22 December 2017 Written by 

విజయంలో విఫలం!

modi rahuడిసెంబర్‌ 18వ తేదీ... ఉదయం 9గంటల ప్రాంతం... ఢిల్లీలోనే కాదు, ఏ రాష్ట్రంలో ఏ బీజేపీ కార్యాలయం వద్ద కూడా సందడి లేదు. ఆ పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో స్పష్టమైన ఆందోళన... మహాసముద్రాలను ఈదొచ్చి ఇంటి ముందు మురికి గుంటలో పడబోతున్నామా అన్న ఫీలింగ్‌. ఎందుకంటే ఆ సమయానికి గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రావడం మొదలుపెట్టాయి. మొదటి గంటలో బీజేపీ కంటే కాంగ్రెస్‌ కొద్దిపాటి ఆధిక్యతతో వున్నట్లు అన్ని ఛానెల్స్‌లో వార్తలు... నిజంగా ఇది చూసాకా బీజేపీ నాయకులకు మైండ్‌ బ్లాక్‌ కాకుండా ఉంటుందా? అంతకు రెండ్రోజుల ముందే అన్ని సర్వేలు కూడా బీజేపీ మంచి మెజార్టీతో గెలవబోతోందని ఘోషించాయి. తీరా ఫలితాల వద్దకు వచ్చేసరికి ఇలా వుందేంటబ్బా అని బీజేపీ నేతల గుండెలు దడదడలాడాయి.

గుజరాత్‌లో అదే ట్రెండ్‌ కొనసాగి పొరపాటున కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలోకి వచ్చివుంటే దేశంలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? అసలు బీజేపీలో ఎట్లుండేది? పార్టీలోనే మోడీ మీద తిరుగుబాటు మొదలై ఉండేది. ఆయన కుర్చీ క్రిందకే నీళ్లొచ్చే పరిస్థితి కలిగేది. గుజరాత్‌లో అతి కష్టం మీద పార్టీని గెలిపించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పదవిని, తన నాయకత్వంపై నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగాడు.

కాంగ్రెస్‌ ముక్త భారత్‌ నినాదంతో తన రాజకీయ యుద్ధం మొదలుపెట్టిన నరేంద్ర మోడీ ఆ ప్రయత్నంలో చాలా విజయాలు సాధించాడు. ఒకప్పుడు నాలుగైదు ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన బీజేపీ ఈరోజు మిత్ర పక్షాలతో కలుపుకుని 19 రాష్ట్రాలలో అధికారంలో వుందంటే చిన్న విషయం కాదు. అలాగే ఒకప్పుడు దేశం లోని ముప్పావు భాగం రాష్ట్రాలలో అధికా రంలో వుండిన కాంగ్రెస్‌ ఇప్పుడు కేవలం అయిదు రాష్ట్రాలలో మాత్రమే అధికా రంలో వుండడం కూడా ఆశ్చర్యపరిచే విష యమే. అందులో కర్నాటక, పంజాబ్‌లు మాత్రమే ఒక మోస్తరు రాష్ట్రాలు. మిగిలిన మూడు చాలా చిన్న రాష్ట్రాలు.

2014లో మోడీ ప్రధాని అయ్యాక జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జైత్రయాత్రను చూసాం. ఢిల్లీ, పంజాబ్‌ ఎన్నికలు మాత్రమే వారికి పెద్ద ఎదురుదెబ్బ. బీహార్‌లో ఓటమి చవి చూసినా, దళ్‌యుతో కలిసి తిరిగి అధికారం పంచుకుంటుంది. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌లతో పాటు ముస్లిం ప్రాబల్యమున్న జమ్ము, కాశ్మీర్‌లోనూ బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం గమనార్హం. ఇక యూపిలో ఆ పార్టీ విజయమైతే ఒక చరిత్రే ననుకోవచ్చు. దేశ వ్యాప్తంగా బీజేపీని విస్తరింపచేయడంలో ప్రధానిగా నరేంద్ర మోడీ కృషి ఎంతో వుంది.

అయితే ఇప్పటివరకు సాధించిన విజ యాలు ఒకెత్తు, నిన్నటి గుజరాత్‌ విజయం ఒకెత్తు. ఒక రాష్ట్రంలో ఒక పార్టీ ఆరోసారి అధికారంలోకి రావడమన్నది రాజకీ యంగా పెద్ద రికార్డు. పెద్దనోట్ల రద్దు, జిఎస్టీ ఓ పక్క... పటేళ్ళ రిజర్వేషన్‌ పోరు మరో పక్క... తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య గుజరాత్‌లో బీజేపీ 99సీట్లతో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది. గుజరాత్‌లో ప్రతి ఎలక్షన్‌లోనూ మోడీకి వ్యతిరేకంగా బలమైన శక్తులే పని చేస్తుం టాయి. తీరా చూస్తే గెలుపు అతని వైపే ఉంటుంది. ఈసారి కూడా అలాగే జరి గింది. గుజరాత్‌ సీఎం పేరుకు విజయ్‌ రూపాని అయినా ఈ ఎన్నికల వరకు ఆ రాష్ట్ర సీఎం తరహాలో ప్రధాని మోడీయే ప్రచారం చేసారు. గుజరాత్‌ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టారు. ఓ రకంగా గుజరాత్‌లో బీజేపీ ఓడిపోతే కేంద్రంలో మన పరువేపోతుంది, ఒక గుజరాతీయుడు ప్రధాని పదవి నుండి దిగిపోవాల్సి వస్తుం దన్న ప్రచారాన్ని సృష్టించారు. కాబట్టే ప్రతికూల అంశాలు ఎన్నివున్నా కొద్దిపాటి మెజార్టీతో బయటపడ్డారు.

కాగా, బీజేపీ నాయకులు ఆనందిం చాల్సిన స్థాయిలో మోడీ సొంత రాష్ట్రంలో విజయం సిద్ధించిందా? అన్నది ఇక్కడ ప్రశ్న? గుజరాత్‌ హిందువుల ప్రాబల్యం అధికంగా వున్న రాష్ట్రం. బీజేపీ, కాం గ్రెస్‌లు తప్ప రాష్ట్రంలో ఇంకే పార్టీలు బలంగా లేవు. మోడీ అంటే గుజరాతీ యులకు బ్రాండ్‌ అంబాసిడర్‌. పార్టీని ఒంటి చేత్తోగెలిపిస్తూ వచ్చింది ఆయనే! ప్రధాని అయ్యాక ఆయన గుజరాత్‌కు ఎన్నో చేశాడు. ఎంతోమంది గుజరాతీయులను ఉన్నత స్థానాలలో పెట్టాడు. ఈ లెక్కన చూస్తే గుజరాత్‌లో బీజేపీకి సీట్లు పెరి గుండాలి. కాని తగ్గాయి.

అంటే ఇది కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వంపై వ్యతిరేకతా? లేక ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకతా? ఖచ్చి తంగా పటేళ్ళ రిజర్వేషన్‌ ఉద్యమం, జిఎస్టీ వంటివి ఈ ఎన్నికల్లో ప్రభావం చూపి బీజేపీ సీట్లకు కోత వేసాయని చెప్పవచ్చు.

ఇదే సమయంలో కాంగ్రెస్‌ను పెంచే దిశగా కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ చేసిన కృషి కూడా కొంతవరకు ఫలితాల నిచ్చే విధంగా వుంది. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ ఎంతో హూందాగా వ్యవహరించాడు. నరేంద్ర మోడీ ప్రధాని స్థాయి నుండి దిగి కాంగ్రెస్‌ నేతలపై విమర్శలు చేసినా రాహుల్‌ పరిమితి దాటలేదు. సరికదా, మోడీపై అసభ్యకర విమర్శలు చేసిన మణిశంకర్‌ అయ్యర్‌ను పార్టీ నుండి సస్పెండ్‌ చేసి తన విలువలను కాపాడుకున్నాడు. గుజరాత్‌ ప్రచారంలో తన భక్తిపై, తన దేవాలయాల సందర్శన లపై బీజేపీ నేతలు వ్యంగ్య విమర్శలు చేసినా, రాహుల్‌ అతిగా స్పందించకుండా వాటిని తిప్పికొట్టిన తీరు కూడా ప్రజలను ఆకట్టుకుంది.

కాకపోతే ఇక్కడ గుజరాతీలకు మోడీ అనే స్థానిక నాయకుడున్నాడు. రాహుల్‌ స్థానికుడు కాదు, కాంగ్రెస్‌కు స్థానికంగా బలమైన నాయకుడు లేడు. ఈ లోపాలవల్లే ఇక్కడ కాంగ్రెస్‌ వెనుకబడింది. అయినా కూడా ఈ ఫలితాలతో కాంగ్రెస్‌ శ్రేణులకు ఒక నమ్మకం వచ్చింది. ఏఐసిసి బాధ్యతలు స్వీకరించాక రాహుల్‌కు తొలి ఎన్నికలివి. ఆయన ప్రచారం సమర్ధవంతంగానే నిర్వ హించాడు. దీంతో పార్టీని నడిపించగల డనే నమ్మకం కలిగింది. కాబట్టి నరేంద్ర మోడీ ఇప్పుడు ఆలోచించాల్సింది కాం గ్రెస్‌ ముక్త భారత్‌ గురించి కాదు, భాజ పాను ఇప్పుడున్నంత బలంగా ఇకముందు కూడా నిలబెట్టుకోవాలనే దాని గురించి...!Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • దండగ... పండగ...
  పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
 • సినిమానూ వదలని సెగ
  నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
 • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
  2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
 • అజీజ్‌ బ్రదర్స్‌పై కేసు
  నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌కు షాక్‌ తగిలింది. ఆయన పైన ఆయన తమ్ముడు, కార్పొరేటర్‌ జలీల్‌ మీద చెన్నైలో చీటింగ్‌ కేసు నమోదైంది. మేయర్‌ అజీజ్‌కు చెందిన స్టార్‌ ఆగ్రో కంపెనీలో వాటా కోసం తాము ఇచ్చిన 42కోట్ల…
 • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
  మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter