15 December 2017 Written by 

అనారోగ్య భారతం

indiaమన దేశంలో ప్రజారోగ్యం పడకేసింది. అనారోగ్యం మాత్రం అంతటా విస్తరిస్తోంది. ఏ చేయూతా లేక అసహాయస్థితిలో ఉన్న పేదలను ఆదుకునేందుకు ఉన్న అనేకానేక పథకాలు ఆచరణలో చట్టుబండలవు తుండడంతో రకరకాల వ్యాధుల బాధలతో, అనారోగ్యాలతో ప్రజలు నిత్యం వేదన పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా, పేదరికం కారణంగా గర్భిణులు సరైన పౌష్టికాహారం లేకపోవడం వల్ల..వారితో పాటు, శిశువుల ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది. రానురాను మన సమాజంలో మాతా శిశువుల స్థితి మరింత దయనీయంగా తయారవుతోంది. తల్లిని, తల్లి గర్భంలో ఉన్న శిశువులను పరిరక్షించుకు నేందుకు ప్రభుత్వాలు తీసుకోవాల్సినంత శ్రద్ధ, చొరవ తీసుకోవడం లేదు. ఫలితంగా మాతా శిశు మరణాలు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. గర్భిణులకు ఎన్నో పథకాలను ప్రభుత్వాలు ప్రవేశపెట్టినా అవి ఆచరణలో నామమాత్రంగానే ఉంటుండడంతో గర్భిణులకు సరైన పోషకాహారం అందక వారు నానా యాతనలు పడుతూనే ఉన్నారు. మరీ మనదేశంలో పౌష్టికాహారం లభించక, ఎంతోమంది గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారని, దేశవ్యాప్తంగా

ఉన్న గర్భిణుల్లో సగానికి పైగానే ఈ దురవస్థకు గురవుతున్నారని ఇటీవల వెలుగులోకి వచ్చిన అంతర్జాతీయ పోషకాహార నివేదిక స్పష్టం చేస్తోంది కూడా. అదేవిధంగా దేశవ్యాప్తంగా మరో 38 శాతానికి పైగానే పిల్లలు అటు మానసికంగాను, ఇటు శారీర కంగానూ సరైన ఎదుగుదల లేక బక్కచిక్కిపోతున్నా రని, జీవితకాలంలో వారు పడుతున్న బాధలు వర్ణనాతీతమని గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో పౌష్టికాహార మిషన్‌ను ఏర్పాటు చేసి, పోషకాహారం లభించడంలో ఎలాంటి ఇబ్బం దులు లేకుండా చేయాలని ప్రధాని మోడీ ఆధ్వర్యం లోని కేంద్రప్రభుత్వం తాజాగా సన్నాహాలు చేస్తుం డడం ఎంతో అభినందనీయమే అయినప్పటికీ, ఇప్పటికే దేశంలో అనేకమంది గర్భిణులు, శిశువులు పేదరికంతో, పౌష్టికాహార లోపంతో అనేకవిధాలుగా కష్టాలు పడుతూనే ఉన్నారు. ఆ ప్రయత్నమేదో ఇప్పటి ప్రభుత్వం మరింత వేగవంతంగా చేయాలి. ఎందుకంటే, దాదాపు పాతికేళ్ళ దీర్ఘకాలంలో దేశంలో మున్నెన్నడూ లేనంతగా సరైన పౌష్టికాహారం లభించక తల్లులు, పిల్లలు పడిన బాధలు అన్నిన్ని కావు. ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు గతంలో నిపుణులు హెచ్చరించినా గత ప్రభుత్వాలు ప్రజారోగ్యం పట్ల ఆశించిన శ్రద్ధ తీసుకోకపోవడమే బాధాకరం. మనదేశంలో అన్ని పథకాలు కాగితాల మీద అద్భుతంగా ఉంటాయి కానీ, ఆచరణలోకి మాత్రం రావడం లేదు. ఒకవేళ వచ్చినా అవి అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ఒక్కోచోట, ఆసుపత్రులకు వెళ్ళే గర్భిణులను సరిగ్గా పలకరించే దిక్కు కూడా ఉండదు. ఆసుపత్రులకు కోట్లల్లో నిధులు వస్తున్నా, వైద్యులు సిబ్బంది తదితర యంత్రాంగమంతా భారీగానే ఉంటున్నా విధి నిర్వహణలో అనేకమంది చూపుతున్న అలసత్వం తల్లుల పాలిట వేదనగా..నరకయాతనగా మారుతోంది. ఆసుపత్రుల్లో సరైన వసతులు లేక, దోమలు, ఈగలు, దుర్వాసన చుట్టుముడుతున్నా, పడకలు సరిగా లేక గబ్బుకొట్టిపోతున్నా పట్టించుకునే నాధులు ఉండరు. ఒక్కోసారి సరైన సమయంలో తగు చికిత్సలు చేసేవారు ఉండరు. ఉన్నా వారి నిర్లక్ష్యధోరణి చూస్తే మన బాధ ఇంకెవరికి చెప్పుకోవాలో తెలియదు. ఆసుపత్రుల్లో మందుల కొరత లేకున్నా, రోగులకు అవసరమైన మందులు మాత్రం ఉండవు. స్కానింగ్‌లు, స్క్రీనింగ్‌లు, రకరకాల వైద్యపరీక్షలు ఇక్కడ అందుబాటులో లేవని, అవన్నీ బయట చేయించుకురావాలని నిక్కచ్చిగా చెప్పే ఆసుపత్రులకు మనదేశంలో కొదవే లేదు. అయితే, బయటకు వెళ్ళి అన్ని రకాల మందులు తెచ్చుకోవాలంటే, వైద్యపరీక్షలకు వేలకు వేలు ఖర్చుపెట్టుకోవాలంటే పేదలకు అంత డబ్బు అందుబాటులో ఉండదు. ప్రభుత్వాసుపత్రుల్లో అన్నీ ఉచితమనే చెప్తున్నా దేశంలోని అనేకప్రాంతాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో ఇలాంటి కొరతలెన్నో ఉన్నాయి. గ్రామీణప్రాంతాల్లోనైతే ఈ బాధలు బోలెడు. నిత్యం పేదప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే ఇవి. గర్భిణులకు బాలింతలకు ఒక పూట పెట్టే భోజనం కూడా నాసిరకంగానే ఉంటుండడం, మాతా శిశువుల కోసం ప్రభుత్వాలు సరఫరా చేస్తున్న కోడిగుడ్లు, బియ్యం, పౌష్టికాహారం వంటివి సరైన పర్యవేక్షణ లేక పోవడంతో పక్కదారులు పడుతుండడం అనేకచోట్ల మనం చూస్తూనే ఉన్నాం. పేదరికంలో పుట్టిన ఒక తల్లి, తన బిడ్డకు జన్మనిచ్చే దాకా భయంభయంగానే ఆసుపత్రుల్లో కాలం వెళ్ళదీస్తున్న దృశ్యాలు మన ప్రభుత్వాసుపత్రుల్లో కొల్లలుగా చూడవచ్చు. అయినా, ఎవరికీ కనికరం ఉండదు. అంతా నిర్లిప్తతే. కనీసం మానవతా దృక్ఫధంతోనైనా రోగుల పట్ల కరుణతో వ్యవహరించాలన్న స్పృహ ఆసుపత్రుల్లో చాలా మందికి ఉండడం లేదన్నదే రోగుల వేదన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మాతాశిశువుల బాధలను గుర్తించి వారి సమస్యలు తీర్చేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఆరోగ్యకేంద్రాలు, ఆసుపత్రుల్లో మాతాశిశువులకు ప్రధమ ప్రాధాన్యత ఇచ్చి, వారికి సరైన పౌష్టికాహారం సమకూర్చి, ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనిచ్చేవిధంగా, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని తీర్చిదిద్దుకునేవిధంగా అటు పాలకులు, ఇటు అధికారయంత్రాంగం వెంటనే సమాయత్తం కావాలి. సరైన ఆరోగ్యం లేక అలమటిస్తున్నవారిని కబళించేందుకు అకాల మరణాలు పొంచి ఉంటాయి. ఈ దుస్థితి పోవాలి. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాల పట్ల మరింత పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలి. పథకాలను లోపభూయిష్టంగా అమలుచేస్తున్నవారిని దండించాలి. అందరికీ ఆరోగ్యం అందుబాటులోకి రావాలంటే చిన్నవిషయం కాదు. అందుకు ఎంతో కట్టుదిట్టమైన ప్రణాళికలు అవసరం. చెప్పే మాటలకు చేసే చేతలు తోడు కాకుంటే ఈ పరిస్థితిలో మార్పు ఎంతమాత్రమూ ఉండదు. ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వాలు తక్షణం సమాయత్తం కావాలి. ముఖ్యంగా మాతాశిశువుల ఆరోగ్య పరిరక్షణకు పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించాలి. ప్రజారోగ్యం కోసం అటు పాలకులు, ఇటు ప్రభుత్వాలు..అధికారులు అందరూ కలసి చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడే 'ఆరోగ్య భారత్‌' సాకారమవుతుంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter