Print this page
07 December 2017 Written by 

ముందే పంచాయితి!

шаблоны RocketTheme
Форум вебмастеров

elections2014 ఎన్నికల్లో వైకాపా ఓటమికి ప్రధాన కారణాలు... చంద్రబాబు ఋణ మాఫీ, టీడీపీకి పవన్‌ కళ్యాణ్‌ మద్దతు పలకడం, నరేంద్రమోడీ ఆకర్షణ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలంతా జగన్‌ కాదంటే టీడీపీలోకి వెళ్లడం, మతపరమైన ముద్రవల్ల బ్రాహ్మణులు, వైశ్యులు పూర్తిగా వైసిపిని వ్యతిరేకించడం, పచ్చ మీడియా వ్యతిరేక ప్రచారం, ఆర్ధికంగా టీడీపీ పైచేయిలో ఉండడం, ఎల్లోమీడియా విషప్రచారం వల్ల రాజులు దూరం కావడం, విభజన నేపథ్యంలో అనుభవజ్ఞుడైన చంద్రబాబు సీఎం అయితేనే సక్రమంగా జీతాలన్నా వస్తాయని ఉద్యోగులు భావించడం... కర్ణుడిచావుకు సవాలక్ష కారణాలన్నట్లు... వైకాపా ఓటమికి ఇన్ని కారణాలున్నాయి. ఇవే కాదు, వైకాపా ఓటమిలో టీడీపీ గెలుపులో న్యాయస్థానంకు సైతం పరోక్ష పాత్ర వుంది.

అంతకుముందున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా మీద వాయిదాలేసుకుంటూ వచ్చింది. 2014లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక ఎన్నికలకు పోవాలనే పరిస్థితి ఉండింది. అయితే హైకోర్టు అందుకు ఒప్పుకోలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే స్థానిక ఎన్నికలు జరపాలని ఆదేశించింది. దీంతో పంచాయితీలు, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ల ఎన్నికలను అప్పటికప్పుడు హడావిడిగా జరిపారు. ఈ స్థానిక ఎన్ని కలు ముందుగా జరపడం వైకాపాకు తీరని నష్టం కలిగించింది. స్థానిక ఎన్నికలు జరక్కముందు గ్రామాలలో ఆ వర్గం ఈ వర్గం అని లేకుండా ప్రజలు సాధారణ స్థితిలో జగన్‌కు సానుభూతి పరులుగా వున్నారు. ఎప్పుడైతే స్థానిక ఎన్నికలు జరి గాయో అప్పుడు గ్రామాలలో గ్రూపులు సెట్‌ అయిపోయాయి. గ్రామాలలో పం తాలు, పట్టింపులు ఎక్కువ. ఒక నాయ కుడు ఒక పార్టీకి మద్దతు తెలిపితే ప్రత్యర్థి నాయకుడు అవతలిపార్టీ వైపు పోవడం సర్వసాధారణం. దీంతో వై.యస్‌.జగన్‌ సానుభూతిపరులు గ్రామాలలో వర్గ రాజకీయాల కారణంగా అసెంబ్లీ ఎన్ని కల్లోనూ వాళ్ళు తెలుగుదేశం వైపే వుండి పోయారు. ముందుగా స్థానిక ఎన్నికల కారణంగా జగన్‌కు ఓటేయాలన్న ప్రజ లలోని ఉత్సాహం అక్కడ కొంతవరకు తీరిపోయింది. అంత ఊపు అసెంబ్లీ ఎన్ని కలలో లేకుండా పోయింది.

అప్పుడంటే కోర్టు ఆదేశాల వల్ల అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్థానిక ఎన్ని కలను జరపాల్సి వచ్చింది. ఈసారి ఒక సారి స్థానిక ఎన్నికలను వాయిదా వేసినా అసెంబ్లీ ఎన్నికల తర్వాతే జరపొచ్చు. అప్పుడైతే ఏ సమస్యా ఉండదు. అధికారం లోకి ఏ పార్టీ వస్తే స్థానిక ఎన్నికల్లోనూ ఆ పార్టీ మద్దతుదారులే ఎక్కువుగా గెలు స్తారు. అభ్యర్థులకు పెద్దగా డబ్బు ఖర్చు కూడా వుండదు. ఎక్కువ స్థానాలు ఏక గ్రీవమయ్యే అవకాశం కూడా వుంది.

కాని, చంద్రబాబు స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలనుకోవడం లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే జరపాలను కుంటున్నాడు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తిగా ఎలక్షన్‌ కమిషన్‌ కంట్రోల్‌లో జరుగు తాయి. స్థానిక ఎన్నికలైతే అధికారాన్ని

ఉపయోగించుకోవడానికి అవకాశముం టుంది. అధికారముంది, కావాల్సినంత డబ్బుంది కాబట్టి మెజార్టీ స్థానిక సంస్థలను చేతిలోకి తీసుకోవచ్చు. స్థానిక సంస్థల్లో పైచేయి సాధిస్తే, వైకాపా కేడర్‌లో నిరు త్సాహం వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీయే గెలుస్తుందన్న సంకేతాలు పం పొచ్చు. వైసిపికి బలమైన అభ్యర్థులు లేకుండా చేసి గెలుపును సులువు చేసుకో వచ్చు. ఒకవేళ స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తే అసెంబ్లీ ఎన్నికలనాటికి దానిని సరిదిద్దుకునే మార్గాలు వెదకొచ్చు. స్థానికసంస్థల ఎన్నికల ద్వారా రెండు విధాలుగా తనకే ప్రయోజనం ఉండడంతో చంద్రబాబు అసెంబ్లీకంటే ముందే స్థానిక ఎన్నికలకు ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.