23 November 2017 Written by 

ఇది అందరి భారత్‌!

bandariఎక్కడైనా.. ఎప్పుడైనా సరే, కీలక సమయాల్లో ఆలోచించి అడుగేయడం.. సమస్యలు వచ్చినప్పుడు ముందుచూపుతో జాగ్రత్తగా వ్యవహరించడం అన్నది ఎంతైనా ముఖ్యం. ఎక్కడా తొందరపాటు పనికి రాదు. ఇది, ఏ ఒక్కవ్యక్తికో కాదు, అందరికీ ఇదే మాట వర్తిస్తుంది. సుహృద్భావపూరిత వాతావరణంలో, సమస్యలను అవగాహన చేసుకుని వాటి పరిష్కారానికి సముచితమైన నిర్ణయాలు తీసుకునేవారికి మేలే జరుగుతుంది. ఇప్పుడు భారత్‌ కూడా అదే బాటలో పయనిస్తోది. అదే భారత్‌కు విజయాలను చేరువ చేస్తోంది. ఆయా దేశాలతో ఎప్పటికప్పుడు సుహృద్భావ సంబంధాలు కలిగివుండడం, సముచితమైన నిర్ణయాలతో మైత్రీభావంతో వ్యవహరిస్తుండడం వల్లనే ప్రపంచదేశాల్లో భారత్‌కు ఎనలేని గౌరవం లభిస్తోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందులోనూ ముఖ్యంగా ప్రపంచదేశాలతో దౌత్యపరంగా విజయం సాధించాలంటే మరెంతో కష్టసాధ్యమైనప్పటికీ, అంతటి బృహత్‌ కార్యాలను సాధించేందుకు ఇటీవలికాలంలో భారత్‌ చేస్తున్న కృషి ఎంతో అభినందించదగినదని చెప్పవచ్చు. తాజాగా ఐక్య రాజ్యసమితిలో ఇటీవల జరిగిన ఐసీజె న్యాయమూర్తి ఎన్నికలోనూ అలాంటి సుహృద్భావపూరితమైన.. దౌత్యపరమైన కృషే మనదేశ అభ్యర్ధి విజయానికి ఎంతగానో తోడ్పాటునందించి వుంటుందని భావించ వచ్చు. నేరుగా, ఐక్యరాజ్యసమితి వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల పోరులో భారత్‌కు భారీ దౌత్యవిజయం లభించడం ఎంతైనా ఘనవిశేషమే. ఇదెంతో సంతోషకరమైన పరిణామం కూడా. అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసిజె) న్యాయ మూర్తి ఎన్నికలు మొన్నటికిమొన్న ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగాయి. బ్రిటన్‌-భారత్‌ల మధ్య ఈ పోటీ హోరాహోరీగానే ప్రారంభం కావడంతో ఇది యావత్‌ ప్రపంచం దృష్టినీ ఆకర్షించింది. ఐసిజె న్యాయమూర్తి పదవికి అభ్యర్ధిగా ఉన్న మనదేశానికి చెందిన జస్టిస్‌ దల్వీర్‌ భండారీని ఎలాగైనా ఓడించి తన ప్రాభవాన్ని నిరూపించుకోవాలని బ్రిటన్‌ శత విధాలా ప్రయత్నించింది. అయినా, పరిస్థితులు అందుకు అనుకూలించకపోవడం, భండారీ వైపే సభ్యుల మద్దతుగా ఎక్కువగా ఉందని భావించిన బ్రిటన్‌, తమ అభ్యర్దిగా ఉన్న గ్రీన్‌వుడ్‌ను పోటీనుంచి తప్పించి, భారత్‌కు మద్దతు పలకడం..చకచకా జరిగిపోయాయి. ఓటింగ్‌కు మొత్తం 12 రౌండ్లుంటే, 11 రౌండ్లు జరిగేదాకా బ్రిటన్‌ పోటీలోనే కొనసాగింది. ఎలాగైనా ఆ పదవిని దక్కించుకోవాలని ఆతృతపడింది. అయితే, చివరిక్షణంలో అది సాధ్యం కాదనే అంచనాకు వచ్చిన బ్రిటన్‌, ఇంకా మొండిగా ముందుకు వెళ్తే భంగపాటు తప్పదేమోనన్న విషయం గ్రహించి, ఆఖరిక్షణంలో తన అభ్యర్ధిని పోటీనుంచి విరమింపజేసి, తానే భారత్‌కు మద్దతు పలికింది. దీంతో, జస్టిస్‌ భండారీ ఐరాసలో అత్యున్నతమైన ఐసిజె న్యాయమూర్తి పదవికి మరోసారి ఎన్నిక కావడం చరిత్రాత్మకమైన విషయం. భారత్‌పై నమ్మకం ఉంచి ఎంతోమంది ఐరాస సభ్యులు భండారీ వైపు మొగ్గుచూపడం భారత్‌కు అక్షరాలా ఘనవిజయమే.ఐక్యరాజ్యసమితి వేదికగా జరిగిన ఈ ఎన్నికలు తొలుత ఎంతో ఉత్కంఠతో ప్రారంభం కావడంతో అభ్యర్ధి ఎంపికపై తొలినుంచి చివరిక్షణం వరకు ఉత్కంఠగానే ఉండింది. అయితే, సర్వప్రతినిధి సభలో 193 దేశాల్లో, 183 దేశాలు, భద్రతామండలిలో 15 దేశాల ఓట్లు భండారీకే లభించడంతో భండారీ ఘనవిజయం సాధించినట్లయింది. దీంతో, ఐరాస భద్రతామండలిలోని శాశ్వత సభ్యదేశమైన బ్రిటన్‌ తొలిసారిగా ఐసిజెలో చోటు కోల్పోవడం విశేషమే. గత 70 సంవత్సరాల్లో భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశమైన బ్రిటన్‌కు ఇలా జరగడం ఇదే తొలిసారి. ఐసిజె ఏర్పాటైన తరువాత ఈ 70 ఏళ్ళలో భద్రతా మండలిలోని ఓ శాశ్వత సభ్యత్వ దేశం తొలిసారిగా శాశ్వత సభ్యత్వం లేని దేశానికి సీటును కోల్పోయినట్లయింది. ఇది తమ దేశానికి అవమాన కరమంటూ బ్రిటన్‌ మీడియా వ్యాఖ్యానిస్తున్నా, భారత్‌కు మద్దతు పలికేందుకే.. విదేశాంగ విధానంలో భాగంగానే...ఇలా తమ అభ్యర్ధిని వెనక్కు తీసేసుకున్నామని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. ఐరాసతో పాటు, అంతర్జాతీయంగానూ భారత్‌తో కలసి పనిచేస్తూనే ఉంటామని బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించింది కూడా.

ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఐసిజె జడ్జిగా ఎన్నికైన దల్వీర్‌ భండారీకి అభినందనలు వెల్లు వెత్తాయి. ఈ తాజా విజయంతో జస్టిస్‌ భండారీ ఆ పదవిలో తొమ్మిదేళ్ళపాటు కొనసాగుతారు. ఈ విజయం భారత్‌కు ఎంతో ప్రతిష్టను చేకూరుస్తుందని వేరే చెప్పనక్కరలేదు. ఈ విజయం వెనుక భారత దౌత్యశాఖ చేసిన కృషిని విస్మరించలేం. ఐక్యరాజ్య సమితిలోని 193 దేశాల్లో 183 దేశాలు, భద్రతా మండలిలోని 15 దేశాలు మనకు మద్దతునిచ్చాయంటే చిన్నవిషయమేమీ కాదు. ఇదంతా విదేశాంగ మంత్రితో పాటు, ఆ మంత్రిత్వశాఖ ఉన్నతాధికారుల కృషేనంటూ ప్రధాని మోడీ ఈ విజయం పట్ల సంతో షంతో అభినందించారు కూడా. ముఖ్యంగా ఇందులో విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌, ఆ మంత్రిత్వశాఖ ప్రతినిధులతో పాటు, ఐక్యరాజ్యసమితిలో భారత్‌ ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ తదితరుల కృషి ఎంతో విశేష మైనదని చెప్పవచ్చు. ఏదేమైనా, అంతర్జాతీయస్థాయిలో ఒక విశిష్టమైన స్థానాన్ని సాధించుకుంటూ భారత్‌ ముందడుగు వేస్తోందని ఈ విజయం మనకు స్పష్టం చేస్తోంది.

ప్రపంచాన్ని భయపెడుతున్న ఉగ్రవాదాన్ని సమూలంగా అరికట్టేందుకు ప్రపంచదేశాలన్నీ సమిష్టిగా పోరు సాగించడం, మానవాళికి ప్రమాదకరంగా తయారవు తున్న కాలుష్య వాతావరణాన్ని అరికట్టేందుకు సకల చర్యలూ తీసుకోవడం, తద్వారా విశ్వమానవాళి శ్రేయస్సుకు అందరూ బాటలు వేయడం వంటి ప్రపంచ ప్రాధాన్యతగలిగిన అంశాల్లో భారత్‌ ప్రతిపాదనలకు విశ్వవ్యాప్తంగా మరింత విశ్వసనీయత కలిగేందుకు కూడా ఇలాంటి విజయాలు.. పరోక్షంగా దోహదం చేస్తాయని భావించవచ్చు. ఏదేమైనా ఈ విజయం భారత్‌కు ఎంతో సంతోషాత్మకమే కాదు.. చరిత్రాత్మకం కూడా!....Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter