిపిస్తూ వచ్చారు. తెలుగుదేశం ఆవిర్భవించాక ఇప్పటివరకు 8సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, 5సార్లు…
 • జగన్‌ జోరు.. బాబు బేజారు
  'మన్మధుడు' సినిమాలో సీన్‌ ఇది... బ్రహ్మానందం ఇంటికి నాగార్జున, సోనాలిబింద్రే వస్తారు. అక్కడ బ్రహ్మానందం భార్యగా ఒక నల్లజాతి మహిళ ఉండడాన్ని చూసి మీది లవ్‌ మ్యారేజీనా అని నాగార్జున అడుగుతాడు. దానికి బ్రహ్మానందం... ముందు ఆమె నన్ను ప్రేమించింది... తర్వాత…
 • ఈ నరకం ఇంకెన్నాళ్ళు
  ''ఈ నగరానికి ఏమైంది... ఓ పక్క మసి... మరోపక్క పొగ... నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం''... థియేటర్లలో గాని, టీవీలలో గాని సినిమా ప్రదర్శనకు ముందు వచ్చే ప్రకటన ఇది. ఇప్పుడు నెల్లూరు పరిస్థితి కూడా అలాగే వుంది. ఓ…
 • రాజకీయ ప్రయాణంలో... ఇది తొలి సంతకం
  ఇప్పటికే నెల్లూరు కేంద్రంగా నెల్లూరుజిల్లాలోనే కాక రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆథ్యాత్మిక, మానవీయ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మన సుల్లో సేవాస్వాప్నికుడిగా ముద్రపడ్డ ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి... తన జీవితంలో మరో సేవా ప్రయాణానికి తొలి సంతకం చేసారు. ఇంతదాకా…
 • వణికిస్తున్న సైకో
  ప్రజలకు ఏ భయం పట్టుకుంటే ఆ భయం కొద్ది రోజుల పాటు వెంటా డుతూనే వుంటుంది. ఒకచోట దొంగ తనం జరిగితే ఎవరిని చూసినా దొంగ లను చూసినట్లే చూస్తారు. ఒకచోట చైన్‌ స్నాచింగ్‌ జరిగితే... ఎవరిని చూసినా చైన్‌ స్నాచర్‌లు…

Newsletter