15 December 2017 Written by 

పవన్‌కు అంత సీనెందుకు?

pawanరాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు ఎవరికీ అంతుచిక్కని చిక్కుముడి... పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌. సుడిగాలి లాంటోడు. వస్తాడు... క్షణాలలో విధ్వంసం సృష్టిస్తుంటాడు... పోతుంటాడు. గత వారంరోజుల్లో ఇదే జరిగింది. ఎందుకొచ్చాడో, ఎందుకు మాట్లాడాడో, ఎందుకు పోయాడో తెలియనంత వేగంగా రావడం, మాట్లాడడం, పోవడం జరిగాయి.

రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకైనా, రాజకీయ పార్టీలు పెట్టేవాళ్ళకైనా ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినా, చిరంజీవి పార్టీ పెట్టినా, జయప్రకాశ్‌ నారాయణ పార్టీ పెట్టినా, జగన్‌ పార్టీ పెట్టినా అందరి లక్ష్యం అధికారమే! టైంపాస్‌ కోసమో, జీవనోపాధి కోసమో ఎవరూ పార్టీ పెట్టరు. ప్రతి పార్టీ స్థాపన వెనుక ఒక సిద్ధాంతం, అధికారమనే లక్ష్యం ఉంటాయి.

కాని, రాష్ట్ర రాజకీయాలలో ఒక సిద్ధాంతం, ఒక లక్ష్యం అన్నవి లేకుండా ఏర్పడ్డ పార్టీ జనసేన. మెగాస్టార్‌ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టాక 2009 ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులను పెట్టారు. 2014లో పవన్‌కళ్యాణ్‌ జనసేన పార్టీని పెట్టాడు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలతో పొత్తు పెట్టుకున్నాడు. జనసేన తరపున ఒక్క స్థానంలోనూ అభ్యర్థిని నిలబెట్టలేదు. ఈ మాత్రం దానికి పార్టీ పెట్టడమెందుకు? నేరుగా ఆ రెండు పార్టీలకు మద్దతు పలికుంటే పోయేది. పార్టీని ఆవిష్కరించాక కూడా ఎక్కడా పోటీ చేయని పార్టీగా జనసేన రాష్ట్ర రాజకీయ చరిత్ర రికార్డుల్లోకి ఎక్కింది.

సరే, ఆ ఎన్నికల్లో పోటీ అంటే చేయ లేదు. కాని, ఆ తర్వాతన్నా ఒక సిద్ధాంతం మీద, ఒక ఆశయం మీద నిలబడ్డాడా అంటే అదీ లేదు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుంటే కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో టీడీపీని ప్రశ్నిస్తానని ఆరోజు ఘనంగా చెప్పాడు. ఆయన మద్దతు వల్లే రాష్ట్రంలో టీడీపీ అధికారం లోకి రాగలిగింది.

అధికారంలోకి వచ్చాక బీజేపీ ప్రభుత్వం చేసిన మొట్టమొదటి పని ప్రత్యేకహోదాను తుంగలో తొక్కడం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిది కూడా తప్పుంది. ప్రత్యేకహోదా కోసం ముఖ్య మంత్రి చంద్రబాబు పట్టుబట్టలేదు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలని సరిపెట్టుకున్నాడు. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రంపై విమర్శలు చేసిన పవన్‌కళ్యాణ్‌, అదే సమయంలో 'ఓటు-నోటు' కేసుకు భయ పడి ప్రత్యేకహోదాపై రాజీపడ్డ చంద్రబాబు వైఖరిని మాత్రం ఆయన ఖండించలేక పోయాడు. ప్రధానంగా రాష్ట్ర రాజకీ యాల్లో పవన్‌కళ్యాణ్‌ ప్రశ్నించాల్సింది, విమర్శించాల్సింది ప్రతిపక్షాన్ని కాదు. ప్రభుత్వంలో వున్న అధికారపక్షాన్ని. తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైంది. ఏ వర్గాల ప్రజలు సంతో షంగా లేరు. పవన్‌ ప్రశ్నించడానికి బొచ్చె బోలెడు అంశాలున్నాయి. మూడు పంటలు పండే భూములను లాక్కుని రాజధాని పేరుతో నాటకాలు, పుష్కరాల పేరుతో వేలకోట్ల నిధుల దుర్వినియోగం, పుష్కరఘాట్‌లలో తొక్కిసలాట, మహిళా అధికారి వనజాక్షిని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కొట్టడం, విద్యాసంస్థల్లో విద్యా ర్థుల ఆత్మహత్యలు, ఇసుక మాఫియా, పరిశ్రమల పేరుతో పచ్చటి పొలాల ఆక్ర మణ, చివరకు పోలవరంపై చేతులెత్తే యడం... పవన్‌ తాను గెలిపించిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఎన్నో అంశాలున్నాయి. కాని ఏ ఒక్కవాటి జోలికీ ఆయన పోడు.

కేవలం చంద్రబాబు రాజకీయ రక్షణ కోసమే ఆయన ప్రజలలోకి వస్తున్నాడు. చంద్రబాబు సమస్యల్లో పడ్డప్పుడు, చంద్ర బాబు ఆత్మరక్షణలో పడ్డప్పుడు మాత్రమే పవన్‌కళ్యాణ్‌ తెరపైకి వస్తుంటాడు. రాష్ట్రంలో వైకాపా అధినేత జగన్‌ పాద యాత్ర ప్రభంజనం సృష్టిస్తున్న తరుణంలో మళ్ళీ ఒకసారి రాష్ట్ర రాజకీయ తెరపైకి వచ్చాడు. విశాఖ, రాజమండ్రి, ఒంగోలు లలో సదస్సులు పెట్టాడు. చంద్రబాబును ఒక్క ప్రశ్న వేయలేదు. ఏ ఒక్క ప్రభుత్వ వైఫల్యాన్నీ వేలెత్తి చూపలేదు సరికదా, సీఎం కొడుకు సీఎం కావాలనుకోవడం తప్పు... జగన్‌ పై అవినీతి కేసులున్నందు వల్లే నేను మద్దతునివ్వలేదు... అంటూ మాట్లాడాడు. దీనిపై సోషల్‌ మీడియాలో అయితే పవన్‌ను దుమ్ము దులిపి వదిలారు. అన్న యాక్టర్‌ అయితే తమ్ముడు యాక్టర్‌ కావచ్చా? చిరంజీవి లేకుంటే మీరంతా ఎక్కడనుండి వచ్చేవాళ్ళు అంటూ కడిగి పెట్టారు. జగన్‌ అవినీతి పరుడని ఏ కోర్టు చెప్పింది... నిందితుడిని దోషిగా నిర్ధారించ డానికి నువ్వెవరు? ఓటు-నోటు కేసులో పబ్లిక్‌గా దొరికిన చంద్రబాబు చంక నాకుతూ జగన్‌ను వేలెత్తి చూపే అర్హత నీకుందా? అంటూ ఎడాపెడా వాయిం చారు. దాదాపు 10రోజులు పాటు సోషల్‌ మీడియా వేదికగా వైసిపి - జనసేన అభి మానుల మధ్య పెద్ద యుద్ధమే నడిచింది.

రాష్ట్రంలో పవన్‌ కళ్యాణ్‌కు సినిమా పరంగా ఒక ఇమేజ్‌ వుంది. రాజకీయాల జోలికి రాకుంటే ఆ ఇమేజ్‌ అలాగే వుం టుంది. ఒకవేళ పూర్తి స్థాయిలో రాజకీ యాల్లోకి రావాలనుకుంటే ముందు తనకు ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ప్రజల తరపున పోరాడేందుకు సిద్ధం కావాలి. అదేం లేకుండా చంద్రబాబు చొక్కాలో దాక్కుని ఇలా అప్పుడప్పుడూ రాళ్ళు విసురు తుంటే స్టార్‌ ఇమేజ్‌ వున్న పవన్‌కళ్యాణ్‌ అనే హీరో జీరోగా మారడానికి ఇంకెంతో కాలం పట్టదు. ఇక అసలు విషయానికొస్తే పవన్‌ విషయంలో వైసిపి శ్రేణులు ఇంతగా స్పందించాల్సిన అవసరం లేదు. పవన్‌ ఏంటన్నది ప్రజలకే కాదు, ఆయన అభిమా నులకు కూడా అర్ధమైపోయింది. ఆయన అభిమానులు కూడా సగం మంది రాజకీ యంగా ఆయనతో విభేదిస్తున్నారు. ఆయన చంద్రబాబు తోకలా మారాడన్న విషయం లోకజ్ఞానం తెలిసిన అభిమానులకు అర్ధ మవుతుంది. కాబట్టి అభిమానులందరు కూడా కట్టగట్టుకుని ఆయన వెంట రాజ కీయ ప్రయాణం చేసే అవకాశం లేదు. పవన్‌ అనే వ్యక్తి అప్పుడప్పుడూ వస్తుం టాడు... ఏదో ఒకటి మాట్లాడేసి పోతుం టాడు. ఆయన మాటలను వైసిపి శ్రేణులు సీరియస్‌గా తీసుకుంటే అది చంద్రబాబుకే లాభం. ఆయనకు కావాల్సింది కూడా వైసిపితో పవన్‌ అభిమానులు కలవకుండా చేయడమే! పవన్‌పైకి వైసిపి నేతలను రెచ్చగొట్టేలా చేసి ఆ పార్టీకి కాపులను దూరం చేయడమే!

పవన్‌ను చంద్రబాబు 'దూకుడు' సినిమాలో బ్రహ్మానందాన్ని మహేష్‌బాబు వాడుకున్నట్లుగా వాడుకుంటున్నాడు. ఈ విషయం పవన్‌కు అర్ధం కావడం లేదు. అర్ధమయ్యేసరికి పవర్‌స్టార్‌ పవర్‌లెస్‌ స్టార్‌గా మిగిలిపోతాడు.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • హోదా పోరుతో... వ్యతిరేకత పోగొట్టుకున్నారు
  నెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్‌ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్‌ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్‌ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న…
 • నడిచినా... నిద్రించినా... ఏడాదంతా ప్రజల మధ్యే...
  ప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది…

Newsletter