15 December 2017 Written by 

15-12-2017 రాశిఫలాలు

rasi 15

1Ariesమేషం

ఉద్యోగులు తమ బాధ్యతలను జాగ్రత్తగా నిర్వహిం చండి. అనవసర సంఘర్షణలు వద్దు. విలువైన వస్తు వులను సమకూర్చుకొంటారు. ఉద్యోగార్ధులకు అవకా శాలు రావడం ప్రారంభమవుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలం కాగలవు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి పరమైన ఆటంకాలు తొలగడం వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగడం, ఆదాయం వృద్ధి బాగుండటం జరుగుతుంది.

 

2Taurusవృషభం

ఉద్యోగ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తారు. క్రయవిక్రయాలు లాభిస్తాయి. కోర్టు వ్యవహారాలు, బాకీల సమస్యలు కొంతవరకు పరిష్కారం కాగలవు. విద్యా ప్రగతి బాగుంటుంది. ఉరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆదాయం ఆశించినంత ఉండదు. ఖర్చులు ఎక్కువుగా ఉంటాయి. చిన్న వ్యాపారులకు ఆశాజన కంగా ఉంటుంది.

 

3Geminiమిధునం

కుటుంబసౌఖ్యం బాగుంటుంది. ఉద్యోగులు తమ పైఅధికారులతోను పబ్లిక్‌తోను జాగ్రత్తగా మెలగండి. అనుకోని ప్రయాణాలుంటాయి. శరీరానికి గాయాలు తగలవచ్చును. ఉద్యోగార్ధులకు అవకాశాలు దొరక గలవు. సంప్రదింపులు, అగ్రిమెంటు వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి. పెద్దమొత్తాలలో పెట్టుబడులు గాని, భాగస్వామ్య వ్యాపారాలు గాని చేయవద్దు.

 

4Cancerకర్కాటకం

నిర్మాణాలు, కార్మిక కాంట్రాక్టుదారులు వర్క్‌లతో ఇబ్బందిపడతారు. ఉద్యోగులకు అధికారులతో సత్సం బంధాలు నెలకొంటాయి. ఉద్యోగార్ధులకు అవకాశాలు లభించగలవు. గృహ వస్తు వాహన రిపేర్లుంటాయి. బంధువులతో, సోదరులతో సమస్యలు సర్ధుబాటు చేసి కొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారంలో ప్రోత్సాహకర పరిస్థితులుంటాయి.

 

5Leoసింహం

వ్యవసాయ, పారిశ్రామిక యజమానులకు పరిస్థి తులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగులకు పబ్లిక్‌తోను అధికారులతో సన్నిహితత్వం ఏర్పడుతుంది. స్థిరాస్తుల లావాదేవీలు ప్రస్తుతం చేయవద్దు. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. వస్తు, వాహన రిపేర్లుంటాయి. షేర్లు నిరుత్సాహం కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి.

 

6Virgoకన్య

ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు మంజూరు కాగలవు. ఉద్యోగ బాధ్యతలను మంచి సామర్ధ్యంతో నిర్వహిస్తారు. దూర ప్రయాణాలుంటాయి. శుభకార్యాల ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. రావలసిన బాకీలు కొంత లభించడం, మంచివార్తను వినడం జరుగుతుంది. కుటుంబ సౌఖ్యముంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి.

 

7Libraతుల

దూరప్రయాణాలు తప్పనిసరిగా ఉంటాయి. కొత్త వస్తువులు, విలువైన వస్తువులు సమకూర్చుకొంటారు. స్థిరాస్తుల లావాదేవీలందు అనుకూల పరిస్థితులుంటాయి. బంధుముఖ్యులు, ప్రముఖులను కలుసుకొంటారు. విద్యా వృద్ధి, ఆరోగ్యం బాగుంటుంది. పట్టుదలతో చేపట్టిన పనులను జరుపుతారు. అవసరాలకు రావలసిన డబ్బు లందుతాయి. వ్యాపారాలలో రాబడి ఉంటుంది.

 

8Scorpioవృశ్చికం

ముఖ్యవిషయాలలో పెద్దల సలహాలను స్వీకరిస్తే మేలు జరుగుతుంది. రావలసిన బాకీలు పరిష్కారం కావడం, కోర్టు కేసులందు అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. ఉద్యోగార్థులకు ఆహ్వానాలు లభిస్తాయి. ఆర్ధిక ప్రణాళికలు పథకాలతో వ్యాపార పరిశ్రమ రంగాలను వృద్ధి చేస్తారు. ఆదాయం పెరుగు తుంది. చేపట్టిన పనులు సానుకూలం కాగలవు.

 

9Sagittariusధనుస్సు

సభలు సమావేశాలలో పాల్గొంటారు. పెట్టుబడు లకు మంచి అవకాశాలు లభిస్తాయి. షేర్‌ మార్కెట్‌ ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్య ఆహార విషయా లలో జాగ్రత్త అవసరం. అనుకోని ఆదాయం కొంత లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో అనుకూలత తక్కు వుగా వుంటుంది. స్వయంగా వ్యవహారాలను చూచు కొనండి. ఆర్ధికస్థితి బాగుండి ఆదాయం పెరుగుతుంది.

 

10Capricornమకరం

వస్తు వాహన రిపేర్లుండగలవు. షేర్లు నిరుత్సాహ పరుస్తాయి. ప్రభుత్వ అనుమతులు ఆలస్యం కాగలవు. అనుకున్న పనులు జరుగుతున్నా టెన్షన్‌ పడుతుంటారు. ఉద్యోగులు తమ అధికారులతోను పబ్లిక్‌తోను జాగ్రత్తగా మెలగండి. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నా లలో అనుకూలత బాగుంటుంది. కొత్త వస్తువులు సమ కూర్చుకొంటారు. అనుకోని అదనపు ఖర్చులుంటాయి.

 

11Aquariusకుంభం

కుటుంబసభ్యులతో అనుకూలత సరిగా ఉండదు. అనుకున్న పనులు కార్యక్రమాలు తొందర తొందరగా పూర్తి చేయగలరు. ఉద్యోగులకు పనిభారం, శ్రమ పెరుగుతుంది. అనవసర వ్యవహారాలలో తల దూర్చ కండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్ధిక పరమైన ఇబ్బందులుంటాయి. అవసరాలకు ఋణం చేయవలసి రావచ్చును.

 

12Piscesమీనం

అనుకోని ప్రయాణాలుంటాయి. సభలు సమావే శాలలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తారు. పనులు సక్రమంగా జరుగుతున్నా టెన్షన్‌ పడుతుంటారు. ఆరోగ్యం బాగుం టుంది. స్థిరాస్తుల మీద కొంత ఆదాయం లభిస్తుంది. విద్యా ప్రగతి బాగుంటుంది. వృత్తి వ్యవహారాలలో లాభ సాటిగా ఉండి అభివృద్ధి బాగుంటుంది. నూతన పెట్టు బడులకు, భాగస్వామ్య వ్యాపారాలకు అవకాశాలుంటాయి.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
    వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
  • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
    నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
  • నానుతున్న నారాయణ
    చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
  • వెంకటగిరి... నా ఊపిరి!
    నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
  • అయోమయంలో ఆనం
    నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter