17 November 2017 Written by 

విహారయాత్రలు... విషాదయాత్రలు కారాదు!

vishada yatraluప్రతి మనిషికి ఆహ్లాదం, ఆనందం అవసరమే! అయితే ఆనందం కోసం చేసే ప్రయత్నం విషాదంగా మారడమే విచారకరం. పర్యాటక యాత్రలు సాహస యాత్రలుగా మారడం ప్రమాదకరం. మొన్న ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదిలో బోటు దుర్ఘటన ప్రతి ఒక్కరికీ గుణపాఠం కావాలి. ఈ దుర్ఘటనను చూసి ఎవరూ విహారయాత్రలు ఆపుకోనవసరం లేదు. కాకపోతే కనీస జాగ్రత్త చర్యలు లేకుండా బోటు ప్రయాణాలు ప్రమాదకరమని గ్రహించాలి.

నెల్లూరుజిల్లాలోనూ 180 కిలోమీటర్ల మేర సముద్ర తీరప్రాంతం ఉంది. సము ద్రంలో చేపలు పట్టుకునే మత్స్యకారులకు సముద్రంలో ప్రయాణం సహజమే! కాని, మైపాడు, కొత్తకోడూరు, కాటేపల్లి, తుమ్మల పెంట వంటి బీచ్‌లకు వెళ్లే పర్యాటకులు అప్పుడప్పుడు నాటుపడవలెక్కి సము ద్రంలో విహారానికి వెళుతుంటారు. ఈ బోటుల్లో ఎటువంటి లైఫ్‌ జాకెట్లు, రక్షణ చర్యలు వుండవు. బోటు నడిపే మత్స్య కారులు ఒకరిద్దరు వున్నా, ఊహించని ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళు మాత్రం ఎంతమందినని రక్షించగలరు. ఎటువంటి రక్షణ ఏర్పాటు లేకుండానే బీచ్‌ల వద్ద పర్యాటకులు బోట్లు ఎక్కి వెళుతుండడాన్ని తక్షణం అడ్డుకోవాలి. అలాగే నెల్లూరు చెరువులోనూ బోటుషికారు వుంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. రక్షణ చర్యలు బాగానే వుంటున్నాయి. అయితే ఇక్కడున్న బోట్లలో తగినన్ని లైఫ్‌ జాకెట్లు లేవని తెలుస్తోంది. ఇక కండ్లేరు రిజర్వాయర్‌లోనూ ప్రైవేట్‌ వ్యక్తులు పర్యాటకులను ఎక్కించుకుని బోట్లను తిప్పుతున్నారు. చేపల వేట కోసం కొన్ని మోటారు బోట్లు వున్నాయి. గిరిజనులు చేపలవేటకు పుట్టీలు పెట్టుకుని వుంటారు. సెలవు దినాలలో వచ్చిన పర్యాటకులు వీటిని ఎక్కుతున్నారు. నాటుపడవలు, పుట్టీలను నడపడానికి అనుభవముండాలి. ఇవి బ్యాలెన్స్‌ తప్పితే తిరగబడతాయి. ఇలా పుట్టీలు నాటుపడవలలో వెళ్ళే కొందరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. కాబట్టి సురక్షితం కాని జల షికారు కేంద్రాల వద్ద పడవ ప్రయాణాలను అరికట్టే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
  నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
 • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
  2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
 • ప్రాణాలను మింగుతున్న చెరువులు
  అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
 • పోలవరం... ఇక కలవరం
  ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
 • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
  మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter