07 December 2017 Written by 

కులం మంటల్లో కాలేదెవరు?

kulamఒక వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో వైఫల్యం... ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు... ఇట్లాంటి ప్రయత్నాల వల్ల తాత్కలిక ఉపశమనం కలగవచ్చేమోగాని, చరిత్రలో శాశ్వత దోషులుగా, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఒక సమస్య నుండి మరో సమస్యపైకి ప్రజల దృష్టిని మళ్లించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాస్టర్‌ డిగ్రీ చేసి వున్నాడు. గోదావరి పుష్కరాల మృతుల సంఘటనను డైవర్ట్‌ చేయడానికి ఒక ఇష్యూ, అమరావతి రాజధాని నిర్మాణంలోని లోపాలను కప్పిపుచ్చడానికి ఇంకో అంశం... జేసీ బస్సు ప్రమాద సంఘటనను డైవర్ట్‌ చేయడానికి ఇంకో సబ్జెక్ట్‌... కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పినప్పుడు ప్రజల దృష్టిని దానిపై నుండి తప్పించడానికి మరో సీన్‌... ఇలా తన పాలనలోని ప్రతి వైఫల్యాన్ని కూడా ప్రజల కళ్ళు పడకుండా ఏదో ఒక అంశాన్ని తెరమీదకు తెచ్చి మళ్లిస్తున్నాడు. అదృష్టం కొద్ది రాష్ట్రం లోని పచ్చమీడియా సంస్థలు ఆయనకు పూర్తిగా సహకరిస్తున్నాయి.

అలాంటి డైవర్షనే ఇప్పుడు ఇంకోటి తెరమీదకొచ్చింది. కేంద్రం బాధ్యతగా వున్న పోలవరం ప్రాజెక్ట్‌ను నేను కడతానంటూ తెచ్చుకున్నాడు. కేంద్రం కూడా వద్దనకుండా అప్పగించింది. ఈయనేమో ధారాళంగా అంచనాలు పెంచుకుంటూ పోయాడు. వాళ్లేమో 2014 అంచనా వ్యయాన్ని దాటి రామంటూ, ఇప్పటివరకు అయిన ఖర్చులకు లెక్కలడిగారు. అక్కడ కరెక్ట్‌గా లెక్కలు తీస్తే లెక్కలేనన్ని బొక్కలు బయటపడతాయి. పోలవరం లెక్కల విషయంలో కేంద్రం గట్టిగా ఉండేసరికి, ఈయన అడిగినన్ని నిధులు ఇయ్యకపోతుండే సరికి పోలవరం ప్రాజెక్ట్‌ను నేను కట్టలేనని, ఇప్పుడే కేంద్రానికి వదిలేస్తానని అసెంబ్లీలో ప్రకటించాడు. ఈ మూడున్నరేళ్ళ చంద్రబాబు పాలనలో ఇదో పెద్ద వైఫల్యం. 2018కల్లా పోలవరాన్ని పూర్తి చేసి అన్ని జిల్లాలకు నీళ్లిస్తామని గతంలో గంభీరంగా ప్రకట నలు చేసారు. జగన్‌ను పత్రికలలో నోట్‌ చేసుకోమని చెప్పారు. 2018కి కాదు కదా ఏ సంవత్సరంలో పూర్తవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. పోలవరం వైఫల్యం చంద్రబాబును తల దించుకునేలా చేసింది. దీని నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి ఆయన వదిలిన మరో బ్రహ్మాస్త్రం కాపు రిజర్వేషన్లు. కాపు రిజర్వేషన్లపై అధ్య యనం కోసం ఏర్పాటు చేసిన జస్టిస్‌ మంజునాథ్‌ కమిషన్‌ నివేదిక ఇవ్వకుం డానే కాపులను బీసీలలో చేర్చి 5శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో తీర్మానం చేయించారు. ఈ తీర్మానాన్ని ఆమోదించ మంటూ కేంద్రానికి పంపారు.

2014 ఎన్నికల్లో కాపు రిజర్వేషన్‌ల సబ్జెక్టే లేదు. అప్పుడు రాష్ట్రమంతా విభజన కాక మీద వుండింది. కాపులకు రిజర్వేషన్ల ఆలోచన లేదు. కాని, అధికారాన్ని ఎలా గైనా చేజిక్కించుకోవాలన్న యావతో చంద్ర బాబే కాపు రిజర్వేషన్‌ల తుట్టెను కలబె ట్టాడు. తాను అధికారంలోకి వస్తే కాపు లను బీసీలలో చేరుస్తానన్నాడు. ఆ ఎన్ని కల్లో కాపులు చంద్రబాబుకే జై కొట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది. కాపు రిజర్వేషన్ల అంశం తెరమీదకొచ్చింది. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కాపులకు రిజర్వేషన్‌లు కల్పించాలంటూ చేపట్టిన ఉద్యమం వేడెక్కింది. ఈ దశలో కాపులను చల్లార్చేందుకు చంద్రబాబు మంజునాథ కమిషన్‌ను ఏర్పాటు చేశాడు. ఆ కమిటీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి వివరాలు సేకరించింది.

అయితే రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్‌ మంజునాథ్‌ మొన్నటివరకు నివేదిక ఇవ్వ లేదు. కమిటి ఛైర్మెన్‌ హోదాలో జస్టిస్‌ మంజునాథ్‌ రిపోర్ట్‌ ఇవ్వాలి. కాని, పోల వరం సబ్జెక్ట్‌ను బలహీనపరచడానికి చంద్రబాబు అప్పటికప్పుడు మంజునాథ్‌ రిపోర్ట్‌తో పనిలేకుండానే కాపు రిజర్వేషన్ల పై తీర్మానం చేయించాడు. తాంబూళాలు ఇచ్చేసాను తన్నుకుచావండంటూ కాపులు - బీసీల మధ్య మంట వెలిగించాడు.

అసెంబ్లీ తీర్మానంతో ప్రస్తుతానికి కాపులు కూల్‌ అయ్యారు. కాని, 1983 నుండి తెలుగుదేశం పార్టీకి పునాదులుగా నిలబడ్డ బలహీనవర్గాల ప్రజలే రగిలిపో తున్నారు. నమ్మిన పాపానికి చంద్రబాబు తమను మోసం చేసాడని ఆగ్రహిస్తున్నారు. బీసీలకు అన్యాయం జరగదని చంద్రబాబు చెబుతున్నా, అక్కడ సీన్‌ మాత్రం వేరే విధంగా వుండబోతోంది. బీసీల రిజర్వే షన్‌లతో సంబంధం లేకుండా కాపులకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పిస్తామని తెలుగుదేశం నాయకులు నమ్మబలుకుతు న్నారు. ఇది సాధ్యమైతే అటు బీసీలు, ఇటు కాపులు చల్లబడతారు. రాజకీయంగా చంద్రబాబుకు ప్రయోజనమవుతుంది. ఎన్ని రిజర్వేషన్‌లు పెంచినా అగ్రవర్ణాల పేదలు చేతలుడిగి చూస్తుండి పోవడమే తప్ప ఏమీ చేయలేరు కదా!

కాని, ఇది సాధ్యమేనా? కాపుల రిజ ర్వేషన్‌లను ఏ విధంగా అమలు చేస్తారు? మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించ కూడదని సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికే గట్టిగా కట్టుబడి వుంది. గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీకి పటేళ్ళ నుండి ముప్పు పొంచి వుంది. మాకూ రిజర్వేషన్లు కావాలంటూ అక్కడ పటేళ్లు ఉద్యమం చేయడం తెలి సిందే! మోడీ తలచుకుంటే ఎన్నికల దృష్టితో ఆలోచించి వారికి రిజర్వేషన్‌లు అమలు చేసి ఉండొచ్చు. కేంద్రంలో ఆమోదం కూడా వారికి పెద్ద పని కాదు. రిజర్వేషన్‌లు 50శాతంకు మించకూడదనే సుప్రీం మార్గదర్శకాలను కేంద్రం పాటి స్తుంది. తమ సొంత రాష్ట్రంలోనే 50శాతం రిజర్వేషన్‌ల పరిధిని దాటని మోడీ మరి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని అంగీకరిస్తారా? కాపులకు రిజర్వేషన్‌లు కోరుతూ ఏపి నుండి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కోరుతూ తెలంగాణ నుండి కేంద్రానికి తీర్మానాలు వెళ్ళాయి. కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు తీర్మానాలను ఆమోదించదు. కేంద్రం తిరస్కరిస్తే, నేను రిజర్వేషన్లు ఇవ్వాలనే చూసాను, కేంద్రం కనికరించలేదని ఆ తప్పును కేంద్రంపైకి నెట్టొచ్చనే ఆలోచన కూడా చంద్రబాబులో వుంది.

అయితే ఈసారి జనం అంత అమా యకంగా లేరు. కాపు రిజర్వేషన్‌లతో ఆయన పార్టీకి దన్నుగా వున్న బీసీలను కొంత వరకు దూరం చేసుకున్నాడు. రేపు కాపు రిజర్వేషన్‌ల తీర్మానాన్ని కేంద్రం తిప్పి పంపినా బీసీలలో ఇప్పుడొచ్చిన కసి సమసిపోదు. ఇక కాపు రిజర్వేషన్‌ల తీర్మానాన్ని కేంద్రం తిప్పి పంపితే... రాష్ట్ర వ్యాప్తంగా కాపులు తెలుగుదేశంకు పూర్తిగా దూరమైనట్లే! మొత్తానికి రిజర్వేషన్ల పేరుతో తాను రాజేసిన కులం మంటలే చంద్రబాబుకు సెగ పుట్టించనున్నాయన్నది భవిష్యత్‌ నిజం!Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…

Newsletter