01 December 2017 Written by 

ప్రాణాలను మింగుతున్న చెరువులు

cheruvuఅన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ గ్రామంలో గత నెల 26న చోటు చేసుకుంది. ఈ సంఘటనతో ఆనేగొట్టం, ఆనేపూడి గ్రామాల్లోని మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. పోలీసుల కథనం మేరకు ఆనేగొట్టం గ్రామానికి చెందిన కార్నా రాకేష్‌(14), వంకా వెంకట్‌హేమంత్‌(12), హరీష్‌, ఆనేపూడి గ్రామానికి చెందిన చొప్పల జయకృష్ణ(14) కలసి వడ్డికండ్రిక గ్రామానికి చెందిన స్నేహితుడు రాజేష్‌ ఇంటికి వెళ్లారు. అక్కడ నుంచి సరదాగా అందరూ కలుసుకుని గ్రామ సమీపంలోని చెరువులోకి ఈతకు వెళ్లారు. చెరువు ఒడ్డున రాజేష్‌, హరీష్‌ ఉండగా మిగిలిన ముగ్గురు విద్యార్థులు చెరువులోకి ఈత కొట్టేందుకు దిగారు. చెరువులో గ్రావెల్‌ గుంతలు ఉండటంతో ఈతరాని ముగ్గురూ ఒక్కసారిగా మునిగిపోయారు. ఒడ్డున ఉన్న విద్యార్థులు దిక్కుతోచక భయంతో చూస్తూ ఉండిపోయారు. మధ్యాహ్నం 12గంటలకు దుస్తులు ఉతికేందుకు కొందరు మహిళలు రాగా వారికి విషయం తెలియడంతో గ్రామానికి వెళ్ళి విషయం చెప్పారు. హుటాహుటిన వడ్డికండ్రిగ గ్రామానికి చెందిన కొందరు యువకులు చెరువులోకి దిగి ముమ్మరంగా రెండు గంటల పాటు గాలించారు. తొలుత జయకృష్ణ మృతదేహం, అనంతరం రాకేష్‌, వెంకట్‌హేమంత్‌ మృతదేహాలను బయటకు తీసారు. అప్పటికి సంఘటనా స్థలానికి విద్యార్థుల తల్లి దండ్రులు, బంధువులు చేరుకున్నారు. విద్యార్థుల మృతదేహాలను చూసి బోరున విలపించారు. ముగ్గురు విద్యార్థులు జడ్పీ పాఠశాలలో చదువుకుంటున్నారు. తహశీల్దార్‌ వెంటేశ్వరరావు, ఎస్సై కోటిరెడ్డి, ఎంపిటిసి కిషోర్‌, సర్పంచ్‌ విజయ్‌నాయుడు మృత దేహాలకు నివాళులర్పించారు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter