01 December 2017 Written by 

కాంగ్రెస్‌ను కాపాడేనా?

rahul gandhiకాంగ్రెస్‌ ముక్త భారత్‌ నా లక్ష్యం అని ప్రధాని నరేంద్రమోడీ ఓ పక్క కంకణం కట్టుకుని పని చేస్తున్నాడు. దేశ రాజకీయ చరిత్రలో ఇంతవరకు తాముంటున్న పార్టీ అభివృద్ధి కోసం పాటుపడిన నాయకులను చూసాం, కాని తొలిసారిగా ఇంకో పార్టీ పతనం కోసం పని చేస్తున్న నాయకుడిగా నరేంద్ర మోడీని చూస్తున్నాం. ప్రధాని అయ్యాక ఆయన ప్రసంగాలు గమనిస్తే... తనను ప్రధానిని చేసిన భారతీయ జనతాపార్టీ పేరు కంటే ప్రతిపక్ష కాంగ్రెస్‌పార్టీ పేరునే ఆయన ఎక్కువసార్లు ఉచ్ఛరించి వుంటారు. ఆయన ఇంకోసారి బీజేపీని ఎలా అధికారంలోకి తీసుకురావాలా అని ఆలోచించడం లేదు. ఒక్కో రాష్ట్రం నుండి కాంగ్రెస్‌ను ఎలా వెళ్లగొట్టాలా అని మాత్రమే చూస్తున్నాడు.

అయితే ఇది కాంగ్రెస్‌కు ఓ రకంగా మంచి పరిణామం కూడా! తాను లేదా తన సంస్థ అభివృద్ధి చెందాలని ఏ వ్యక్తి అయినా కృషి చేస్తే దానికి తగ్గ ఫలితాలుంటాయి. తన వృద్ధి కోసం కాకుండా అవతలి వారి పతనం కోసం ఎక్కువ శ్రమ పడితే అది వృధా ప్రయాస కాక తప్పదని చరిత్రే ఋజువు చేస్తుంది. కాంగ్రెస్‌ పతనం కావాలంటే నరేంద్ర మోడీ అందుకు అధికార శక్తియుక్తులన్నింటిని ప్రయోగించాల్సిన అవసరం లేదు. ప్రధానంగా నరేంద్రమోడీ దేశ ప్రజలు మెచ్చేలా సత్ఫలితాలు చూపిస్తే, నోట్ల రద్దు, జిఎస్టీ వంటి బాదుడు కార్యక్రమాలు కాస్తా తగ్గిస్తే కాం గ్రెస్‌ను ఆయన నిర్వీర్యం చేయడం కాదు... దానం తట అదే నిర్వీర్యమవుతుంది. మూడున్నర దశాబ్దాల క్రితం దేశంలో కాంగ్రెస్‌ తప్ప ఇంకేమీ వుండేవి కావు. ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీ శతకోటి లింగాలలో ఒక లింగమైపోయింది. కర్నాటకలో తప్ప ఏ ఒక్క పెద్ద రాష్ట్రం కూడా కాంగ్రెస్‌ చేతిలో లేదు. ఇండియా మ్యాప్‌ మొత్తం కాషాయం విస్తరిస్తోంది. అక్కడక్కడా కొన్ని ప్రాంతీయపార్టీలు గట్టిగా నిలబడ్డం వల్ల బీజేపీ విస్తరణకు ఆటంకం కలుగుతోంది.

దేశంలో బీజేపీ అత్యంత బలీయశక్తిగా తయారైన నేటి రాజకీయ పరిస్థితుల్లో మరి కాంగ్రెస్‌పార్టీ పరిస్థితి ఏంటి? ఆ పార్టీ బ్రతికి బట్టకడుతుందా? పూర్వవైభవం సంతరించుకుంటుందా? ఆ పార్టీకి జవసత్వాలు నింపేదెవరు? ఇలాంటి ప్రశ్నలెన్నో నేడు రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి. కాంగ్రెస్‌కు ఉన్న ఒకే ఒక తురుపుమ్కు రాహుల్‌గాంధీ. సోనియాగాంధీ నాయకత్వం వహించే పరిస్థితి దాటిపోయింది. ఆమె నేతృత్వంలో కాంగ్రెస్‌ రెండుసార్లు అధికారంలోకి రాగలిగింది. యూపిఏ-2లో జరిగిన స్కాముల పాపాలకు 2014 ఎన్నికల్లో దేశ ప్రజలు కాంగ్రెస్‌ను చీదరించుకున్నారు. గత కొన్ని దశాబ్దాలలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కాంగ్రెస్‌ తన గోతిని తానే తీసుకుంటూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో కాంగ్రెస్‌ సెల్ఫ్‌ సూసైడ్‌ను ప్రత్యక్షంగా చూసాం. ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ పునరుజ్జీవం పొందే సూచనలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలోనే కాంగ్రెస్‌ సారధిగా రాహుల్‌గాంధీకి బాధ్యతలు కట్టబెట్టే ప్రయత్నాలు శరవేగంగా జరుగుతున్నాయి. బహుశా గుజరాత్‌ ఎన్నికలలోపే ఆ ముహూర్తం కూడా ఉండొచ్చు. గుజరాత్‌ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు దేశ భవిష్యత్‌ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. గుజరాత్‌లో గెలుపే లక్ష్యంగా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్‌ పోరాడుతున్నాయి. ఇక్కడ బీజేపీ ఓడిపోవడం అంటూ జరిగితే మోడీ చాపక్రిందకు నీళ్ళు చేరడమే అవుతుంది. ఇక్కడ గెలిస్తే కొనఊపిరితో వున్న కాంగ్రెస్‌కు చివరి క్షణంలో శ్వాసను అందించి బ్రతికించినట్లే అవుతుంది. గుజరాత్‌లో బీజేపీ ఓడిపోవడం అంటూ జరిగితే అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీకి డౌన్‌ట్రెండ్‌ మొదలైనట్లే! అదే సమయంలో కాంగ్రెస్‌ పుంజు కోవడానికి అవకాశమిచ్చినట్లే! రాజకీయాలలో ఆత్మహత్యలు తప్ప హత్యలుండవు. ఇలాంటి పరిణామాలే కేంద్రప్రభుత్వంలో చోటు చేసుకుంటున్నాయి. ప్రధానిగా మోడీ దేశ ఆర్ధిక వ్యవస్థను పరుగులు తీయించేంతటి కార్యక్రమాలేవీ చేపట్టలేదు. వాజ్‌పేయి హయాంలో చేపట్టిన స్వర్ణచతుర్భుజి పథకంతోనే దేశంలో ఆర్ధిక వ్యవస్థ ఎంతో ప్రేరణపొందింది. అన్ని రంగాలలోనూ మంచి ఫలితాలు వచ్చాయి. ఈ మూడున్నరేళ్ళలో నరేంద్రమోడీ అలాంటి కార్యక్రమాన్ని ఒక్కటీ చేపట్టలేకపోయాడు, సరికదా నోట్ల రద్దు, జిఎస్టీలతో కొన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అయితే ఆ వ్యతిరేకత ఓట్ల రూపంలోకి ఎంతవరకు మారుతుందన్నదే ప్రశ్న!

పార్టీ నాయకత్వం విషయంలోకి వస్తే నరేంద్ర మోడీ ముందు రాహుల్‌ చాలడం లేదు. మోడీ మాటల మాంత్రికుడు. ప్రపంచ దేశాలు తిరిగాడు. దౌత్య విజయాలు సాధించాడు. అన్నింటికి మించి ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ గాని, ఒక్క కుంభకోణం గాని లేదు. ప్రభుత్వం నిజా యితీగా పనిచేస్తోంది. అయితే జిఎస్టీ, నోట్ల రద్దు పార్టీకి ప్రతికూలంగా మారిన వాతావరణం కనిపి స్తోంది. బీజేపీ వైఫల్యాల ఆధారంగానే ఇక దేశంలో కాంగ్రెస్‌ ఎదగాల్సి వుంటుంది. ఒకప్పుడు దేశంలో కాంగ్రెస్‌ వ్యతిరేక ఓటు మీద ప్రతిపక్ష పార్టీ ఆధారపడి ఉండేది. కాంగ్రెస్‌ను పడగొట్టడానికి దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి కూటమి కట్టేవి. దేశ చరిత్రలో ఇప్పటికీ కేంద్రంలో సింగిల్‌ పార్టీ రూలింగ్‌ ఘనత కాంగ్రెస్‌దే! కాంగ్రెసేతర ప్రభు త్వాలన్నీ కూడా కలగూరగంప లాంటి పార్టీల కలయికతో ఏర్పడిన ప్రభుత్వాలే! దేశంలో ఒకప్పుడు కాంగ్రెస్‌ వున్న స్థానంలో ఇప్పుడు బీజేపీ వుంది. బీజేపీ వ్యతిరేక ఓటు మీదే కాంగ్రెస్‌, ఇతర వ్యతిరేక పార్టీల మనుగడ ఆధారపడి వుంది. గతంలో కాంగ్రెస్‌ వ్యతిరేక ఓట్లన్నీ వివిధ పార్టీల మధ్య చీలేవి. ఇప్పుడు బీజేపీ వ్యతిరేక ఓట్లను ఆయా పార్టీలు చీల్చుకుంటున్నాయి.

ఒకప్పుడు మైనార్టీలు మూకుమ్మడిగా కాంగ్రెస్‌కు ఓట్లేసే వాళ్ళు. ఇప్పుడు దేశంలో లౌకికవాదమని చెప్పుకునే పార్టీలు ఎక్కువయ్యాయి. ఆ పార్టీల మధ్య కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు చీలిపోతూ వచ్చింది. కాంగ్రెస్‌ పతనావస్థకు ఇది కూడా ఒక కారణం.

కాంగ్రెస్‌ను నిలబెట్టాలంటే రాహుల్‌కు ముందు దేశం గురించి, దేశంలోని ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్‌ స్థితిగతుల గురించి తెలిసుండాలి. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకతాటిపైకి తెచ్చే తెలివితేటలుండాలి. బీజేపీ బలమైన శత్రువు... ఆ పార్టీని ఢీ కొట్టాలంటే రాహుల్‌ చాలడు. దేశంలో మరికొంతమంది రాజకీయ యోధులను సమీకరించి రేపటి ఎన్నికల యుద్ధానికి ఆయన సిద్ధం కావాల్సివుంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • దండగ... పండగ...
  పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
 • సినిమానూ వదలని సెగ
  నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
 • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
  2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
 • అజీజ్‌ బ్రదర్స్‌పై కేసు
  నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌కు షాక్‌ తగిలింది. ఆయన పైన ఆయన తమ్ముడు, కార్పొరేటర్‌ జలీల్‌ మీద చెన్నైలో చీటింగ్‌ కేసు నమోదైంది. మేయర్‌ అజీజ్‌కు చెందిన స్టార్‌ ఆగ్రో కంపెనీలో వాటా కోసం తాము ఇచ్చిన 42కోట్ల…
 • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
  మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter