Friday, 15 December 2017 10:31

ఈ మలుపులు... ప్రమాదాలకు పిలుపులు

Written by 
Rate this item
(0 votes)

malupuకోవూరు నుండి విజయవాడ దాకా జాతీయ రహదారిని ఆరులైన్లుగా మార్చారు. ప్రతి క్రాసింగ్‌ వద్ద అండర్‌పాస్‌ ఏర్పాటు చేసారు. చిన్న పల్లెటూరుకు కూడా ఇవి ఏర్పడడంతో హైవేను దాటి పోవడం అన్న ప్రశ్నేలేదు. కాబట్టి ప్రమాదాలను చాలావరకు తగ్గించవచ్చు. దరిద్రం ఏంటంటే కోవూరు నుండి తడ దాకా ఆరులైన్లు విస్తరణ పెండింగ్‌లో వుంది. హైవే మీద ట్రాఫిక్‌ పెరిగింది. చాలా గ్రామాలకు హైవే మీదనే క్రాస్‌ చేయాల్సి వస్తోంది. నెల్లూరు పరిధిలో చూస్తే ఇనమడుగురోడ్డు, మైపాడురోడ్డు, ముత్తుకూరురోడ్డుల వద్ద మాత్రమే జాతీయ రహదారి విస్తరణ సమయంలో అండర్‌పాస్‌లు ఏర్పాటు చేసారు. ఇప్పుడు చూస్తే నగరం విస్తరించింది. హైవేపైన సిటీ ట్రాఫిక్‌ కూడా పెరిగిపోయింది. అటు వెంకటేశ్వరపురం నుండి ఆదిత్యనగర్‌ దాకా, నగరం హైవేదాకా విస్తరించింది. ఎన్టీఆర్‌ నగర్‌ ప్రాంతంలో హైవేకి ఆనుకునే అటు ఇటు జనావాసాలు, వ్యాపార కేంద్రాలు వెలిసాయి. పద్మావతినగర్‌, చిల్డ్రన్స్‌పార్కు రోడ్డు, సుందరయ్య కాలనీల వద్ద కూడా ఇదే పరిస్థితి. ఈ ప్రాంతాలలో సైకిళ్ళు, బైక్‌లు కూడా హైవేపై తిప్పుతున్నారు. గంటకు వంద నుండి 150కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్ళే రహదారిపై ద్విచక్రవాహనాలలో ప్రయాణం ఎలా ప్రమాదమో ప్రత్యేక చెప్పబల్లేదు.

చింతారెడ్డిపాళెం, కనుపర్తిపాడు క్రాస్‌లు కూడా ప్రమాదకరంగా మారాయి. ఇతర ప్రాంతాల నుండి నెల్లూరు నగరంలోకి ప్రవేశించే వాహనాలు ఎక్కువుగా చింతారెడ్డిపాలెం క్రాస్‌ వద్దే మలుపు తిరుగుతున్నాయి. సమీపంలో సింహపురి ఆసుపత్రి వుంది. ట్రాఫిక్‌ రద్దీ పెరిగింది. హైవే మీద వాహనాలు వేగంగా వస్తుండడం, హైవేలో నుండి సిటీ లోకి, సిటీలో నుండి హైవే మీదకు వెళ్ళే వాహనాలు ఇక్కడే మలుపు తిరుగుతుండడం... వాహనాలు నడిపేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమరుపాటుగా వుంటే ఇక్కడ ప్రమాదమే! కనుపర్తిపాడు జంక్షన్‌ వద్ద కూడా ఇదే పరిస్థితి. అయ్యప్పగుడి సెంటర్‌ వద్ద కూడా అండర్‌పాస్‌ లేక ట్రాఫిక్‌ కన్‌ఫ్యూజన్‌... కాకుటూరు వద్ద గొలగమూడికి వెళ్ళే రోడ్డు, వెంకటాచలం వద్ద సర్వేపల్లి రోడ్డు జంక్షన్‌లు కూడా ప్రమాదకరంగా వున్నాయి. ఈ జంక్షన్‌ల వద్ద గతంలో ఎన్నో ప్రమాదాలు జరగడం చూసాం. ఆరులైన్ల సంగతి దేవుడెరుగు... ముందు జంక్షన్‌ల వద్ద హైవేపై అండర్‌ బ్రిడ్జిలనన్నా పూర్తి చేస్తే ప్రమాదాలు జరక్కుండా ఎందరి ప్రాణాలనో కాపాడినవాళ్లవుతారు.

Read 183 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • దండగ... పండగ...
  పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
 • చిలికి చిలికి... గాలివాన కానుందా?
  ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
 • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
  2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
 • సినిమానూ వదలని సెగ
  నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
 • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
  మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter