15 December 2017 Written by 

మెట్టలో గట్టెక్కని కష్టాలు

mettaదేశమంతా వర్షాలు బాగా కురిసినా ఆ ప్రాంతంలో కనీస వర్షాలు కురవవు. దేశంలో డ్యాంలు, చెరువులన్నీ నిండినా ఆ ప్రాంతంలో చెరువులు, బావులు నిండవు. తీవ్ర వర్షాభావంతో మెట్టప్రాంతా నికి నిలువెత్తు చిరునామాగా నిలిచే ఆ కరువు సీమే ఉదయగిరి ప్రాంతం.

రావణాసురుడు తన చెల్లెలు శూర్ప నఖకు పసుపు కుంకుమ క్రింద ఈ గడ్డను రాసిచ్చాడని, అందుకే ఈ ప్రాంతంలో సరిగా వర్షాలు పడవని, పంటలు పండ వని చెప్పుకుంటుంటారు. ఇది పుక్కిటి పురాణమే అయినా కొన్నిసార్లు ఇక్కడ నెల కొంటున్న తీవ్ర వర్షాభావ పరిస్థితులను చూస్తుంటే వీటిని నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో వర్షాలు ఓ మోస్తరుగానే పడ్డాయి. మరీ వరదలు వచ్చి చెరువులు తెగిపోయేంత వానలు లేకున్నా తాగునీటికి, ఒక కారు సాగు నీటికి ఇబ్బంది లేనంతగా కురిసాయి. సోమశిలకు 50 టీఎంసీలకు పైగానే నీళ్ళు రాబట్టి మొదటి పంటకు నీళ్లిస్తున్నారు. అయితే జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో మిగతా 9 నియోజకవర్గాలు ఒకెత్తయితే ఉదయగిరి ఒక్కటే ఒకెత్తు. వరుసగా మూడో ఏదాడి కూడా ఈ ప్రాంతంలో సరిగా వానలు పడలేదు. నెల్లూరు చుట్టుపక్కల గత నెలలో భారీ వర్షాలు కురిసిన రోజుల్లో కూడా

ఉదయగిరి, సీతారామపురం, వింజమూరు, దుత్తలూరు, వారికుంటపాడు, కొండా పురం మండలాలలో ఎండలు సుర్రుమని పించాయి. అడపాదడపా సన్నటి జల్లులు పడడం తప్ప చెరువుల్లోకి, బావుల్లోకి నీళ్లొచ్చే స్థాయిలో వానలు పడలేదు. జిల్లాలోని మిగిలిన 9 నియోజకవర్గాలకు సోమశిల నీళ్ళు పారుతుంటాయి. సోమ శిలకు 250 కిలోమీటర్ల దూరంలో వున్న చెన్నైకు, 200 కిలోమీటర్ల దూరంలో వున్న తిరుపతికి కూడా పెన్న నీళ్ళు పోతుం టాయి. పెన్నకు గట్టిగా పాతిక కిలోమీటర్ల దూరం లేని ఉదయగిరి మెట్టప్రాంతానికి మాత్రం సోమశిల నీళ్ళుండవు. అది ఈ మెట్టప్రాంత ప్రజల దరిద్రం.

ఉదయగిరి ప్రాంతవాసులకు సోమ శిల నుండి నీళ్ళు అందించాలన్న లక్ష్యంతో గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆర్ధిక మం త్రిగా వున్న ఆనం రామనారాయణరెడ్డి దాదాపు 400కోట్ల అంచనాలతో సోమశిల హైలెవల్‌ కెనాల్‌ను మంజూరు చేయించారు. అయితే ఈ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఈ కెనాల్‌ పూర్తయితేనే ఉదయగిరి ప్రాంతానికి ఎంతో ప్రయో జనం చేకూరుతుంది. ఈలోపు మెట్టకు కష్టాలు గట్టెక్కేటట్లు లేవు. ఈ ఏడాది కూడా వర్షాలు లేక రైతులు పొలాలను బీళ్ళుగా పెట్టుకుంటున్నారు. కొద్దిపాటి వర్షాలు కురిసున్నా వేలాది ఎకరాలలో మినుము, పొగాకు సాగుచేసేవాళ్ళు. ఈ సంవత్సరం నీళ్ళు లేక పెద్దగా ఆ పైర్లు కూడా వేయలేదు.

సాగునీరు సంగతి అటుంచితే ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలలకల్లా ఈ మండలాలలో తాగునీటి సమస్య కూడా తీవ్రమయ్యే ప్రమాదముంది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దండగ... పండగ...
    పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
  • చిలికి చిలికి... గాలివాన కానుందా?
    ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
  • ఇసుకతో ఇక్కట్లు
    నెల్లూరు, జొన్నవాడ మధ్య సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక చిన్న ఆటంకం వస్తోంది. ప్రతి వాహనదారుడు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులైతే అదుపు తప్పి పడిపోతున్నారు. ఇరు కళలమ్మ గుడి నుండి దొడ్ల డెయిరీ దాకా రోడ్డును నాలుగు లైన్లుగా…
  • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
    2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
  • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
    మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter