Friday, 01 December 2017 12:57

మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...

Written by 
Rate this item
(0 votes)

narayanaనెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును ఆశిస్తున్న నాయకులందరూ పైకి నారాయణ వస్తే తిరుగులేదని చెబుతున్నా లోపల మాత్రం ఆయన రాకుంటే బాగుండనుకుంటున్నారు.

2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి నగర ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరి స్తున్నాడు. వచ్చే ఎన్నికలలోనూ ఆయన సీటుకు పోటీలో ఉంటాడనడంలో డౌట్‌ లేదు. 2014 ఎన్నికలలోనే నెల్లూరు సిటీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించిన 'నుడా' ఛైర్మెన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కూడా మళ్ళీ సీటు కోసం పోరాడకుండా ఉండడు. తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుండి మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ నెల్లూరు నుండి నేను పోటీ చేస్తానంటూ పాటపాడుతూనే వున్నాడు. ఇక నగరంలో సొంత వర్గం కలిగిన ఆనం కుటుంబం నుండి ఒకరు ఈసారి ఈ సీటును ఆశించ డంలో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. అయితే ప్రతి ఎన్నికలలోనూ జిల్లాలో ఒక సీటును మహిళలకు ఇస్తున్నారు. 2014 ఎన్నికల్లో గూడూరు సీటు నుండి మహిళా అభ్యర్థిగా బి.జ్యోత్స్నలతను నిలబెట్టారు. ఈసారి అక్కడ జంపింగ్‌ ఎమ్మెల్యే పాశం సునీల్‌కే సీటు ఇవ్వొచ్చు. కాబట్టి నెల్లూరు నగరంలో మహిళకు అవకాశం కల్పించవచ్చనే దిశగా మాజీమున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ టి.అనూరాధ కూడా రంగంలో వున్నట్లు తెలుస్తోంది. ఎవరికివాళ్ళు మంత్రి నారాయణను క్రాస్‌ చేసి కాకుండా ఆయన అండదండలతోనే సీటు సాధించాలనుకుంటున్నారు.

Read 430 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
    ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
  • వేగమందుకున్న ప్రయాణం
    సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
  • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
    నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
  • ఎవరెవరెక్కడ?
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter