15 December 2017 Written by 

సిఇజడ్‌తోనన్నా... దశ తిరిగేనా?

cezప్రధాని నరేంద్ర మోడీ... ముఖ్యమంత్రి చంద్రబాబు... మాటలను కోటలు దాటిస్తారు. అరచేతిలో స్వర్గం చూపిస్తారు. ఆచరణకొచ్చే సరికి ఏమీ ఉండదు. 2014లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలు వచ్చాక నెల్లూరు జిల్లాలో పదిమందికి పని కల్పించే విధంగా ఈ ప్రాజెక్ట్‌ వచ్చింది, ఈ పరిశ్రమ వచ్చింది అని చెప్పుకోవడానికి ఒక్కటీ లేదు. మూడున్నరేళ్ళుగా మాటలు చెబు తూనే వున్నారు. అక్కడ అది, ఇక్కడ ఇది అంటూ ఇంకా చెబుతూనే వున్నారు.

విశాఖ-చెన్నై, బెంగుళూరు - చెన్నై కారిడార్‌లలో కృష్ణపట్నం పోర్టును కలి పారు. ఈ కారిడార్‌లు వస్తే పారిశ్రామి కంగా నెల్లూరు జిల్లా ఎక్కడికో పోతుం దనుకున్నారు. ఇంతవరకు ఈ కారిడార్ల నిర్మాణంపై ఎలాంటి కదలికలు లేవు. కనీసం సర్వే కూడా జరిగినట్లు లేదు. కేంద్రం కృష్ణపట్నం పోర్టును ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీగా బడ్జెట్‌లో చూపించిందేగాని, తర్వాత ఆచరణకు తగ్గ విధివిధానాలు లేవు. బకింగ్‌హోమ్‌ కెనాల్‌ ద్వారా జల రవాణా అభివృద్ధి అన్నారు. ఇంతవరకు దానిపై అడుగు ముందుకు పడలేదు. దుగరాజపట్నం పోర్టు హామీ అటకెక్కినట్లే! దామవరం వద్ద ఎయిర్‌పోర్టు ఇంకా ఊగిసలాడుతూనే వుంది. నెల్లూరుజిల్లాకు రావాల్సిన 'కియో మోటార్‌' అనంతపురం జిల్లాకు తరలిపోవడం చూసాం. వాళ్ళు ఇఫ్కో భూములు అడిగారు. అవివ్వడం సాధ్యం కాదని తేల్చేసరికి అనంతపురం చూసుకున్నారు.

వై.యస్‌. మరణం తర్వాత జిల్లాలో పారిశ్రామిక వేగం ఆగిపోయింది. అడు గులు ముందుకు పడడం లేదు. ఈ దశలో వున్న ఒకే ఒక ఆశ కోస్టల్‌ ఎంప్లా యిమెంట్‌ జోన్‌. కేంద్రం కృష్ణపట్నం పోర్టు కేంద్రంగా సి.ఇ.జడ్‌ను ఏర్పాటు చేయా లని నిర్ణయించడం, ఈ మేరకు కేంద్ర బృందాలు వచ్చి పరిశీలించడం జరిగింది. పాతిక వేల ఎకరాల విస్తీర్ణంలో సిఇజడ్‌ ఏర్పాటు కానుంది. ఈమేరకు భూసేకరణ కూడా జరుగుతోంది. సిఇజడ్‌ పరిధిలోకి త్వరలోనే రెండు భారీ పరిశ్రమలు రాను న్నట్లు తెలుస్తోంది. సి.ఇ.జడ్‌ ఆచరణలోకి వస్తే జిల్లాలో ఆగిన పారిశ్రామిక ప్రగతి చక్రం ముందుకు కదిలే అవకాశముంది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ప్రశాంతతే.. మా లక్ష్యం!
    సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
  • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
    మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
  • రాజకీయ దారులు వేరవుతాయా?
    నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
  • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
    ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
  • ఆనంతో... అదనపు బలం!
    మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter