Thursday, 23 November 2017 17:11

రక్తపరీక్ష ఖరీదు 5 వేలు ఈ డాక్టర్‌ కంటే... జలగే మేలు

Written by 
Rate this item
(0 votes)

5000ప్రాణం పోసే దేవుడిని మనుషులు చూడ లేరు... ప్రాణం నిలిపే దేవుడు వైద్యుడిని మాత్రం అందరూ చూడగలరు. భారతదేశంలో వైద్య వృత్తిని అంత పవిత్రంగా చూస్తారు. వైద్యవృత్తిని మాన వతా కోణంలో, సేవాదృక్పథంతో చూసే వాళ్ళు ప్రజల గుండెల్లో దేవుళ్ళుగానే వుంటారు. అదే వైద్యవృత్తిని మాన వత్వంతో కాక వ్యాపార కోణంలో చూసే వాళ్ళు ప్రజల మస్తిష్కాలలో బందిపోటుల కన్నా దారుణమైన దోపిడీదారు లుగా ముద్రపడిపోతారు.

చచ్చిన పేషంట్‌కు ట్రీట్‌మెంట్‌ చేసి లక్షలు గుంజే 'ఠాగూర్‌' సినిమా సీన్‌లు నిజజీవితంలో ఎన్నో జరుగుతుంటాయి. ఇవి కాకుండా కడుపులో కత్తెర పెట్టి కుట్లు వేయడం... ఎడమ కాలుకు బదులు కుడి కాలికి ఆపరేషన్‌ చేయడం, కంటి నొప్పి అని పోతే పంటి నొప్పికి మందులివ్వడం, ఆసుపత్రులలో ఎలుకలు కొరికి బిడ్డలు చనిపోవడం... మన వైద్య రంగంలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరుగుతుంటాయి. ఇలాంటి అద్భుతాలలో ఇంకోటి... ఒక రోగం టెస్ట్‌ కోసం పోతే సకల రోగాలకు టెస్ట్‌లు వ్రాసి డబ్బులు గుంజడం. వైద్య రంగంలో ఇదో పెద్దదోపిడీ! పేషంట్‌ రెగ్యులర్‌ చెకప్‌లో భాగంగా ఒక వ్యాధికి సంబంధించి పరీక్ష చేయించు కోవాలనుకుంటే, అలాంటి వారికి డాక్టర్లు హెల్త్‌ ప్యాకేజీ అంటగట్టి వేల రూపాయలు దండుకోవడం... ఇదొక మెడికల్‌ దోపిడి. నెల్లూరు పొగతోటలో డయాబెటిస్‌ సెంటర్‌ వుంది. ఇటీవల ఓ వ్యక్తి షుగర్‌ పరీక్షకని వెళ్ళాడు. అతనికి షుగర్‌ సమస్య తప్ప ఇంకేమీ లేదు. షుగర్‌ టెస్ట్‌కు 300 రూపాయలు. అది కొంచెం కాస్ట్‌లీ ఆసుపత్రి కాబట్టి ఇంకో రెండొందలు అదనంగా తీసుకున్నా సమస్య లేదు. అతను షుగర్‌ టెస్ట్‌కని వెళితే తమ ఆసుపత్రిలోని ల్యాబ్‌లో వున్న అన్ని రకాల టెస్ట్‌లను ఆయనకు వ్రాసారు. ఇందులో 64ఏళ్ల వయసున్న ఆ వ్యక్తికి రాసిన టెస్ట్‌లలో హెచ్‌ఐవి టెస్ట్‌ కూడా వుంది. అంతేకాదు, అవసరం లేని టెస్ట్‌లన్నీ ఇంకా ఎన్నో వున్నాయి. ప్యాకేజీలో వున్న ఇన్ని టెస్ట్‌లను రక్తనమూనాతో నిజంగానే చేస్తున్నారో, లేకపోతే ఏదో ఒక రిజల్ట్‌ వేసి రిపోర్ట్‌ పత్రాలు ఇస్తున్నారో అన్నది ఒక అనుమానం. పేరుకేమో షుగర్‌టెస్ట్‌ వందరూపాయలే... అతనికి కావాల్సిన టెస్ట్‌ చేస్తే ఖర్చు వంద రూపాయలే... అవసరమైన టెస్ట్‌ ఒకటైతే, అనవసరమైన టెస్ట్‌లు పాతికపైగా వ్రాసి అక్షరాలా 5వేల రూపాయలు గుంజారు. ఇలా రోజుకు ఎంతమంది పేషంట్ల నుండి గుంజుతున్నారో... ఎన్ని లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారో? రోగాలను బూచిగా చూపి వైద్యులు ఇలాంటి దోపిడీకి పాల్పడితే ఇక పేషంట్లు కరెన్సీ నోట్లతో కాకుండా ఆస్తుల పత్రాలను తీసుకుని ఆసుపత్రులకు వెళ్ళాల్సి వుంటుంది. ముఖ్యంగా ఈ డాక్టర్‌ రోగుల రక్తాన్ని జలగలా పీల్చడంలోనూ తద్వారా వచ్చే సంపాదనతో నగరమంతా అక్రమ కట్టడాలను నిర్మించడంలోనూ ఆరితేరి పోయి వున్నాడు. తన క్లినిక్‌లోనే పరీక్షా కేంద్రం పెట్టి అక్కరకు లేని టెస్టులన్నీ రాసిపారేసి రక్తం పీల్చేస్తున్నాడు. చక్కెర వ్యాధి డాక్టరుగా ఆయన ఫీజు 200 రూపాయలైతే ఆయన రాసే పరీక్షలకు 5000 రూపాయలంటే ఈయన గారి దోపిడీ ఏ స్థాయిలో వుందో మనం ఊహించుకోవచ్చు.

Read 36 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter