17 November 2017 Written by 

17-11-2017 రాశిఫలాలు

rasi 17

1Ariesమేషం

ఆర్ధిక స్థితి బాగుండి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహ కరంగా ఉంటాయి. ఆదాయం తృప్తికరం. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకొనేవారికి మంచి సమయమిది. అనుకున్న పనులు సక్రమంగా సాగుతాయి. అవసరాలకు కొద్దిపాటి ఋణం చేస్తారు. కుటుంబసభ్యుల సహకారం బాగుంటుంది. స్థిరాస్తుల లావాదేవీలు వాయిదా పడటం మంచిది. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు.

 

2Taurusవృషభం

వస్తు వాహన గృహ రిపేర్ల ఖర్చులుంటాయి. దూర ప్రయాణాలుంటాయి. శుభకార్యాలలో, సభలు సమావే శాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండి ఆదాయం బాగుంటుంది. బిడ్డల విద్య ఆరోగ్య ఉద్యోగ వ్యవహారాలలో దృష్టి పెడతారు. పరిచయాలు కొత్తవి జరిగి ప్రయోజనం నెరవేరేందుకు ఉపయోగ పడతాయి. స్థిరాస్తుల క్రయవిక్రయాలు జరుగుతాయి.

 

3Geminiమిధునం

అనుకున్న పనులను శ్రమపడి పూర్తి చేస్తారు. వృత్తి జీవనంలో అభివృద్ధి ఉండి ఆదాయం బాగుంటుంది. వ్యాపారవర్గాలకు మాత్రం స్వల్ప ఇబ్బందులుంటాయి. ఆదాయం సామాన్యము. ప్రభుత్వ అనుమతులందు ఆలస్యం జరుగుతుంది. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. ఉద్యోగులు విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉండండి. మొగ మాటాలకు పోవద్దు. విద్యా ప్రగతి బాగుంటుంది.

 

4Cancerకర్కాటకం

వ్యాపారాలలో అభివృద్ధిని గూర్చి సమీక్ష చేసి, కొత్త ప్రయత్నాలు చేపడుతారు. వృత్తి వ్యాపారాలలో ఆదాయం బాగుంటుంది. ప్రారంభించి చేస్తున్న పనులను విజయ వంతంగా నెరవేర్చుతారు. నూతన వస్తు ప్రాప్తి, ప్రము ఖుల పరిచయాలుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూల పరిణామాలుంటాయి. బంధుమిత్రుల సలహా మేలు చేకూర్చుతుంది.

 

5Leoసింహం

ఈ రాశి వారికి ఆర్ధికావకాశాలు బాగుంటాయి. సమాజంలో గుర్తింపు గౌరవాలుంటాయి. సమస్యలను ఇబ్బందులను ఎదుర్కొంటారు. మాటలందు చేతలందు దూకుడు తగ్గించుకొనాలి. ఇతరులకు సహాయ సహకా రాలు అందిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. స్థిరాస్తులు కొనే అవకాశాలుంటాయి. సోదర వర్గానికి అభివృద్ధి ఉంటుంది.

 

6Virgoకన్య

అనుకున్న పనులను పట్టుదలగా నెరవేర్చుతారు. ఆర్ధిక ఉద్యోగ రంగాలపై వచ్చిన అవకాశాన్ని వినియో గించుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ అనుకూలత, బ్యాంకు ఋణాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండి ఆదాయం పెరుగు తుంది. శుభకార్యాలు నిర్ణయం కావచ్చు. స్థిరాస్తుల క్రయ విక్రయాలు జరుపుతారు.

 

7Libraతుల

వృత్తి వ్యాపారాలు బాగా వృద్ధి చెంది ఆదాయం పెరుగుతుంది. అయినా వ్యాపారవృద్ధికి గాని, ఇతర అవసరాలకు గాని ఋణం కొంత చేయవలసి వస్తుంది. సోదరులతో విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. స్థిరా స్తుల లావాదేవీల విషయంలో తొందర వద్దు. ఉద్యోగు లకు పనిభారం పెరుగుతుంది. అధికారుల పర్యవేక్షణ ఎక్కువగా ఉంటుంది.

 

8Scorpioవృశ్చికం

ఆర్ధిక ఇబ్బందులు పెరుగుతాయి. ఖర్చులను అదుపు చేసికొనవలెను. కుటుంబసభ్యులకు అనారోగ్య బాధలుంటాయి. వస్తు నష్టం, వస్తు వాహన రిపేర్ల ఖర్చులు ఎక్కువుగా ఉంటాయి. వృత్తి పరంగా బాగుండి రాబడి ఉంటుంది. వ్యాపారపరంగా సామాన్యంగా ఉం టుంది. చెల్లింపులు వాయిదా పడతాయి. అనుకున్న పనులు నిదానంగా జరుగుతాయి.

 

9Sagittariusధనుస్సు

వ్యాపారవృద్ధి అవకాశాలు లభించకపోవచ్చును. ఆదాయం వ్యాపారవర్గాలకు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరంగా ఆదాయం తృప్తికరం. ముఖ్య బంధువుల నుండి అనారోగ్య వార్తలు వింటారు. శుభకార్య ప్రయ త్నాలలో శ్రద్ధ చూపుతారు. అనుకున్న పనులు నిదా నంగా జరుగుతాయి. ఉద్యోగులకు పని సామర్ధ్యం బాగుండినా, బాధ్యతలు, వత్తిడి పెరుగుతుంది.

 

10Capricornమకరం

పనులందు టెన్షన్‌ ఎక్కువగా ఉంటుంది. అందరిని అనుమానించవలసిన పరిస్థితులుంటాయి. వృత్తి వ్యాపా రాలలో అభివృద్ధి ఆదాయం బాగుంటుంది. కొత్త వస్తు వులను సమకూర్చుకొంటారు. కుటుంబంలో కొద్దిపాటి భేదాభిప్రాయాలుండి సర్ధుకుంటాయి. వత్తిళ్ళకు, మొగ మాటాలకు లొంగవద్దు. ఉద్యోగ ప్రయత్నాలలో అవకా శాలు లభిస్తాయి. లీజులు పొందుతారు.

 

11Aquariusకుంభం

వాహనాలు నడిపేటప్పుడు, యంత్రాలు కరెంటు పనులందు జాగ్రత్త అవసరం. గాయాలు తగలవచ్చును. ఉద్యోగులకు సమర్ధత, గుర్తింపు గౌరవాలుంటాయి. ప్రయాణాలు తప్పనిసరి. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో మంచి అవకాశాలు, అభివృద్ధి ఉంటుంది. వ్యాపారములందు వృత్తిలో ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

 

12Piscesమీనం

నిర్ణయాలు తీసికొనడం, అమలు పరచడంను కట్టు దిట్టంగా జరుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలలో అవకా శాలు బాగుంటాయి కాబట్టి ప్రయత్నించాలి. విద్య, పరి శోధన రంగాలలో మంచి ప్రగతి చూపుతారు. వృత్తి వ్యాపారాలలో అవకాశాలు బాగుండి ఆదాయం బాగుం టుంది. అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయి. బంధువుల నుండి సహాయసహకారాలు బాగుంటాయి.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • పేటలో పోటీకెవరు?
  జిల్లాలో తెలుగుదేశంపార్టీకి గట్టి నియోజకవర్గాలలో సూళ్ళూరుపేట ఒకటి. ఇది ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గం అయినప్పటికి ఇంతకాలంగా వేనాటి సోదరులే ఇక్కడ పార్టీని నడుపుతూ వచ్చారు. అభ్యర్థులను నిర్ణయిస్తూ, గెలిపిస్తూ వచ్చారు. తెలుగుదేశం ఆవిర్భవించాక ఇప్పటివరకు 8సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, 5సార్లు…
 • జగన్‌ జోరు.. బాబు బేజారు
  'మన్మధుడు' సినిమాలో సీన్‌ ఇది... బ్రహ్మానందం ఇంటికి నాగార్జున, సోనాలిబింద్రే వస్తారు. అక్కడ బ్రహ్మానందం భార్యగా ఒక నల్లజాతి మహిళ ఉండడాన్ని చూసి మీది లవ్‌ మ్యారేజీనా అని నాగార్జున అడుగుతాడు. దానికి బ్రహ్మానందం... ముందు ఆమె నన్ను ప్రేమించింది... తర్వాత…
 • ఈ నరకం ఇంకెన్నాళ్ళు
  ''ఈ నగరానికి ఏమైంది... ఓ పక్క మసి... మరోపక్క పొగ... నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం''... థియేటర్లలో గాని, టీవీలలో గాని సినిమా ప్రదర్శనకు ముందు వచ్చే ప్రకటన ఇది. ఇప్పుడు నెల్లూరు పరిస్థితి కూడా అలాగే వుంది. ఓ…
 • రాజకీయ ప్రయాణంలో... ఇది తొలి సంతకం
  ఇప్పటికే నెల్లూరు కేంద్రంగా నెల్లూరుజిల్లాలోనే కాక రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆథ్యాత్మిక, మానవీయ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మన సుల్లో సేవాస్వాప్నికుడిగా ముద్రపడ్డ ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి... తన జీవితంలో మరో సేవా ప్రయాణానికి తొలి సంతకం చేసారు. ఇంతదాకా…
 • వణికిస్తున్న సైకో
  ప్రజలకు ఏ భయం పట్టుకుంటే ఆ భయం కొద్ది రోజుల పాటు వెంటా డుతూనే వుంటుంది. ఒకచోట దొంగ తనం జరిగితే ఎవరిని చూసినా దొంగ లను చూసినట్లే చూస్తారు. ఒకచోట చైన్‌ స్నాచింగ్‌ జరిగితే... ఎవరిని చూసినా చైన్‌ స్నాచర్‌లు…

Newsletter