01 December 2017 Written by 

పోలవరం... ఇక కలవరం

polavaramఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు. చిక్కిందే తడవుగా వాళ్ళు ఆయన నెత్తిన పెట్టారు. ఈయన నెలకోసారి అంచనాలు పెంచుకుంటూ పోతుంటే వాళ్ళు సంవత్సరానికోసారి కూడా నిధులు ఇవ్వడం లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను నేను చేయలేనంటూ చేతులెత్తేసాడు.

గురువారం అసెంబ్లీ సాక్షిగా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం తమవల్ల కాదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రక టించి తన నిస్సహాయతను చాటుకున్నారు. ఉన్న నిధులన్నింటిని పుష్కరాలకి, పండుగలకి, సింగపూర్‌ రాజధాని అని తగలేసిన ఆయన ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవనాడి అయిన పోలవరంను మాత్రం త్రిశంకుస్వర్గంలో పెట్టాడు.

పోలవరం రాష్ట్ర ప్రజానీకానికి వరమే. కాంగ్రెస్‌ ప్రభుత్వం లోని దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. దీనికి అత్యంత అవసరమైన కాలువల తవ్వకాన్ని ముందుగానే చేయించారు. రెండో టర్మ్‌ కూడా వై.యస్‌. వుం డుంటే పోలవరంకు ఒక రూపం వచ్చివుండేది. ఆయన మర ణంతో ఈ ప్రాజెక్ట్‌ మరుగున పడగా, విభజన సమయంలో మళ్ళీ తెరమీదకొచ్చింది. రాష్ట్ర విభజన హామీలలో పోలవరం ప్రాజెక్ట్‌ ఒకటి. దీనిని పూర్తిచేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని విభజన చట్టంలో స్పష్టంగా వుంది. 2014లో అధికారం లోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేకహోదాను అటకెక్కించినా పోలవరంను మాత్రం చేస్తామంది. అయితే ప్రత్యేకహోదా వద్దని ప్రత్యేక ప్యాకేజీకి మొగ్గుచూపిన చంద్రబాబు, పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యతను కూడా తనకే అప్పగించాలని కేంద్రాన్ని కోరాడు. మా నొప్పి మీరు భరిస్తామంటే మాకేం ఇబ్బందని వాళ్ళు అలాగే ఇచ్చేసారు. పోలవరం ప్రాజెక్ట్‌ ద్వారా భారీ స్థాయిలో ప్రయోజనాలు ఆశించారు. యధేచ్ఛగా అంచనాలు పెంచుకోవచ్చని, అడిగినంత బిల్లులను కేంద్రం పంపిస్తుందని ఆశపడ్డారు. కాని అక్కడ వుండేది మోడీ... ఇసుకలో నూనె పిండే రకం. స్టీలు రేటెంత, సిమెంట్‌ రేటెంత... ఆ ప్రాజెక్ట్‌ కట్టడానికి ఎంత ఖర్చవుతుందన్నది వారికి తెలియకుండా వుం టుందా? ఈ మూడున్నరేళ్లలో పోలవరం అంచనా వ్యయాన్ని 16వేల కోట్ల నుండి 54వేల కోట్లకు తీసుకెళ్లారు. భారీగా అంచనా వ్యయం పెంచడంతో కేంద్రం నిధుల విడుదల విష యంలో ఆచితూచి అడుగులు వేయసాగింది. దీంతో ప్రాజెక్ట్‌ నిర్మాణం ముందుకు మూడడుగులు, వెనుకకు ముప్పై అడుగులు అన్నట్లుగా మారింది. ఈ మూడేళ్లలో కాపర్‌డ్యాం కూడా కాలేదు. 12వేల కోట్లు ఖర్చుపెట్టామని చంద్రబాబు చెబుతున్నాడు. ఇంకా 42వేల కోట్లు కావాలంటున్నాడు. కేంద్రం ఈయన అడిగినన్ని నిధులు ఇవ్వకపోతుండడంతో ఇప్పుడు నేను చేయలేనంటూ చేతులెత్తేసాడు.

పోలవరం విషయంలో బీజేపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కేంద్రప్రభుత్వం సరిగా డబ్బులివ్వలేదని టీడీపీ నేతలు నిందను బీజేపీపై వేయాలని చూస్తున్నారు. కేంద్రం కడతానన్న ప్రాజెక్టును నువ్వెందుకు ఒప్పుకున్నావంటూ ప్రతిపక్షాలు చంద్రబాబును వాయిస్తున్నాయి. కేంద్రం నుండి వస్తున్న డబ్బులతో వైకాపా ఎమ్మెల్యేలను కొంటున్నావు... ఇక పోలవరం ఎక్కడ పూర్తి చేస్తావని బీజేపీ నాయకులు చంద్ర బాబుపై దాడి చేస్తున్నారు. పోలవరం విషయంలో చంద్రబాబు అనవసర అత్యాశకుపోయి రాష్ట్రానికే చేటుతెచ్చాడు. పోలవరాన్ని ప్రజలకు వరంగా కాకుండా శాపంగా మారుస్తున్నాడు.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter