15 December 2017 Written by 

పేద గుండెల ధ్వని... 'జై ఆంధ్రా' ఉద్యమ సేనాని... మెట్టలో పుట్టిన మేటి నేత మాదాల జానకిరామ్‌

madalaఉదయగిరి అంటే గుర్తొచ్చేది అలనాడు శ్రీకృష్ణ దేవరాయలు అయితే.. ఆధునిక రాజకీయ కాలంలో గుర్తొచ్చేది స్వర్గీయ బెజవాడ గోపాలరెడ్డి, ప్రస్తుత ఉపరాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడులు. వారి రాజ కీయ ప్రస్తానం మొదలైంది ఇక్కడే! అలాగే వారితో పాటు గుర్తొచ్చే నాయకుడు మాజీ మంత్రి మాదాల జానకిరామ్‌. అయితే బెజవాడ గోపాలరెడ్డి, వెంకయ్యనాయుడులు డెల్టా ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ నిలబడ్డ నాయకులు. కాని, మాదాల జానకిరామ్‌ ఈ మెట్ట నేలపైనే పుట్టిన నాయకుడు. ఇక్కడి ప్రజల సమస్యలు తెలిసిన నాయకుడు. ఇక్కడి ప్రజల కోసం పోరాడిన నాయకుడు.

నాయకుడంటే ప్రజల కోసం నిలవాలి, ప్రజల కోసం నడ వాలి, ప్రజల కోసం గెలవాలి, ప్రజల మనస్సులు గెలవాలి. ఇలా నడిచి ఉదయగిరిలో వేలాదిమంది ప్రజల మనసులు గెలిచిన ప్రజా నాయకుడే మాదాల జానకిరామ్‌. 1970 దశకంలో నూనూగు మీసాల వయసులోనే ఆంధ్రసేనను స్థాపించి జైఆంధ్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం పోరాటంలో ముందుండి నడిచాడు. లక్షల మంది ఉద్యమకారు లను ముందుకు నడిపించాడు. జిల్లాలో సంచలనం రేపిన 'జైఆంధ్ర' ఉద్యమంలో ఆయనది అనిర్వచనీయమైన పాత్ర.

ఉద్యమనేతగా, రాజకీయ నేతగా, పారిశ్రామికవేత్తగా, రైతు బిడ్డగా, ఆథ్యాత్మిక చింతనాపరుడిగా, ఎక్కడ వున్నా ఆయనది విలక్షణ వ్యక్తిత్వం. రాజకీయాలలో ఆయన ప్రయాణం కొన్నేళ్లే! 1978 ఎన్నికల్లో ఓడిపోయాడు. 1989 వరకు రాజకీయాలకు దూరమయ్యాడు. 1989లో ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలిచాడు. 1991-93ల మధ్య నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి మంత్రివర్గంలో భూగర్భ గనుల శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 1994, 2004 ఎన్ని కల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. కాని ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసింది ఐదేళ్ళ కాలమే అయినా అయిదు తరాలవాళ్ళు మరచిపోనంతగా ఉదయగిరి ప్రజలపై తనదైన ముద్ర వేసుకున్నారు. రాజకీ యాలలో శత్రువు చేత కూడా శెభాష్‌ అనిపించుకునే వ్యక్తిత్వం ఆయనది. తప్పు చేసింది తనవాడైనా ముఖాన్నే నిలదీసే గుణం ఆయనది. మంత్రిగా వుండగా ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. విద్యాభివృద్ధికి కృషి చేసారు. ఉదయగిరి దుర్గాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి అంకురార్పణ చేసింది ఆయనే! ఉదయగిరిలో ఆర్టీసీ డిపో రావడంలో ఆయన కృషి వుంది. అన్నింటిని మించి మెట్టప్రాంతమైన ఉదయగిరిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు వెలుగొండ ప్రాజెక్ట్‌, సీతారాంసాగర్‌ ప్రాజెక్ట్‌, సాగర్‌ ఎడమ కాలువ పొడిగింపు కోసం ఆయన చేసిన పోరాటాన్ని ఈ ప్రాంత ప్రజలెవ్వరూ విస్మరించరు. ఇలా ఉదయగిరి రాజకీయ చరిత్రలో మాదాల జానకిరామ్‌ మరపురాని వ్యక్తిగా నిలిచిపోయారు. ప్రజలతో ఇంతగా మమేకమైన ఆ ప్రజానాయకుడి ఆకస్మిక మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నెల 20వ తేదీన స్వగ్రామం నర్రవాడలో జరిగే ఉత్తరక్రియలకు పెద్దఎత్తునే ప్రజలు తరలిరానున్నారు.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter