23 November 2017 Written by 

జిల్లాకి... జబ్బు చేసింది

janamదేవాలయాలలో గర్భగుడి ముందు 'క్యూ'లో భక్తులు లేరు... 'మీ సేవ' కేంద్రాల్లో కౌంటర్ల ముందు జనం లేరు... గ్రామాలలో రేషన్‌ డిపోల వద్ద 'క్యూ'లు లేవు... నగరంలో సినిమాహాళ్ళ వద్ద పెద్దగా ప్రేక్షకుల తాకిడి లేదు... హోటళ్లలో టేబుళ్ళు దాదాపు ఖాళీగానే ఉంటున్నాయి... టెలిఫోన్‌ ఆఫీసులో ఫోన్‌ బిల్లు కట్టే కేంద్రాల వద్ద, బ్యాంకుల్లో క్యాష్‌ కౌంటర్‌ల వద్ద 'క్యూ'లు ఖాళీగానే ఉంటున్నాయి. ఎప్పుడు చూసినా జనంతో రద్దీగా ఉండే ఈ 'క్యూ'లన్నీ ఎందుకు ఖాళీగా వుంటున్నాయి. ఈ జనం అంతా ఏమయినట్లు?

ఏమీ కాలేదు... 'క్యూ'లైన్లో గంటల కొద్ది నిలబడే ఆనవాయితీని వారు మార్చ లేదు. కాకపోతే 'క్యూ'లో నిలబడే ప్రదేశం మారిందంతే. ఇంతకుముందు గుళ్ళలో, మీ సేవా కేంద్రాల్లో, ప్రభుత్వ కార్యా లయాల్లో 'క్యూ'లలో నిలుచున్న జనం ఇప్పుడు కార్పొరేట్‌, ప్రైవేట్‌ ఆసుపత్రులలో డాక్టర్ల ఛాంబర్‌ల ముందు టోకెన్‌లు పట్టు కుని 'క్యూ' లైన్లలో వున్నారు.

స్వచ్ఛభారత్‌, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ నెల్లూరు... పిలవడానికి, పలకడానికి బాగుంటున్నాయే తప్ప ఆచరణలో అది సాధ్యం కావడం లేదు. నెల్లూరుజిల్లా మొత్తం జబ్బుల మయమైంది. ఓ పక్క విషజ్వరాలు... ఇంకోపక్క కిడ్నీ వ్యాధులు... మరోపక్క అంతు తెలియని రోగాలతో జిల్లా ప్రజలు అవస్థలు పడుతున్నారు.

నెల్లూరులో ఎన్ని పెద్దఆసుపత్రులు కట్టినా రోగులకు కొరత లేదు అన్నట్లుగా జబ్బులు పెరుగుతున్నాయి. వ్యాధిగ్రస్థులు పెరిగిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రబ లిన విషజ్వరాలు ప్రజలను వణికిస్తు న్నాయి. విషజ్వరాల రోగులతో కార్పొరేట్‌ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో, చివరకు ఎంబిబిఎస్‌ డాక్టర్లున్న ఆసుపత్రులే కాకుండా ఆర్‌ఎంపి లుండే ఆసుపత్రులు కూడా రోగులతో కిటకిటలాడుతున్నాయి. నెల్లూరు నగరంలో ఏ ఆసుపత్రి వద్ద చూసినా జనం జాతరగా వుంటున్నారు. ఆసుపత్రుల్లో వుండే వ్యాధిగ్రస్తులు, వారికి తోడుగా వచ్చే బంధువులతో... ఆసు పత్రుల్లో రామందాడిగా వుంటుంది. రోగం చూపించుకుందామని పొద్దున్నే వస్తే... సాయంత్రానికి గాని డాక్టర్‌ అపా యింట్‌మెంట్‌ దొరకని పరిస్థితి.

ఇక రోగ నిర్ధారణ కోసం ల్యాబ్‌లలో పరీక్షలు... ఇటీవల వీటి వద్ద 'క్యూ'లు పెరిగిపోతున్నాయి. విషజ్వర బాధితులతో నిండిపోయి కొన్ని ఆసుపత్రుల్లో బెడ్‌లు దొరకడం కూడా కష్టంగా వుంది. బెడ్‌లకు రికమండేషన్‌ చేయించుకునే దుస్థితి దాపురించింది. గ్రామాలలో సరైన వైద్య సదుపాయాలు లేక రోజుకు కొన్ని వేల మంది వ్యాధిగ్రస్తులు నెల్లూరుకు వస్తు న్నారు. ఇక్కడ ఆసుపత్రులలో సకాలంలో వైద్యులు అపాయింట్‌మెంట్‌ దొరకక అవస్థలు పడుతున్నారు. ఫీజులకని, పరీ క్షలకని, ఆసుపత్రుల ఛార్జీలకని వేలకు వేలు వదులుతున్నాయి. విషజ్వరాలను ఎన్టీఆర్‌ వైద్య సేవలో చేర్చి వుంటే పేదలకు కొంచెం ఊరటగా ఉండేది. కాని, ఆ అవకాశం లేకపోవడం వల్ల జ్వరాల కోసమే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ఆంధ్ర రాష్ట్రంలోనే మొదటి స్థానం పొందిన నెల్లూరుజిల్లాలో ఇలాంటి పరిస్థితి ఉండడం ఎంతైనా దారుణమే. స్వచ్ఛ భారత్‌, స్వచ్ఛ నెల్లూరు అని గొప్పగా చెప్పుకుంటున్నామేగాని పరిసరాలను పరి శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల ఈ జబ్బులను మనమే కొనుక్కొచ్చుకుంటున్నాం. రోగాలు ప్రబలడానికి ప్రధానకారణం పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉండడమే. ఇళ్ళ ముందు చెత్త వేసుకుంటున్నాం... మురికి కాలువల్లో సిల్డు తీయడం లేదు... దోమ లను, పందులను ఇళ్ళ మధ్యే పెంచుకుం టున్నాం... ఈ మధ్య సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ హల్‌చల్‌ చేస్తోంది. జంతువు లేమో అడవుల్లో పచ్చటి ప్రకృతి మధ్య ఆనందంగా బ్రతుకుతుంటే మనుషులేమో ధుమ్ము ధూళీ, కాలుష్యం, చెత్తా చెదారం మధ్య రోగిష్టిలా బ్రతుకుతున్నారు. ఈ పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోక చెత్తాచెదారాలతో నింపుకుంటూ తద్వారా వచ్చే జబ్బులతో డాక్టర్ల జేబులు నింపు తున్నాం. కార్పొరేషన్‌ సిబ్బంది వచ్చి చెత్త ఎత్తడం... మున్సిపాల్టీవాళ్ళు వచ్చి మురికి కాలువల్లో సిల్డు తీయడం, శానిటేషన్‌ సూపర్‌వైజర్లు వచ్చి దోమల నిర్మూలనకు ఫాగింగ్‌ చేయించడం... పబ్లిక్‌హెల్త్‌ సిబ్బంది వచ్చి మంచినీటి పైప్‌లైన్లలో డ్రైనేజీ నీళ్ళు కలవకుండా చేయడం వంటి పనులు జరగడం లేదు... ఇక జరగవు కూడా! జనాన్ని జబ్బులకు దూరంగావుంచే పనుల్లో కాదు... తమకు డబ్బు లొచ్చే పనులపైనే పాలకులు శ్రద్ధ చూపుతున్నారు. కాబట్టి జనం ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడకుండా, తమకు రోగాలు రాకుండా చేసుకోవడానికి స్వీయ పరిశుభ్రత చర్యలు చేపట్టడం ఉత్తమం.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
  నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
 • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
  2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
 • ప్రాణాలను మింగుతున్న చెరువులు
  అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
 • పోలవరం... ఇక కలవరం
  ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
 • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
  మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter