01 December 2017 Written by 

ఆంధ్రుడికి అవమానం

ivankaఛార్మినార్‌... గోల్కొండ... సాలార్‌జంగ్‌ మ్యూజియం... నిజాం హాస్పిటల్‌... అసెంబ్లీ భవనం... చారిత్రక హైదరాబాద్‌ నగరం చిహ్నాలు... ట్యాంక్‌ బండ్‌... హైటెక్‌ సిటి... శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌... ఔటర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే... మెట్రో... ఇవన్నీ ఆధునిక హైదరాబాద్‌ నగర ప్రతిరూపాలు. చారిత్రక నిర్మాణాల నిర్మాతలు నిజాం నవాబులైతే, ఆధునిక నిర్మాణాల సారధులు ఆంధ్రులే! ఇందులో ఇసుమంతైనా సందేహం లేదు. ఆధునిక హైదరాబాద్‌ అభివృద్ధిలో ప్రధాన పాత్రధారులు ఆంధ్రా ప్రాంతపు ముఖ్యమంత్రులే!

హైదరాబాద్‌కు ల్యాండ్‌మార్క్‌ లాంటి ట్యాంక్‌బండ్‌ నిర్మాత స్వర్గీయ నందమూరి తారకరామారావు. హైదరాబాద్‌లో హైటెక్‌ సిటిని నిర్మించి హైటెక్‌ బాట పట్టించింది చంద్రబాబునాయుడు, ఇక దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో అయితే హైదరాబాద్‌ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. వై.యస్‌. హయాంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, పి.వి.నరసింహా రావు ఎక్స్‌ప్రెస్‌ హైవేలతో హైదరాబాద్‌ అంతర్జాతీయ స్థాయి నగర రూపురేఖలు దిద్దుకుంది. ఇక ఇప్పటి మెట్రో ప్రాజెక్ట్‌కు ఆద్యుడు కూడా వైయస్సే! మెట్రో ప్రాజెక్ట్‌ను వై.యస్‌ తెచ్చాడు. మెట్రోను కేసీఆర్‌ వ్యతిరేకించాడు. ఆధునిక హైదరాబాద్‌ నిర్మాణంలో ఆంధ్రుల పాత్ర ఎంతో వుంది. హైదరాబాద్‌ నగర నగిషీలుగా చెప్పుకునే ఏ ఒక్కదానిలోనూ కేసీఆర్‌ పాత్ర లేదు.

కాని, నిన్న జరిగిన మెట్రో ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి గాని, అమెరికా అధ్య క్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్‌ పాల్గొన్న కార్యక్రమానికి గాని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిని ఆహ్వానించకపోవడం ఆంధ్రులను అవమానించడమే! హైదరా బాద్‌ ఉమ్మడి రాజధాని. మెట్రో ప్రాజెక్ట్‌ ఉమ్మడి రాష్ట్రాల హక్కు. ఇంకా ఆరున్న రేళ్ళు హైదరాబాద్‌పై ఆంధ్రులకు హక్కు వుంది. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి కూడా! మరి ఆంధ్రా సీఎంను ఎందుకు గుర్తించలేదు? ఎందుకు గౌరవించలేదు. 2023దాకా హైదరాబాద్‌ నుండి మనల్ని ఎవరూ కదిలించలేరు, విభజన చట్టమే మనకు ఆ అవకాశమిచ్చింది. కాని చంద్రబాబే ఓటు-నోటు కేసులో ఇరుక్కుని హైదరా బాద్‌ను వదిలేసి వచ్చాడు. ఆయనంటే హైదరాబాద్‌ను వదిలేసినా కేంద్రమన్నా హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కు వున్న అధికారాన్ని గుర్తించనక్కరలేదా?

ఈ కార్యక్రమాలకు చంద్రబాబును ఉద్దేశ్యపూర్వకంగానే పిలవలేదా లేక ఆయన మీదున్న అనుమానంతో పిలవ లేదా అన్న సందేహాలు కూడా వున్నాయి. ఏ సభలో చూసినా హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేసానని చంద్రబాబు చెప్పు కుంటుంటాడు. వై.యస్‌.తో పోలిస్తే హైదరాబాద్‌ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర చాలా తక్కువ. అయినా డబ్బా కొట్టుకోవడంలో ఆయనే ముందుంటాడు. అలాంటి వ్యక్తిని మెట్రో, ఇవాంకా కార్య క్రమాలకు పిలిస్తే అక్కడకూడా అదే డబ్బా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా డామినేట్‌ చేయాలని చూస్తాడు. ఇక ఏ కార్యక్రమంలోనైనా చంద్రబాబును హైలెట్‌ చేసి చూపించడానికి పచ్చమీడియా రెడీగా వుంటుంది. చంద్రబాబును పిలిస్తే ఇలాంటి పరిణామాలుంటాయని ఊహించే ఆయనను పట్టించుకోలేదని తెలుస్తోంది.

కేసీఆర్‌, కేటీఆర్‌లు ఈ కార్యక్రమాల విషయంలో నియంతల మాదిరిగా వ్యవహరించారు. హైదరాబాద్‌ నగరానికి ప్రథమ పౌరుడైన మేయర్‌ బొంతు రామ్మో హన్‌కు కూడా ప్రాధాన్యత కల్పించక పోవడం వివాదం రేపింది. రాష్ట్రపతి దేశానికి ప్రథమ పౌరుడైతే, గవర్నర్‌ రాష్ట్రానికి ప్రథమపౌరుడైతే, మేయర్‌ నగరానికి ప్రథమపౌరుడవుతాడు. ప్రోటో కాల్‌లో మంత్రులకంటే కూడా మేయర్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అలాంటి మేయర్‌ను కూడా పక్కనపెట్టేశారు. ఏపి సీఎంను పిలవకపోవడం, మేయర్‌ను పక్కన పెట్టడం వంటి సంఘటనలు రాజకీ యంగా వివాదం రేకెత్తిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామాలు ఎలా వున్నా ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రికి కేంద్రం గాని, తెలంగాణ ప్రభుత్వం గాని కనీస గౌరవం ఇవ్వకపోవడం, ప్రోటోకాల్‌ పాటించి ఆయనను ఆహ్వానించకపోవడం ఆంధ్రు లను చిన్నచూపు చూడడమే!Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter