07 December 2017 Written by 

08-12-2017 రాశిఫలాలు

rasi 08

1Ariesమేషం

వ్యాపారవర్గాలకు ఆర్ధిక ఇబ్బందులతో పాటు, ప్రభుత్వ పరంగా ఇబ్బందులుంటాయి. వృత్తి జీవనంలో సామాన్య ఆదాయముంటుంది. అనవసర విషయాలలో తల దూర్చవద్దు. బాధ్యతలను నిర్వహిస్తూ ఆంతరంగిక విషయాలను బయట పెట్టవద్దు. ఉద్యోగులు విధి నిర్వ హణ యందు మెలకువగా మెలగవలసి ఉంటుంది. సమస్యలను, ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొంటారు.

 

2Taurusవృషభం

ఆర్ధికంగా షుమారుగా ఉంటుంది. వృత్తి వ్యాపారా లలో రాబడి తగ్గుతుంది. త్వరలో శుభవార్త వింటారు. బంధువర్గంతో సఖ్యంగా మెలగండి. రావలసిన బాకీలు నిలబడిపోతాయి. అనుకున్న పనులు నిదానంగా జరుగు తాయి. దూరప్రయాణ ఖర్చులుంటాయి. సభలు సమా వేశాలు, దైవ కార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగ వర్గా లకు గుర్తింపు గౌరవాలు బాగుంటాయి.

 

3Geminiమిధునం

ముఖ్యపనులు చేసేవారు పెద్దల సలహాలు తీసికొని చేయండి. పనులకు ఆటంకాలు వచ్చే అవకాశం ఉన్నది. వ్యాపారవర్గాలకు మంచి అవకాశాలు చేజారిపో వచ్చును. మరియు ఆదాయం తగ్గుతుంది. వృత్తి జీవనం కలవారి స్థితి సంతృప్తికరం. బంధువర్గంతో పేచీలు కలుగవచ్చును. శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత ఉండదు. విద్యావృద్ధి బాగుంటుంది.

 

4Cancerకర్కాటకం

వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా జరుగుతాయి. ఆర్ధికాభివృద్ధికి మీ కృషి సఫలం కాగలదు. ఉద్యోగు లకు విధి నిర్వహణ సాఫీగా సాగుతుంది. విద్యార్థుల కృషి అభివృద్ధికరంగా ఉంటుంది. పనులందు అనుకూ లత బాగుండినా టెన్షన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో వ్యక్తులకు అనారోగ్య బాధలుంటాయి. ఎదుటివారి అభి ప్రాయాలు, సలహాలు పొందితే లాభపడతారు.

 

5Leoసింహం

ఈ వారం ఖర్చులు కొంత ఎక్కువగా ఉంటాయి. వృత్తి జీవనము కలవారికి సామాన్య ఆదాయం, వ్యాపార వర్గాలకు అభివృద్ధి ఆదాయం బాగుంటుంది. అనుకున్న పనులను మనోధైర్యంతో కొనసాగిస్తారు. సోదరవర్గానికి ప్రయోజనాలుంటాయి. అనుకోని ప్రయాణాలు ఏర్పడ తాయి. కొత్త పరిచయాలు కలిగి పనులు సాఫీగా జరగ డానికి తోడ్పడతాయి. ఆరోగ్యము ఫరవాలేదు.

 

6Virgoకన్య

ముఖ్యమైన పనులు, బాధ్యతలను పూర్తి చేస్తారు. ప్రభుత్వ అనుమతులు, రావలసిన బాకీలు లభిస్తాయి. కార్య సామర్ధ్యంతో ఉద్యోగులు అధికారుల ఆదరాభి మానాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరం. ఆదాయవృద్ధి ఫరవాలేదు. ఉద్యోగ ప్రయత్నాలలో అను కూలత ఉంటుంది. చదువులో మంచి ప్రగతిని చూపు తారు. చిన్న వస్తు నష్టం జరగవచ్చును.

 

7Libraతుల

ఉద్యోగులు తమ అధికారులతోను పబ్లిక్‌తోను జాగ్ర త్తగా మెలగండి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధికి ప్రయత్నాలు బాగుండి ఆదాయము పెరుగుతుంది. చేపట్టిన పనులు జాగ్రత్తగా నెరవేర్చగలరు. మీ సలహాలు సూచనలు సమావేశాలలో ఆమోదింపబడగలవు. ఒకటి రెండు అనవసర ఖర్చులుంటాయి. వ్యాపార భాగస్వామ్య అవకాశాలు, పెట్టుబడులకు అవకాశాలుంటాయి.

 

8Scorpioవృశ్చికం

కుటుంబ సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు ఎదురు కాగలవు. వ్యాపార వర్గాలకు సామాన్య ఆదాయం, వృత్తి జీవనం కలవారికి తృప్తికరంగా ఆదాయముంటుంది. అనుకోని ఖర్చులు పైనబడగలవు. కుటుంబంలో అను కూలత తక్కువ. రావలసిన బాకీలు నిలబడిపోతాయి. శుభకార్య నిర్వహణ ప్రయత్నాలలో ఉంటారు. నిర్మా ణాలు, కాంట్రాక్టు పనులు నిదానంగా జరుగుతాయి.

9Sagittariusధనుస్సు

కొన్ని పనులందు అనుకూలత, కొన్ని పనులందు ప్రతికూల స్థితులుంటాయి. టెన్షన్‌ ఎక్కువగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసికొనే అవకాశం ఉన్నది, కాబట్టి జాగ్రత్తపడండి. ధనం సమయానికి లభించక ఇబ్బందిపడే అవకాశం ఉన్నది. ఉద్యోగులు పబ్లిక్‌తోను అధికారవర్గంతోనూ జాగ్రత్తగా ఉండండి. హామీలు, అప్పులు ఇవ్వవద్దు. విద్యాప్రగతి బాగుంటుంది.

 

10Capricornమకరం

ధన లాభం, వ్యవహారాలందు విజయం పొందు తారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉండి ఆదాయం పెరుగుతుంది. కొత్త పెట్టుబడులకు అవకాశాలు లభి స్తాయి. స్థిరాస్తులపై ఆదాయం ఉంటుంది. అయితే పనులందు టెన్షన్‌గా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు, నిర్మాణదారులకు ప్రభుత్వ అనుమతులు, ఋణాలు లభిస్తాయి. విద్యావృద్ధి బాగుంటుంది.

 

11Aquariusకుంభం

ఆకర్షణీయ పథకాలు ప్రవేశపెట్టి వ్యాపారాలు వృద్ధి చేసికొంటారు. వృత్తి వ్యాపారాలలో ఆదాయం పెరుగు తుంది. ఆర్ధిక లావాదేవీలు అనుకూలిస్తాయి. రావలసిన బాకీలు కొంత లభిస్తాయి. చెల్లింపులు సకాలంలో చేస్తారు. విలువైన వస్తువులు సమకూరుతాయి. అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి. ఉద్యోగులకు, అధికారులకు గుర్తింపు గౌరవాలు బాగుంటాయి.

 

12Piscesమీనం

ముఖ్యమైన పనులను జాగ్రత్తగా నిర్వహించండి. లేకపోతే సమస్యలు ఏర్పడవచ్చును. పలుకుబడి కొరకు గాని, పరువు కొరకుగాని డబ్బు ఖర్చు అవుతుంది. దూర ప్రయాణాలుంటాయి. బంధుమిత్రులను కలుసుకొంటారు. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత బాగుంది. ఆటం కాలను ధైర్యంతో ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాలందు ఆదాయం బాగుంటుంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
  నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
 • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
  2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
 • ప్రాణాలను మింగుతున్న చెరువులు
  అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
 • పోలవరం... ఇక కలవరం
  ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
 • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
  మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter