Friday, 15 December 2017 11:30

రికార్డు సృష్టిస్తోన్న శ్రీధర్‌రెడ్డి 'ప్రజాబాట'

Written by 
Rate this item
(0 votes)

kotamనెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన పర్యటనలో రికార్డులు సృష్టిస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా తనను గెలిపించినందుకు ఆ ప్రజలకు సేవ చేయ డమే పరమావధిగా భావించిన శ్రీధర్‌రెడ్డి, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వారి సమస్యలు పరిష్కరించేందుకు సమా యత్తమయ్యారు. 105 రోజుల పాటు ప్రజాబాట కార్యక్రమానికి స్వయంగా ప్రణాళిక రూపొందించుకుని ఇంటింటికీ వెళ్ళి ప్రజలను నేరుగా కలుసుకుని వారితో మాట్లాడి, వారి అవసరాలేమిటో తెలుసుకుని ఆ మేరకు ప్రజల సమస్యలను తీర్చేందుకు సంకల్పించారు. ఈ నెల 13వ తేదితో ఈ మహత్తరమైన ప్రజాబాట కార్యక్రమం 75 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి 23వ డివిజన్‌లోని జనశక్తి నగర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాను ఇన్నిరోజులు ఏఏ కార్యక్రమాలను నిర్వర్తించారో తెలియజేశారు. ఈ 75 రోజుల్లో నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలోని 38 గ్రామాల్లో ప్రజాబాట పూర్తయిందన్నారు. అదేవిధంగా నగరంలోని 21 కాలనీల్లో ప్రజాబాట ద్వారా ప్రజలను కలుసుకున్నామన్నారు. మొత్తంగా 31,012 ఇళ్ళకు వెళ్ళి, నేరుగా ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నామని, ఇప్పటిదాకా సుమారు లక్షా 10వేల మంది ప్రజలను కలుసుకున్నామని ఆయన వివరించారు. 73 చోట్ల విద్యార్థులతోను, రైతులతోను, పొదుపు మహిళలు, సీనియర్‌ సిటిజన్స్‌, చేనేతకారులు, గిరిజనులు, బిసిలు, దళితులు, మైనార్టీలు..ఇలా అన్నివర్గాల ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నానన్నారు. తాను ప్రజలను కలుసుకున్నప్పుడు అనేకమంది తమకు ఇళ్ళస్థలాలు ఇప్పించి ఆదుకోవాలని, పింఛన్లు ఇప్పించాలని కోరారని, అనేకమందికి ఇంకా రేషన్‌కార్డులు కూడా లేవని, కాలనీల్లో కనీస వసతులు లేవని, పక్కా రోడ్లు కానీ, డ్రైనేజీ సౌకర్యాలు కానీ లేవని తెలిపారన్నారు. మంచి నీటి వసతులు కూడా సరిగా లేవని, అదేవిధంగా నిరుద్యోగ సమస్యతో యువత ఎన్నో బాధలు పడుతున్నారన్నారు. ఈ సమస్యలన్నిటినీ ఏరోజుకారోజు ఎస్‌ఎంఎస్‌, వాట్సాఫ్‌ల ద్వారా, తన కార్యాలయ సిబ్బంది ద్వారా సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నానన్నారు. ఈ సమస్యలు విన్నవించాక కొంతమంది అధికారులు వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరిస్తున్నారని, మరికొందరు ఇంకా నిర్లక్ష్యంగానే ఉంటున్నారని ఆయన ఆవేదనగా అన్నారు. న్యాయమైన ప్రజాసమస్యల పరిష్కారంలో అధికారులు స్పందిస్తే, ప్రజాబాట పూర్తయిన తరువాత వారిని పూలమాలలతో సత్కరిస్తామన్నారు. ప్రజాసమస్యలపై స్పందించకుంటే ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రజాబాట మధ్యలోనే మెరుపు ధర్నాలు, నిరసన దీక్షలకు దిగుతున్నానన్నారు. ప్రజాబాటలో గుర్తించిన ప్రతి సమస్య పరిష్కారానికి అలుపెరుగని పోరాటం సాగిస్తానని కోటంరెడ్డి స్పష్టం చేశారు. ప్రజాసమస్యల సాధన కోసం జాతిపిత గాంధీజీ చేసిన ప్రజాఉద్యమం లాంటిదే మన ఎమ్మెల్యే-మన ఇంటికి కార్యక్రమమని ఆయన ఈ సందర్భంగా తెలియ జేశారు. ఏదేమైనా, ఒక ఎమ్మెల్యే ఇలా ఇంటింటికి వెళ్ళి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడమన్నది ఎంతో అరుదైన విషయమని ప్రజలు ఆయనను అభినందిస్తున్నారు.

Read 108 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • రెండు నెలల్లో... ట్రెండ్‌ మారింది
    రాజకీయాలలో పరిస్థితులు తారుమారు కావడానికి ఎంతో కాలం పట్టదు. నాలుగేళ్ళ పదినెలలు సమర్ధవం తంగా పని చేసిన ఒక ప్రభుత్వం ఒక చిన్న తప్పు చేస్తే ఒక్క నెలలోనే గబ్బు పట్టొచ్చు. దాని మూలంగానే ఎన్నికల్లో ఓడిపోవచ్చు. నాలుగేళ్ళ పది నెలల…
  • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
    నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
  • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
    ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…

Newsletter