15 December 2017 Written by 

సినిమా కాదు... సీరియల్‌ !

assemblyబాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్నకు బాహుబలి-2లో సమాధానం లభించింది. చంద్రబాబు అమరావతి రాజధాని పేరుతో ఏం చేస్తున్నాడన్నదానికి ఈ దశాబ్దంలో సమాధానం లభించేటట్లు లేదు. చైనా-భారత్‌ల మధ్యం డోక్లాం, ఇజ్రాయిల్‌-పాలస్తీనాల మధ్య జెరూసలేం సమస్యలకు పరిష్కారం లభించినా కూడా అమరావతి అనే జడపదార్ధం ప్రజలకు అర్ధమయ్యేటట్లు లేదు. అసలు లేని నగరం పేరుతో ఇన్ని డ్రామాలు సృష్టించి, ఇన్ని దేశాలు తిరిగి, ఇన్ని కోట్లు తగలేయడం బహుశా చంద్రబాబుకు ప్రత్యేకంగా తెలి సిన విద్యేననుకోవాలి.

ఈ టీవీ, మా టీవీ, జెమిని టీవీలలో సీరియల్స్‌ వస్తుంటాయి. ఏళ్ల తరబడి సాగుతూనే వుంటాయి. అక్కడ సబ్జెక్ట్‌ ఏమీ ఉండదు. అంతా జీడిపాకంలాగా సాగతీయడమే! ఆ సీరియల్స్‌లో వుండే స్టోరీనే సినిమాగా మలిస్తే రెండు గంటలు... అది కూడా బోనస్‌గా అయిదారు పాటలు పెట్టుకోవచ్చు. అమరావతి రాజధానిని కూడా సినిమా లెవల్లో ఫినిష్‌ చేసి వుండొచ్చు. రాజధాని కట్టాలనుకుంటే అయిదారు వేల ఎకరాల భూమి సేక రించడం, రైతులకు దానికి తగ్గ పరిహారం చెల్లించడం, ప్రభుత్వ పరిపాలనకు అవసరమైన అసెంబ్లీ, సచివాలయం, మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, ఉద్యోగుల కాలనీలు, వారికి అవసరమైన మౌలిక వసతులు... ఇంత వరకు తీసుకుని వుంటే ఇదివరకే రాజధాని రూపం ఓ కొలిక్కి వచ్చి ఉండేది. కాని, చంద్రబాబు అమరావతిని సినిమాగా క్లోజ్‌ చేయాలనుకోలేదు. 'మొగలిరేకులు' సీరియల్‌ లాగా సాగదీస్తున్నాడు. సీరియల్‌ మొదలుకావడమే అందరికీ తెలుసు. ఎప్పుడు ఎండ్‌ అవుతుందో ఎవరికీ తెలియదు. సింగపూర్‌ లాంటి రాజధానితో మొదలైంది అమరావతి సీరియల్‌. ఆ తర్వాత బీజింగ్‌ అని, కొలంబో అని, టోక్యో అని, మిలాన్‌, మాస్కో, వాషింగ్టన్‌, కౌలాలంపూర్‌... ఇలా అన్ని దేశాల ప్రధాన నగరాలను చుట్టేసింది. సింగపూర్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశస్థులు ఇచ్చిన రాజధాని డిజైన్‌లు అన్నీ మూలనపడ్డాయి. చివరకు లండన్‌కు చెందిన నార్మన్‌ పోస్టర్‌ చేతికి రాజధాని డిజైన్‌ వెళ్ళింది. మొదట్లో వాళ్ళు గీసిన డిజైన్‌లు కూడా చంద్రబాబుకు నచ్చలేదు. వాళ్ళకు సలహాలిచ్చేందుకు బాహుబలి సినిమా డైరెక్టర్‌ రాజమౌళిని తీసుకెళ్లాడు. ఎట్టకేలకు నార్మన్‌పోస్టర్‌ సంస్థ రెండు డిజైన్‌లకు తుది రూపకల్పన చేసి ఇచ్చింది. దర్శకుడు రాజమౌళి సూచనలు, సలహాలను పక్కనపెట్టి ఆ సంస్థ ఈ డిజైన్‌లను రూపొందించింది. డైమండ్‌ ఆకారంలో ఒకటి, టవర్‌ ఆకారంలో ఒకటి! టవర్‌ ఆకారం డిజైన్‌ను 70మీటర్ల ఎత్తుతో, 70 అంతస్థులతో రూపొందించారు. ఈ టవర్‌లో క్రింద అసెంబ్లీ వుంటుందట, టవర్‌ పైకి పర్యాటకులను పంపిస్తారట! ఇది అసెంబ్లీ భవనాన్ని కడుతున్నట్లు, రాజధాని నిర్మాణం చేస్తున్నట్లుగా లేదు, హాయ్‌ లాండ్‌, వండర్‌వరల్డ్‌, కోరల్‌ ఐలాండ్‌ వంటి పర్యాటక వ్యాపార కేంద్రాలను పెడుతున్న ట్లుగా వుంది. చంద్రబాబు విధానాలు పరిపాలన కంటే కూడా ప్రజలను ఆకర్షించేలా టూరిస్ట్‌ స్పాట్‌లను అభివృద్ధి చేయడానికే ప్రాధాన్యతనిస్తున్నట్లుగా వుంది. అమరావతికి ఇంతవరకు నాలుగుసార్లు శంకుస్థాపనలు చేశారు. వేలకోట్లు ఖర్చు పెట్టి తాత్కాలికంగా వర్షం వస్తే ఉరిసే భవనాలు కట్టారు. రాజధాని పేరుతో వేలకోట్లు తగలేస్తున్నారు. మళ్ళీ దీనిమీద రాజమౌళి చేత 'అమరావతి' సినిమా తీయిస్తారట. ఇది సినిమా కాదు... ఇప్పటివరకు 'అమరావతి రాజధాని' పేరుతో జరిగిన కథనంతా సీరియల్‌గా తీస్తే అయిదారేళ్లకు సరిపడా ఎపిసోడ్‌లను టీవీలలో వేసుకోవచ్చు. అమరావతి సినిమా కంటే సీరియల్‌ బెటర్‌... ఆలోచించండి.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • రెండు నెలల్లో... ట్రెండ్‌ మారింది
  రాజకీయాలలో పరిస్థితులు తారుమారు కావడానికి ఎంతో కాలం పట్టదు. నాలుగేళ్ళ పదినెలలు సమర్ధవం తంగా పని చేసిన ఒక ప్రభుత్వం ఒక చిన్న తప్పు చేస్తే ఒక్క నెలలోనే గబ్బు పట్టొచ్చు. దాని మూలంగానే ఎన్నికల్లో ఓడిపోవచ్చు. నాలుగేళ్ళ పది నెలల…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
  ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…

Newsletter