23 November 2017 Written by 

24-11-2017 రాశిఫలాలు

rasi 24

1Ariesమేషం

ఉద్యోగులు సహచరులతో, అధికారులతో జాగ్రత్తగా మెలగండి. ఇతరుల నుండి అనుకున్న సహాయాన్ని పొందలేకపోవచ్చును. శుభకార్య ప్రయత్నాలకు ఆటం కాలుండటం జరుగుతుంది. చిన్న వ్యాపారులకు ఆదాయం ఫరవాలేదు. విద్యార్థులు బాగా కష్టపడి చదవ వలసి ఉంటుంది. వృత్తివ్యాపారాలు సంతృప్తికరంగా ఉండవు. ఖర్చులు పెరుగుతాయి.

 

2Taurusవృషభం

గృహ నిర్మాణదారులకు, కాంట్రాక్టర్లకు బాగుం టుంది. భూ లావాదేవీలు ఫలించగలవు. సభలు, సమా వేశాలలో గుర్తింపు గౌరవాలు బాగుంటాయి. ఉద్యోగు లకు ప్రమోషన్లు, అధికారవర్గ సహకారం బాగుంటుంది. కోర్టు కేసులందు అనుకూలత, విద్యార్థులకు మంచి ప్రగతి, జాతకులకు ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి పరంగా జీవనం కలవారికి ఆర్థికస్థితి బాగుంటుంది.

 

3Geminiమిధునం

అనుకోని ప్రయాణాలు, శుభకార్య ప్రయత్నాలలో ఆలస్యం ఉంటుంది. వ్యవహారాలలో సరైన నిర్ణయాలు తీసికొంటారు. ఉద్యోగార్ధులకు మేలైన అవకాశాలుండక పోవచ్చును. కుటుంబసౌఖ్యం, బంధు సఖ్యత బాగుం టుంది. విద్యా ప్రగతి బాగుంటుంది. కొత్త పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలకు అవకాశాలు లభించగలవు. అవసరాలకు మాట రూపేణా సహాయం చేస్తారు.

 

4Cancerకర్కాటకం

ఉద్యోగులకు రావలసిన బాకీలు లభించడం, పని భారం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు జరుప కుండా జాగ్రత్తపడాలి. బిడ్డల విద్యా శుభకార్య విషయా లందు శ్రద్ధ చూపుతారు. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడు కొనండి. రావలసిన బాకీలు కొంత అందుతాయి. ఆర్ధి కంగా బాగుండి, వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. గౌరవ ప్రతిష్టలు బాగుంటాయి.

 

5Leoసింహం

ఆకస్మిక ప్రయాణాలుంటాయి. పారిశ్రామికవేత్త లకు, కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధు మిత్రులకు సహాయపడతారు. ప్రముఖులతో పరిచయా లుంటాయి. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. విద్యావృద్ధి కలదు. ఆదాయం పెరిగి వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి.

 

6Virgoకన్య

పట్టుదలతో అనుకున్న పనులు సాధించుకొంటారు. అనుకోని పెద్ద ఖర్చు పైనబడగలవు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. విద్యాప్రగతి బాగుంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. స్థిరాస్తుల లావాదేవీలు, కొత్త పెట్టు బడులు జరుపుతారు. వృత్తి జీవనం కలవారికి ఆర్ధికంగా బాగుంటుంది. హోల్‌సేల్‌ వ్యాపారులకు, కాంట్రాక్టులకు ప్రభుత్వ పరంగా ఇబ్బందులుంటాయి.

 

7Libraతుల

ఇతరులపై ఆధారపడకుండా నిర్ణయాలు తీసి కొనండి. గృహ వస్తు వాహన రిపేర్లు ఏర్పడతాయి. కుటుంబసభ్యులకు అనారోగ్య బాధలుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూల సమయం. ఉద్యో గులకు విధి నిర్వహణ బాగుంటుంది. ఆరోగ్య విష యంలో జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యపనులు వాయిదా వేసికొంటారు. కొత్త పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి.

 

8Scorpioవృశ్చికం

కొత్త పరిచయాలు, దైవ కార్యాలలో పాల్గొనడం, దూర ప్రయాణాలు వాయిదా పడటం జరుగుతుంది. పరుష ప్రవర్తన, తొందరపాటు మాటలు తగ్గించు కోవాలి. విద్యా ప్రగతి బాగుంటుంది. స్థిరాస్తుల లావా దేవీలు జరుపుతారు. సమస్యాత్మక విషయాలలో సంప్ర దింపులు, చర్యలు జరిగి పరిష్కారం కాగలవు. వృత్తి వ్యాపారాలలో మంచి అవకాశాలు వస్తాయి.

 

9Sagittariusధనుస్సు

బిడ్డలకు అభివృద్ధి బాగుంది. ఉద్యోగులకు స్థాన మార్పులు, పని భారం బాగుంటుంది. యజమానులు వర్కర్లతో జాగ్రత్తగా మెలగండి. శరీరానికి గాయాలు తగల వచ్చును. కొంతమంది మిమ్మల్ని పరోక్షంగా కించ పరచవచ్చును. విద్యాప్రగతి బాగుంటుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులను అధిగమించి, రాబడి పెరుగుతుంది. వృత్తి జీవనంలో సామాన్య అవకాశాలుంటాయి.

 

10Capricornమకరం

సమస్యలు క్రమంగా సర్దుబాటు కాగలవు. పారిశ్రా మిక వర్గాలకు ప్రోత్సాహం ఉంటుంది. శుభకార్య ప్రయ త్నాలలో అనుకూలత కలదు. ఆస్తుల లావాదేవీలు వాయిదాపడతాయి. విద్యాప్రగతి, ఆరోగ్యం బాగుం టుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగుతాయి. ఆశించినంత ఎక్కువ ఆదాయముండదు. కోర్టు వ్యవ హారాలు వాయిదా పడతాయి.

 

11Aquariusకుంభం

ఉద్యోగులు తమ విధి నిర్వహణ సమర్ధవంతంగా జరుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలలో అవకాశాలు దొరుకు తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్ధి కంగా బాగుంటుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలుండి సర్దుబాటు కాగ లవు. గృహ వస్తు వాహన రిపేర్ల ఖర్చులుంటాయి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉంటాయి.

 

12Piscesమీనం

ఉద్యోగార్ధులకు అవకాశాలు లభిస్తాయి. అనుకున్న పనులను జాగ్రత్తగా నెరవేర్చుకుంటారు. విద్యా ప్రగతి బాగుంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. ఉమ్మడి వ్యాపారు లకు లీజులకు అవకాశాలు దొరుకుతాయి. కళాక్రీడా సాంకేతిక రంగాల వారికి ఆదరణ ఉంటుంది. బంధు వర్గాన్ని కలుసుకొంటారు. ప్రయాణాలుంటాయి. పైకి తీవ్రత లేకపోయినా ఆర్ధికంగా ఇబ్బందులుంటాయి.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
  నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
 • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
  2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
 • ప్రాణాలను మింగుతున్న చెరువులు
  అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
 • పోలవరం... ఇక కలవరం
  ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
 • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
  మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter