15 December 2017 Written by 

పేద గుండెల ధ్వని... 'జై ఆంధ్రా' ఉద్యమ సేనాని... మెట్టలో పుట్టిన మేటి నేత మాదాల జానకిరామ్‌

madalaఉదయగిరి అంటే గుర్తొచ్చేది అలనాడు శ్రీకృష్ణ దేవరాయలు అయితే.. ఆధునిక రాజకీయ కాలంలో గుర్తొచ్చేది స్వర్గీయ బెజవాడ గోపాలరెడ్డి, ప్రస్తుత ఉపరాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడులు. వారి రాజ కీయ ప్రస్తానం మొదలైంది ఇక్కడే! అలాగే వారితో పాటు గుర్తొచ్చే నాయకుడు మాజీ మంత్రి మాదాల జానకిరామ్‌. అయితే బెజవాడ గోపాలరెడ్డి, వెంకయ్యనాయుడులు డెల్టా ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ నిలబడ్డ నాయకులు. కాని, మాదాల జానకిరామ్‌ ఈ మెట్ట నేలపైనే పుట్టిన నాయకుడు. ఇక్కడి ప్రజల సమస్యలు తెలిసిన నాయకుడు. ఇక్కడి ప్రజల కోసం పోరాడిన నాయకుడు.

నాయకుడంటే ప్రజల కోసం నిలవాలి, ప్రజల కోసం నడ వాలి, ప్రజల కోసం గెలవాలి, ప్రజల మనస్సులు గెలవాలి. ఇలా నడిచి ఉదయగిరిలో వేలాదిమంది ప్రజల మనసులు గెలిచిన ప్రజా నాయకుడే మాదాల జానకిరామ్‌. 1970 దశకంలో నూనూగు మీసాల వయసులోనే ఆంధ్రసేనను స్థాపించి జైఆంధ్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం పోరాటంలో ముందుండి నడిచాడు. లక్షల మంది ఉద్యమకారు లను ముందుకు నడిపించాడు. జిల్లాలో సంచలనం రేపిన 'జైఆంధ్ర' ఉద్యమంలో ఆయనది అనిర్వచనీయమైన పాత్ర.

ఉద్యమనేతగా, రాజకీయ నేతగా, పారిశ్రామికవేత్తగా, రైతు బిడ్డగా, ఆథ్యాత్మిక చింతనాపరుడిగా, ఎక్కడ వున్నా ఆయనది విలక్షణ వ్యక్తిత్వం. రాజకీయాలలో ఆయన ప్రయాణం కొన్నేళ్లే! 1978 ఎన్నికల్లో ఓడిపోయాడు. 1989 వరకు రాజకీయాలకు దూరమయ్యాడు. 1989లో ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలిచాడు. 1991-93ల మధ్య నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి మంత్రివర్గంలో భూగర్భ గనుల శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 1994, 2004 ఎన్ని కల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. కాని ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసింది ఐదేళ్ళ కాలమే అయినా అయిదు తరాలవాళ్ళు మరచిపోనంతగా ఉదయగిరి ప్రజలపై తనదైన ముద్ర వేసుకున్నారు. రాజకీ యాలలో శత్రువు చేత కూడా శెభాష్‌ అనిపించుకునే వ్యక్తిత్వం ఆయనది. తప్పు చేసింది తనవాడైనా ముఖాన్నే నిలదీసే గుణం ఆయనది. మంత్రిగా వుండగా ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. విద్యాభివృద్ధికి కృషి చేసారు. ఉదయగిరి దుర్గాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి అంకురార్పణ చేసింది ఆయనే! ఉదయగిరిలో ఆర్టీసీ డిపో రావడంలో ఆయన కృషి వుంది. అన్నింటిని మించి మెట్టప్రాంతమైన ఉదయగిరిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు వెలుగొండ ప్రాజెక్ట్‌, సీతారాంసాగర్‌ ప్రాజెక్ట్‌, సాగర్‌ ఎడమ కాలువ పొడిగింపు కోసం ఆయన చేసిన పోరాటాన్ని ఈ ప్రాంత ప్రజలెవ్వరూ విస్మరించరు. ఇలా ఉదయగిరి రాజకీయ చరిత్రలో మాదాల జానకిరామ్‌ మరపురాని వ్యక్తిగా నిలిచిపోయారు. ప్రజలతో ఇంతగా మమేకమైన ఆ ప్రజానాయకుడి ఆకస్మిక మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నెల 20వ తేదీన స్వగ్రామం నర్రవాడలో జరిగే ఉత్తరక్రియలకు పెద్దఎత్తునే ప్రజలు తరలిరానున్నారు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దండగ... పండగ...
    పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
  • సినిమానూ వదలని సెగ
    నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
  • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
    2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
  • అజీజ్‌ బ్రదర్స్‌పై కేసు
    నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌కు షాక్‌ తగిలింది. ఆయన పైన ఆయన తమ్ముడు, కార్పొరేటర్‌ జలీల్‌ మీద చెన్నైలో చీటింగ్‌ కేసు నమోదైంది. మేయర్‌ అజీజ్‌కు చెందిన స్టార్‌ ఆగ్రో కంపెనీలో వాటా కోసం తాము ఇచ్చిన 42కోట్ల…
  • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
    మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter